ఎంపీ అవినాశ్ అజ్ణాతంలోకి?!

Publish Date:Jan 26, 2023

Advertisement

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.. అజ్ణాతంలోకి పారిపోయేందుకు పక్కాగా ప్లాన్ చేసుకున్నారా? అన్న సందేహాలు రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతున్నాయి. ఆ ప్లాన్ తోనే  ఆయన..  సీబీఐ విచారణకు హాజరు కావాలంటూ ఇచ్చిన నోటీసులకు  అయిదు రోజుల బిజీ షెడ్యూల్ ఉంది.. ఆ తర్వాత  హాజరవుతానంటూ ..  సమాచారం ఇచ్చారని అంటున్నారు?

 అయితే  ఈ విషయాన్ని ముందుగానే  పసిగట్టిన సీబీఐ.. అప్రమత్తమై.. ఆగమేఘాల మీద కోర్టును ఆశ్రయించి.. వైఎస్ ఆవినాష్ రెడ్డి అరెస్ట్‌కు వారెంట్ తీసుకుని   అరెస్ట్ చేసి... హైదరాబాద్‌కు తీసుకు వచ్చి... విచారించేందుకు సీబీఐ తన ప్రయత్నాలను ముమ్మరం చేసిందని అంటున్నారు. ఈ విచారణలో భాగంగానే వైయస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది.  

2019 మార్చిలో మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. అయితే   వివేకా గుండెపోటుతో మరణించారంటూ వైసీపీ  కీలక  నేత విజయసాయిరెడ్డి తొలుత మీడియా సాక్షిగా ప్రకటించారు. ఆ తర్వాత వైయస్ వివేకానందరెడ్డిని గోడ్డలితో అత్యంత దారుణంగా నరికి చంపారంటూ  పోలీసులు కేసు నమోదు చేశారు.

 వివేకా హత్య కేసులో.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైయస్ జగన్ ప్రభుత్వం అనుసరించిన వైఖరి వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో తన తండ్రి  వివేకా హత్య కేసులోని పాత్రదారులు, సూత్రధారులు ఎవరో తేల్చాలంటూ.. ఆయన కుమార్తె  సునీత.. న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో సీబీఐ దర్యాప్తునకు న్యాయస్థానం ఆదేశించింది. ఆ క్రమంలో సీబీఐ విచారణలో వివేకా మాజీ కార్ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్‌గా మారి.. వైఎస్ అవినాష్, ఆయన తండ్రి    భాస్కరరెడ్డితోపాటు పలువురు పేర్లను  వెల్లడించారు. 

ఆ తర్వాత  వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపై కేసులు పెట్టేందుకు పలువురు వ్యక్తులు రంగంలోకి దిగడం.. అలాగే  వివేకా హత్య కేసులో ఆయన కుమార్తె  సునీత, ఆమె భర్త రాజశేఖర రెడ్డిల ప్రమేయం ఉందంటూ పలువురు ఆరోపణలు గుప్పించడం.. వంటి ఘటనలు వరుసగా చోటు చేసుకున్నాయి. అలాగే ఈ హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులకు సైతం  బెదిరింపులు కూడా వచ్చాయి. దీంతో సీబీఐ దర్యాప్తు  వేగం నెమ్మదించింది.  

ఈ నేపథ్యంలో తన తండ్రి హత్య కేసు విచారణ.. మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ..  సునీత.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  దీంతో ఈ కేసు విచారణను తెలంగాణ రాష్ట్ర పరిధిలోకి సుప్రీం కోర్టు బదిలీ చేసింది.   ఈ నేపథ్యంలో   వివేకా హత్య కేసులో సీబీఐ స్పీడ్ పెంచింది. ఈ విషయాన్ని గమనించిన   అవినాశ్ .. విదేశాలకు చెక్కేసేందుకు ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.  ఓ వేళ.. అతడిని అరెస్ట్ చేయకున్నా... అతడి పాస్‌పోర్ట్‌ను   సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేసే అవకాశం ఉందని చర్చ సైతం కడప జిల్లాలో జోరుగా చర్చ జరుగుతోంది.

కాగా అవినాష్ విజ్ణప్తి మేరకు సీబీఐ విచారణకు మరో తేదీని నిర్ణయించింది. ఈ నెల 28న అంటే  శనివారం విచారణకు రావాలంటూ రెండో సారి నోటీసులు జారీ చేసింది. సీబీఐ దూకుడు చూస్తుంటే అవినాష్ అరెస్టు ఖాయమన్న అభిప్రాయం రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతోంది. ఈ నేపథ్యంలోనే సీబీఐ విచారణ తప్పించుకునేందుకు ఆయన అజ్ణాతంలోకి వెళతారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమౌతున్నాయి. ఆయన విదేశాలకు వెళ్లిపోయే అవకాశాలను కూడా కొట్టి పారేయలేమని అంటున్నారు. ఏది ఏమైనా వివేకా హత్య కేసులో అవినాష్ చుట్టూ ఉచ్చు గట్టిగానే బిగుసుకుందని చెబుతున్నారు.

By
en-us Political News

  
వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు  ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్  షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో   షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు.
అధికారిక భేటీ ముసుగులో జరిగిన ఈ గోప్యతా ఉల్లంఘన ఉదంతం ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచేసింది. ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ ఈ అంశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
దేశ రాజధాని ప్రాంతంలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
7.75 లక్షల విలువైన 1,035 కిలోల ఆహార పదార్థాలు సీజ్.!
తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో కరువు పరిస్థితులు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
అమెరికా గడ్డపై మరో తెలుగు కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ప్రకృతి మారుతున్న తీరు ఒకవైపు ఆందోళన కలిగిస్తుంటే, మరోవైపు ప్రభుత్వాల నిర్లక్ష్యం సామాన్యుడి బతుకును మరింత ఛిన్నాభిన్నం చేస్తోంది.
దేవీ నవరాత్రుల సందర్భంగా గ్రామంలో నిర్వహించిన దుర్గామాత నిమజ్జన వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన భారీ డీజే సౌండ్ హోరుకు ఓ పాత ఇందిరమ్మ బిల్డింగ్ స్లాబ్ పెచ్చులు కూలిపడ్డాయి.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
ఉత్తరాఖండ్‌లో నెలకొన్న దుర్భర రవాణా పరిస్థితులను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ఓ నవవధువు ఎంచుకున్న మార్గం అందరినీ విస్మయానికి గురిచేసింది.
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పసిపాప.. క్షణాల వ్యవధిలోనే కన్నుమూసింది.
అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు.  అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది.
అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.