పవన్ కళ్యాణ్ లో కొత్త కోణం ..గమనించారా?

Publish Date:Jan 26, 2023

Advertisement

జనసేన అధినేత పవన్ కళ్యాణ్  ఆ వ్యాఖ్య చేసిన సమయ, సందర్భాలు వేరు కావచ్చును. కానీ, ఎవరైనా వివక్షకు గురైనప్పుడే దాని గురించి తెలుస్తుందని అయన చేసిన వ్యాఖ్యలు, ఇక దేహి అంటే కుదరదని ఎస్సీ, ఎస్టీ లకు చేసిన హిత బోధ, అదే విధంగా వ్యక్తి ఆరాధన గురిచి ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలు ఆయనలో ఎక్కడో అక్కడ రగులుతున్న రాజకీయ ఆకాంక్షలకు అద్దం పడుతున్నట్లు ఉన్నాయి.  నిజానికి, నిన్నమొన్న జరిగిన జనసేన తెలంగాణ కార్యకర్తలు, కార్య నిర్వాహకుల సభలోనే, పవన్ కళ్యాణ్  కొత్త ఆలోచనలకు ముసుగు తీశారు. పొత్తుల విషయంలో స్పష్టత ఇస్తూనే, రాజకీయ కొత్త కోణాన్ని అవిష్కరించారు. ఎక్కడా ఎక్కాలో  కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలనే నానుడి తిరగేసి, ఎక్కడ తగ్గాలోనే కాదు, ఎక్కడ ఎక్కాలో కూడా తెలియాలనే అర్థం వచ్చే విధంగా మాటల గారడీ చేశారు. పొత్తుల విషయంలో ఈ ఇంటికి ఆ ఇల్లు ఎంత దూరమో ఆ ఇంటికి ఈ ఇల్లు అంత దూరం అనే సంకేతాలు ఇచ్చారు. ముఖ్యంగా ఏపీలో బీజేపీ పొత్తు వుంది, ఉంటుంది అంటూనే, అవసరం అయితే కొత్త పొత్తులు ఉంటాయని అన్నారు.  

ఇక ప్రస్తుతానికి వస్తే,   బుధవారం(జనవరి 25) మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. వ్యక్తి ఆరాధన ఎంత మంచిదో.. అంతే ప్రమాదకరమన్నారు. అలాగే, ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో వివక్షకు గురవుతారని.. వివక్షకు గురైనప్పుడే దాని గురించి తెలుస్తుందని పేర్కొన్నారు.సమాజాన్ని కొన్ని కోణాల్లోనే కాదు.. సమగ్రంగా చూడాలని అన్నారు. జనాభాకు తగ్గట్టు బడ్జెట్‌లో కేటాయింపులు జరగాలని అభిప్రాయపడ్డారు. మన కష్టం, శ్రమకు తగ్గ ఫలితం ఉండాలన్నారు. ఎస్సీ, ఎస్టీలు దాదాపు 22 శాతం జనాభా ఉన్నా.. నిధులు ఇవ్వాలని ఇంకా కోరాలా అని ప్రశ్నించారు. ఇకపై దేహి అంటే కుదరదని.. పోరాటాలు చేసి తీసుకోవాలన్నారు. 

నిజమే పవన్ కళ్యాణ్ ఎస్సీ,ఎస్టీలను దృష్టిలో ఉంచుకునే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని అనుకోవచ్చును కానీ, అందులో రాజకీయ ధ్వనులున్నాయని, పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలుకు సంబంధించి పవన్ కళ్యాణ్, బయటి శత్రువుల కన్నా మనతోటి ఉండే శత్రువులనే ముందుగా కనిపెట్టాలని.. మన హక్కులను కాలరాసే ఎవరినైనా ఎదుర్కోవాల్సిందేనని చేసిన వ్యాఖ్యలు, నమ్మిన సిద్ధాంతానికి నిలబడి ఉండేవాడే నాయకుడు అంటూ అయన చేసిన ముక్తాయింపు, పవన్ కళ్యాణ్ లో కొత్త కోణాన్ని అవిష్కరించాయని అంటున్నారు. 

కాగా.. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ మరోమారు, వైసీపీ ప్రభుత్వం ఎస్సీ ఎస్ట్టీలకు చేస్తున్న అన్యాయాన్ని ఎండగట్టారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు చెందిన 27 పథకాలు తీసేశారని చెబుతుంటే చాలా బాధేసిందని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ మూడేళ్లలో రూ. 20 వేల కోట్లు రాకుండా చేశారంటే ఏమనాలని ప్రశ్నించారు. ఎన్ని గొప్ప చట్టాలు, సంస్కరణలు తెచ్చినా ఆచరణలో పెట్టాలి కదా అని నిలదీశారు. ఆచరణలో పెట్టకపోతే చట్టాలు తెచ్చినా ప్రయోజనం ఉండదన్నారు. ఏపీ ప్రభుత్వం పబ్లిసిటీ కోసం రూ. 15 వేల కోట్లు ఖర్చు చేసిందని దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీ నిధులు వారికి రాకుండా దారి మళ్లించి మోసం చేస్తారా అని పవన్‌ కల్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

అవును, పవన్ కళ్యాణ్ చేసిన విమర్శల్లో నిజం వుంది. అలాగే, ఆయన చేసిన వ్యాఖ్యల్లో అంతర్లీనంగా ధ్వనించిన రాజకీయ వ్యాఖ్యానం... పవన్  కళ్యాణ్ లో మరో కోణాన్ని అవిష్కరించిందని, సినిమా భాషలో చెప్పాలంటే, మరో  నటుడిని రాజకీయ తెరకు పరిచయం చేసిందని అంటున్నారు.

By
en-us Political News

  
వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు  ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్  షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో   షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు.
అధికారిక భేటీ ముసుగులో జరిగిన ఈ గోప్యతా ఉల్లంఘన ఉదంతం ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచేసింది. ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ ఈ అంశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
దేశ రాజధాని ప్రాంతంలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
7.75 లక్షల విలువైన 1,035 కిలోల ఆహార పదార్థాలు సీజ్.!
తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో కరువు పరిస్థితులు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
అమెరికా గడ్డపై మరో తెలుగు కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ప్రకృతి మారుతున్న తీరు ఒకవైపు ఆందోళన కలిగిస్తుంటే, మరోవైపు ప్రభుత్వాల నిర్లక్ష్యం సామాన్యుడి బతుకును మరింత ఛిన్నాభిన్నం చేస్తోంది.
దేవీ నవరాత్రుల సందర్భంగా గ్రామంలో నిర్వహించిన దుర్గామాత నిమజ్జన వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన భారీ డీజే సౌండ్ హోరుకు ఓ పాత ఇందిరమ్మ బిల్డింగ్ స్లాబ్ పెచ్చులు కూలిపడ్డాయి.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
ఉత్తరాఖండ్‌లో నెలకొన్న దుర్భర రవాణా పరిస్థితులను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ఓ నవవధువు ఎంచుకున్న మార్గం అందరినీ విస్మయానికి గురిచేసింది.
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పసిపాప.. క్షణాల వ్యవధిలోనే కన్నుమూసింది.
అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు.  అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది.
అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.