పయ్యావులను వైసీపీ ఫేస్ చేయలేకపోతోందా?
Publish Date:Mar 7, 2025
Advertisement
అసెంబ్లీలో డ్రాపౌట్.. మండలిలో వాకౌట్.. వైసీపీపై పయ్యావుల సెటైర్లు ఆర్థిక మంత్రి పయ్యావులను వైసీపీ ఫేస్ చేయలేకపోతోందా? పయ్యావుల ప్రశ్నలకు.. పయ్యావుల విమర్శలకు మండలిలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ సభ్యులు దీటుగా సమాధానం చెప్పలేకపోతున్నారా? పయ్యావుల సమాధానం ఇస్తున్న సమయంలో సభలో ఉండొద్దని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తన పార్టీ ఎమ్మెల్సీలకు ఆదేశాలు జారీ చేశారా? జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శాసన మండలిలో పయ్యావుల రిప్లై ఇవ్వడం మొదలుపెట్టగానే.. మాజీ మంత్రి బొత్స నేతృత్వంలో సభ నుంచి వైసీపీ ఎమ్మెల్సీలు వాకౌట్ చేశారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. పయ్యవులను వైసీపీ ఫేస్ చేయలేకపోతోందనేదే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడిదే అంశం మీద అసెంబ్లీ లాబీల్లో చర్చ నడుస్తోంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తన బడ్జెట్ ప్రసంగంలోనూ.. బడ్జెట్టుపై సమాధానం ఇచ్చే ప్రసంగాల్లోనూ గత పాలకులను తూర్పారబట్టారు. సంచలన కామెంట్లే చేశారు. సమాజానికి వైసీపీ హనికరం అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు డ్రాప్ అవుట్ ఎమ్మెల్యేలన్నారు. ఇప్పటి వరకు వీటికి ప్రతిపక్షం నుంచి కౌంటరే లేకుండా పోయింది. తమ ప్రత్యర్థి తెలుగుదేశం కానీ.. ప్రభుత్వంలో ఎవరైనా మంత్రులు కానీ తమ మీద.. తమ పార్టీ మీద కామెంట్లు చేస్తే సహించే వారు కారు వైసీపీ నేతలు. అధికారంలో ఉన్నప్పుడే కాకుండా.. ఓటమి తర్వాత కూడా తెలుగుదేశం వైపు నుంచి వస్తోన్న కామెంట్లకు వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. కానీ పయ్యావుల చేసిన విమర్శలు, వ్యాఖ్యలకు మాత్రం ఇప్పటికీ వైసీపీ నుంచి సౌండ్ లేదు. ఇటీవల జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో మంత్రి పయ్యావులకు గట్టిగా రిప్లై ఇస్తారని అంతా భావించారు. కానీ జగన్ ఆ ఊసే ఎత్తలేదు. ఆ తర్వాత తెలిసిన విషయమేమిటంటే.. పయ్యావుల కేశవ్ సభలో చేసిన కామెంట్ల గురించి ఎవ్వరూ ప్రస్తావించ వద్దని.. తనను ఆ ప్రశ్నలు వేయకుండా మీడియా ప్రతినిధులకూ సూచించాలని జగన్ మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ మీడియా విభాగం వారికి ఆదేశాలు జారీ చేశారట. దీంతో ఆ పార్టీ మీడియా విభాగం రిక్వెస్ట్ మేరకు మీడియా ప్రతినిధులు కూడా పయ్యావుల ప్రశ్నలను జగన్ మోహన్ రెడ్డి వద్ద ప్రెస్ మీట్లో ప్రస్తావించ లేదట. ఈ చర్చ రెండు రోజుల నుంచీ జరుగుతూనే ఉంది. అయితే ఇందులో ఎంత వరకు నిజముందోననేది క్లారిటీ రాలేదు. కానీ ఇవాళ శాసన మండలిలో జరిగిన పరిణామంతో ఈ విషయంపై క్లారిటీ వచ్చేసిందనే చర్చ అసెంబ్లీ లాబీల్లో జరుగుతోంది. శాసన మండలిలో ఇవాళ ఆర్థిక మంత్రి పయ్యావుల బడ్జెట్ పై జరిగిన చర్చకు సమాధానం ఇవ్వాల్సి ఉంది. అయితే పయ్యావులప్రసంగం ఆరంభించడానికి కొద్దిసేపటి ముందే సభ నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్ చేసి వెళ్లిపోయారు. ఇప్పటి వరకు అన్ని అంశాల మీద చర్చలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్సీలు.. సరిగ్గా మంత్రి పయ్యావుల బడ్జెట్ పై చర్చకు సమాధానం ఇస్తుంటే వాకౌట్ చేసి ఎందుకు వెళ్లిపోయారోననే చర్చ జరిగింది. తీరా తెలిసిన విషయమేమిటంటే.. పయ్యావుల సమాధానం ఇచ్చే సమయంలో వైసీపీ ఎమ్మెల్సీలు ఎవ్వరూ సభలో ఉండకూడదని తాడేపల్లి ప్యాలెస్ నుంచి జగన్ మోహన్ రెడ్డి ముందుగానే ఆదేశాలు జారీ చేశారట. పయ్యావుల సమాధానం ఇస్తున్న సమయంలో సభలో ఉంటే.. పయ్యావులకు దీటుగా బదిలివ్వలేక ఇబ్బందులు పడాల్సి వస్తుందనే భావనతో సభ నుంచి జంప్ అవ్వాల్సిందిగా జగన్ మోహన్ రెడ్డి సూచించారని ఆ పార్టీ ఎమ్మెల్సీలే గుసగుసలాడుకుంటున్నారని అశెంబ్లీ లాబీల్లో చర్చ జరిగింది. మొత్తానికి సభ్యుల్లేని అసెంబ్లీలో తాను చెప్పాల్సింది చెప్పేశాను.. కనీసం మండలిలోనైనా ప్రతిపక్ష సభ్యులు ఉంటారు కాబట్టి.. వారేమైనా సలహాలో.. సూచనలో చేస్తే.. వాటిని విందామని అనుకుంటే.. శాసన మండలిలో కూడా తనకు ఆ అవకాశం లేకుండా చేశారని మంత్రి పయ్యావుల శాసన మండలి సభ్యులతో అన్నారు. అసెంబ్లీలో డ్రాప్ అవుట్.. కౌన్సిల్లో వాకౌట్ అన్నట్టుగా వైసీపీ వ్యవహరిస్తోందంటూ మంత్రి పయ్యావుల చురకలూ అంటింటారు.
http://www.teluguone.com/news/content/ycp-mlcs-fear-to-face-payyavula-in-mandali-39-194031.html





