పరారీలో వైసీసీ ఎమ్మెల్సీ అనంతబాబు

Publish Date:Apr 21, 2026

Advertisement

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు పరారీలో ఉన్నారు. తన మాజీ డ్రైవర్, దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించారన్న ఆరోపణలపై ఆయనపై కొత్తగా కేసు నమోదైంది. ఈ క్రమంలో మంగళవారం (ఏప్రిల్ 21) రాత్రి కాకినాడలోని ఆయన నివాసానికి పోలీసులు చేరుకోగా, అప్పటికే ఆయన పరారయ్యారు.  సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణను ప్రభావితం చేసేందుకు అనంతబాబు ప్రయత్నిస్తున్నారనీ..  కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పాలంటూ తమకు డబ్బు ఆశ చూపి, ప్రాణహాని తలపెడతామని బెదిరించారని నలుగురు కీలక సాక్షులు సర్పవరం పోలీస్ స్టేషన్‌లో  చేసిన ఫిర్యాదు మేరకు   పోలీసులు అనంతబాబు, ఆయన అనుచరులపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో ప్రమేయమున్న అనంతబాబు అనుచరుడు మాగంటి రాంబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

2022లో జరిగిన సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో సుప్రీంకోర్టు  ఆయనకు బెయిలు మంజూరు చేయడంతో.. ఆయన బయట ఉన్నారు.  సాక్షులను ప్రభావితం చేస్తే బెయిల్ రద్దు చేస్తామని సుప్రీంకోర్టు ఆయన్ను గతంలోనే హెచ్చరించింది. ఈ నెల 24, 25 తేదీల్లో ఈ హత్య కేసులో అభియోగాల నమోదు జరగాల్సి ఉండగా, అంతకు ముందే  అనంతబాబు సాక్షులను బెదరించారన్న ఆరోపణలతో ఫిర్యాదులు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

మంగళవారం (ఏప్రిల్ 21) పోలీసులు ఆయన నివాసానికి వెళ్లిన సమయంలో ఆయన గన్ మన్ అక్కడే ఉన్నారు. కారు కూడా ఇంటివద్దే ఉంది. ఆయన మోటార్ సైకిల్ పై పరారైనట్లు పోలీసులు గుర్తించారు.   పరారీలో ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు  పరారీ వార్త ప్రస్తుతం  

By
en-us Political News

  
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారానికి హైకోర్టు తీర్పు గట్టి సమాధానమని కేసీఆర్ అన్నారు.
మోహన్ భాగవత్‌కు కల్పించిన జడ్‌ ప్లస్ కేటగిరీ భద్రతను సవాలు చేస్తూ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ముంబైలో నడి రోడ్డుపై మహారాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి గిరీశ్‌మహాజన్‌పై ఒక విద్యావంతురాలైన తల్లి మండిపడ్డ తీరు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
బాణాసంచా తయారీ కేంద్రాలు ..మృత్యు కుహరాలుగా మారుతున్నాయి.
ఇండోనేషియాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బాలిలో భారతీయ పర్యాటకులు చేసిన ఒక పని ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన భయంకరమైన ఉగ్రదాడికి ఏడాది పూర్తయింది.
కడప నగరంలో జరిగిన ఒక విషాదకర ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
ఏపీలో పీపీపీ విధానంలో నిర్మించ తలపెట్టిన మెడికల్ కాలేజీల పనులను నెల రోజుల్లో ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
ఇప్పటికే ఈ హత్య కేసులో పీకల్లోతు కష్టాల్లో ఉన్న అనంతబాబు.. తాజాగా సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యారు. సాక్షులను భయపెట్టి, డబ్బు ఆశ చూపి తన వైపు తిప్పుకునేందుకు చేసిన ప్రయత్నం విఫలం కావడమే కాకుండా.. ఇప్పుడు ఆ ప్రయత్నం ఆయన బెయిల్ రద్దుకు దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
నేపాల్ ప్రభుత్వం తన ప్రభుత్వ ఉద్యోగుల వేతన చెల్లింపు విధానంలో సంచలనాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది.
తన రాజకీయ చతురతతో, దార్శనికతతో రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించిన ఒక విజనరీ లీడర్ చంద్రబాబు కథను సెల్యులాయిడ్ పై చూడటం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రగతి దీర్ఘకాలం పాటు కొనసాగించాలంటే దేశీయంగా ఉన్న కొన్ని లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. గడిచిన కొన్నేళ్లుగా భారత వాస్తవ జీడీపీ వృద్ధి సగటున 7.7 శాతంగా నమోదవుతోంది. ముఖ్యంగా పొరుగు దేశమైన చైనా 4.6 శాతం వృద్ధి వద్ద ఆగిపోగా, ఇతర వర్ధమాన దేశాలు 3.4 శాతానికే పరిమితమయ్యాయి.
నాదెండ్ల భాస్కరరావు ఆత్మకథ వాకింగ్ విత్ డెస్టినీ అన్న పుస్తకంలో అసలు ఏముంది?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.