అభి‘షేర్’శర్మ సిక్సర్ల సునామీ.. ఢిల్లీ క్యాపిటల్స్ పై ఎస్ఆర్ హెచ్ సునాయాస విజయం

Publish Date:Apr 21, 2026

Advertisement

ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్  హ్యాట్రిక్ విజయాలు సాధించింది. హైదరాబాద్  రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో మంగళవారం (ఏప్రిల్ 21) రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆరెంజ్ ఆర్మీ పరుగుల సునామీ సృష్టించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ అజేయ,  శతకంతో కదం తొక్కడంతో, ఢిల్లీ క్యాపిటల్స్‌పై 47 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ ఘన విజయం సాధించింది. సన్ రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ.. అభిషేర్ శర్మలా మారిపోయి సిక్సర్ల మోత మోగించాడు. కేవలం 68 బంతుల్లో 10 ఫోర్లు, 10 భారీ సిక్సర్లతో 135 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. సొంతగడ్డపై సన్‌రైజర్స్ కు ఇది వరుసగా మూడో విజయం. ఈ విజయంతో ప్లేఆఫ్స్ దిశగా మరో అడుగు వేయడమే కాకుండా, పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్  పరుగుల వరద పారించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ ప్రత్యర్థి బౌలింగ్ ను ఊచకోత కోశాడు.  మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్37 పరుగులు, ఇషాన్ కిషన్  పాతిక పరుగులు చేశారు.  చివరిలో హెన్రిచ్ క్లాసెన్   తనదైన శైలిలో మెరుపులు మెరిపించి 13 బంతుల్లో 37 పరుగులు చేశాడు. దీంతో సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో  2 వికెట్ల నష్టానికి 242 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది.

భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ పోరాడినప్పటికీ, క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడంతో లక్ష్యానికి దూరంగా నిలిచిపోయింది. నితీశ్ రాణా  30 బంతుల్లో 57 పరుగులు, సమీర్ రిజ్వీ 41 పరుగులు, కేఎల్ రాహుల్ 37 పరుగులు రాణించినా ఫలితం లేకపోయింది. మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో..లక్ష్యానికి దూరంగా నిలిచిపోయింది.  సన్‌రైజర్స్ బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. యువ పేసర్ ఎషాన్ మలింగ  ఢిల్లీ పతనాన్ని శాసించాడు. కీలకమైన డేవిడ్ మిల్లర్  , ట్రిస్టన్ స్టబ్స్  సహా మొత్తం 4 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు, యువ స్పిన్నర్ హర్ష్ దూబే తన మాయాజాలంతో ఆకట్టుకున్నాడు. కేవలం 2 ఓవర్లు బౌలింగ్ చేసి 12 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీసి ఢిల్లీ ఓటమిని ఖాయం చేశాడు. దీంతో ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 195 పరుగులకే పరిమితమైంది. ఈ గెలుపుతో సన్‌రైజర్స్ 7 మ్యాచ్‌లలో 4 విజయాలు, 8 పాయింట్లతో పట్టికలో మూడో స్థానానికి చేరింది.  

By
en-us Political News

  
బ్యాంకు అధికారులు తన సోదరి చనిపోయిందని నమ్మడం లేదనీ.. ఆమెను స్వయంగా తీసుకురావాలని అన్నారని అంటాడు జీతూ. అమాయకత్వం, చదువు లేకపోవడం, బ్యాంకు నిబంధనల పట్ల త‌గిన‌ అవగాహన లేకపోవడంతో.. తన సోదరి చనిపోయిందని నిరూపించడానికి ఆమె సమాధిని తవ్వి, అందులోని అస్తిపంజరాన్ని సంచిలో వేసుకుని 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్యాంకుకు కాలినడకన చేరుకున్నాడు జీతూ.
చంద్రబాబు నాయుడుకు హైటెక్ అనే పేరు ఊరికే రాలేదు. 90వ దశకంలోనే ఐటి ప్రాధాన్యతను గుర్తించి, చేతిలో ఒక పామ్ టాప్ పట్టుకుని తిరుగుతూ అప్పట్లోనే అందరినీ ఆశ్చర్యపరిచారు చంద్ర‌బాబు. తాజాగా గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఆయన ఫోన్ చూసి ఆశ్చర్యపోవడం, బాబు గారి అప్‌డేటెడ్ లైఫ్‌స్టైల్‌కు మరో నిదర్శనంగా చెబుతారు.
బంగ్లాదేశ్‌లోని 64 జిల్లాలకు గానూ 58 జిల్లాల్లో మీజిల్స్ వేగంగా విస్తరిస్తోంది. దాదాపు 90 శాతం దేశం మీజిల్స్ ప్రభావానికి గురైంది. మార్చి మధ్య కాలం నుండి ప్రారంభమైన ఈ వ్యాప్తి ఉధృతి ఏప్రిల్ ఆఖరు నాటికి పతాక స్థాయికి చేరింది. సుమారు 30 వేల మందికి పైగా చిన్నారులు.. మీజిల్స్ లక్షణాలతో బాధపడుతుండగా, మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
మెట్రో మొదటి దశ కార్యకలాపాల బాధ్యతలను ప్రభుత్వం పూర్తిగా స్వీకరించే దిశగా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం నాటికి ఈ బదలాయింపు ప్రక్రియ ముగియ నుంది. వచ్చే నెల 1 నుంచి అంటే శుక్రవారం నుంచీ హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ పరిధిలోకి 69.2 కిలోమీటర్ల నెట్‌వర్క్ రానుంది.
బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాకు చెందిన వైభవ్ సూర్యవంశీ ప్రస్థానం స్ఫూర్తిదాయకం. తండ్రి సంజీవ్ ప్రోత్సాహంతో నాలుగేళ్ల వయసు నుంచే క్రికెట్ బ్యాట్ పట్టిన ఈ యువకుడు.. 12 ఏళ్లకే రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసి రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత అండర్-19 ప్రపంచకప్ 2026లో టీమ్ ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించి, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచాడు.
యూఏఈ తన ప్రయోజనాలకు అనుగుణంగా చమురు ఉత్పత్తిని స్వతంత్రంగా నిర్ణయించుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఇంధన అవసరాలు మారుతున్న తరుణంలో.. క్లీన్ ఎనర్జీ తదితర ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అవసరమైన నిధులను చమురు ఎగుమతుల ద్వారా గరిష్టంగా సంపాదించాలని చూస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
223 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన రాజస్థాన్ కు అదిరిపోయే ఆరంభం లభించింది. బేబీ బాస్ గా అభిమానులు పిలుచుకుంటున్న వైభవ్ సూర్యవంశీ పంజాబ్ బౌలర్లపై సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 16 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 43 పరుగులు చేశారు. వైభవ్ సూర్యవంశి ఔటైన తరువాత యశస్వి జైస్వాల్ 27 బంతుల్లో 51 పరుగులతో ఆకట్టుకున్నాడు. అప్పటి వరకూ సాఫీగా సాగుతున్న రాజస్థాన్ ఇన్నింగ్స్ కు చాహల్ బ్రేక్ వేశాడు.
పదో తరగతి పరీక్ష ఫలితాల విడుదలకు ముందుగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ భావోద్వేగపూర్వక సందేశం ఇచ్చారు.
ఇద్దరు బాలురు ఫోన్ చూస్తూ ఆడుకుంటుండగా వారి మధ్య వివాదం జరిగింది.
క్యారియర్ ఎండీ సుందర్ నారాయణన్‌తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు.
హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ స్మగ్లింగ్‌పై కట్టుదిట్టమైన నిఘా ఫలితంగా వరుసగా రెండు భారీ పట్టివేతలు చోటుచేసుకున్నాయి.
రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్‌పేటలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి .సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేశారు
ట్రంప్ హాజరైన వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ సందర్భంగా చోటుచేసుకున్న కాల్పుల ఘటన అంతర్జాతీయంగా తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.