అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు?.. జగన్ రెడ్డి మాట మార్చి మడమ తిప్పేశారా?

Publish Date:Sep 17, 2025

Advertisement

వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కానున్నారు. గురువారం (సెప్టెంబర్ 18) నుంచి  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్నాయి. ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేది లేదని ఇప్పటికే పలు మార్లు వైసీపీ అధినత జగన్ చెప్పారు. అయితే మాట అదే అయినా, ఇప్పుడు చేత మారుతున్న సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.  ఇటీవల కూడా జగన్ స్వయంగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాబోవడం లేదని స్పష్టంగా చెప్పారు. అసెంబ్లీకి హాజరు కాకపోవడమే ఖరారైతే.. ఆయన హడావుడిగా తాడేపల్లి ప్యాలెస్ లో పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ కావలసిన అవసరం లేదు. సరిగ్గా అసెంబ్లీ సమావేశాల రోజునే అంటే గురువారం (సెప్టెంబర్ 18)న తన తాడేపల్లి ప్యాలెస్ లో జగన్ పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అవుతున్నారు.  దీనిపై జగన్ సొంత మీడియా కూడా క్లారిటీ ఇచ్చింది. జగన్ పార్టీ ఎమ్మెల్యేలతో ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం పై సభలో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించనున్నారని పేర్కొంది.  

దీనిని బట్టి ప్రతిపక్ష హోదా  విషయాన్ని వదిలేసి జగన్, ఆయన పార్టీ ఎమ్మెల్యేలూ అసెంబ్లీకి హాజరౌతున్నారా అన్న చర్చ జరుగుతోంది. ఒక వేళ జగన్ తాను డుమ్మా కొట్టి, తన పార్టీకి చెందిన మిగిలిన పది మంది ఎమ్మెల్యేలనూ సభకు పంపుతారా? అన్న అన్న చర్చ కూడా జరుగుతోంది. ఒక వేళ జగన్ అసెంబ్లీ బహిష్కరణకే కట్టుబడి ఉంటే.. ఆయన ఆదేశాలను ధిక్కరించి అయినా సరే కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారన్న ప్రచారం జోరుగా సాగింది. దీంతో జగన్ వ్రతం చెడ్డా ఫలమైనా దక్కితే చాలన్నట్లుగా అసెంబ్లీ హాజరుకు, ప్రతిపక్ష హోదాకూ ముడిపెట్టవద్దన్న నిర్ణయానికి వచ్చి ఉంటారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఈ విషయంలో ఆయన పొరుగు రాష్ట్రం   తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, తన స్నేహితుడు అయిన కేసీఆర్ బాటలో నడవాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోందంటున్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా తాను అసెంబ్లీకి హాజరు కాకపోయినప్పటికీ ఆయన పార్టీ ఎమ్మెల్యేలు సభకు హాజరౌతున్నారు. జగన్ కూడా అదే విధంగా తాను అసెంబ్లీకి గైర్హాజరైనా పార్టీ ఎమ్మెల్యేలను సభకు పంపాలని నిర్ణయించుకున్నారంటున్నారు. అందుకే ఆయన పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అవుతున్నారనీ, ఆ భేటీలో ఆయన ఎమ్మెల్యేలకు సభలో వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేస్తారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  దీని వల్ల జగన్ కు అదనంగా ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండదని కూడా అంటున్నారు. జగన్ హాజరు కాకుండా ఎమ్మెల్యేలను సభకు పంపినా జగన్ పారిపోయారన్న విమర్శలు ఎదుర్కొనక తప్పదని అంటున్నారు.  

By
en-us Political News

  
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం  వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక  ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..   తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ..  వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.  
 ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై  చార్జ్‌షీట్‌  విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్  ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు.  తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే..  మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి  సొంత నియోజకవర్గానికే  ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.  
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో  గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన  బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న  నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి. 
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.