ఇల్లీగల్ ఎఫైర్స్.. వెలుగులోకి వైసీపీ నేతల బండారం
Publish Date:Aug 9, 2024
Advertisement
ఏపీలో ప్రతిపక్ష వైసీపీ పేరు త్వరలోనే ఇల్లీగల్ ఎఫైర్స్ పార్టీగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీ నేతల చీకటి కోణాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రాష్ట్ర ప్రజలను విస్మయానికి గురి చేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొందరు నేతల రాసలీలలకు సంబంధించిన ఆడియోలు వెలుగులోకి వచ్చాయి. అధికారం కోల్పోయిన తరువాత ఆ పార్టీ నేతల ఇల్లీగల్ ఎఫైర్స్ ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. అధికారంలో కొనసాగిన ఐదేళ్లు అవినీతి, అక్రమాలతో ప్రజా ధనాన్ని దోచుకున్న వైసీపీ నేతలు.. అదే తరహాలో చీకటి వ్యవహారాలను నడిపారు. ఇప్పటికే వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి, ఓ ప్రభుత్వ మహిళా ఉద్యోగికి ఉన్న సంబంధంపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంపై రచ్చనడుస్తున్న నేపథ్యంలోనే తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రాసలీలల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అయితే వైసీపీలో ఇలాంటి ఘన కార్యాలు చేసిన వాళ్లు చాలా మంది ఉన్నారని, వారి వ్యవహారాలు వరుసగా బయటకు వస్తాయన్న ప్రచారం జరుగుతోంది. అధికారంలో ఉన్నప్పుడే అంబటి రాంబాబు ఆడియో టేపులు బయటకు వచ్చాయి. ఇప్పుడు వీడియో టేపులు కూడా వస్తాయా అన్న చర్చ వైసీపీ వర్గాల్లో జరుగుతోంది. ఎన్నికల ప్రచార సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ నేతలు ఇష్టారీతిలో విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ డస్సులు మార్చినట్లు పెళ్లాలను మార్చే్స్తారంటూ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పలుసార్లు అనుచిత వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ కు మూడు పెళ్లిళ్లు అయిన మాట వాస్తవమే. పవన్ నుంచి విడిపోయిన ఇద్దరు మహిళలు కూడా విడాకులు తీసుకొని విడిపోయారు. పవన్ వల్ల తమకు ఇబ్బంది తలెత్తిందని వారు ఏనాడూ అనలేదు. పవన్ సైతం మూడు పెళ్లిళ్ల వ్యవహారంపై స్పందిస్తూ.. అదంతా నా తలరాత అంటూ చెప్పుకొచ్చారు. అయినా పవన్ పెళ్లిళ్ల విషయంలో వైసీపీ నేతలు అడపాదడపా విమర్శలు చేస్తూ వస్తున్నారు. పవన్ పై విమర్శలు చేసిన వైసీపీ నేతలు ఏమైనా శ్రీరామచంద్రుడిలా ఏకపత్నీవ్రతులా అంటే అదీకాదు. ఏదైనా పనికోసం వారి సహాయంకోరి వచ్చిన మహిళలను ట్రాప్ చేసి లోబర్చుకొని పలువురు వైసీపీ నేతలు వారి జీవితాలతో ఆడుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీలోని కొందరు నేతల వ్యవహారశైలితో పలువురు మహిళలు పార్టీ అధిష్టానానికి పిర్యాదులు కూడా చేశారు. అయితే. అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకోకపోవటంతో బాధిత మహిళలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కొందరు వైసీపీ నేతల అసభ్యకర వ్యవహారంపై పలువురు మహిళలు పోలీసులను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గతంలో దువ్వాడ శ్రీనివాస్ సైతం పవన్ మూడ పెళ్లిళ్ల వ్యవహారంపై విమర్శలు చేసినవారే. హిందూ మతాన్ని గౌరవించేవారు ఒకే స్త్రీని పెళ్లాడాలని, కానీ, ఆ సంప్రదాయాలకు తూట్లు పొడిచిన వ్యక్తి పవన్ కల్యాణ్ అంటూ విమర్శలు చేశాడు. దువ్వాడ చెప్పిన హిందూమతం సంప్రదాయాలు ఎటుపోయాయి అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. నీతులన్నీ పక్కవారికి చెప్పటానికేనా.. వాటిని వైసీపీ నేతలు పాటించరా అంటూ ప్రశ్నిస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ - వాణి దంపతులకు పెళ్లయిన, పెళ్లీడుకు వచ్చిన ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన వయసు కూడా అరవై ఏళ్లకు దగ్గర పడింది. ఇలాంటి సమయంలో ఆయన మరో మహిళతో సహజీవనం చేస్తున్నారు. అలా చేస్తూ.. సొంత కుటుంబానికి అన్యాయం చేస్తూండటంతో విషయం రోడ్డున పడింది. వైసీపీకి చెందిన మహిళా నేత దివ్వెల మాధురితో దువ్వాడ శ్రీనివాస్ కలిసి ఉంటున్నట్లు ఆయన భార్య దువ్వాడ వాణి, వారి పిల్లలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో దువ్వాడ ఇద్దరు పిల్లలు ఆయన నివాసం ఉంటున్న ఇంటి వద్దకు వెళ్లినా వారిని లోపలికి రానివ్వలేదు. చాలాసేపు కారులో వేచిఉన్న దువ్వాడ కుమార్తెలు.. ఆ తరువాత తిరిగి వెళ్లిపోయారు. ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో దివ్వెల మాధురి మీడియా ముందుకొచ్చారు. మీడియా సమావేశంలో దువ్వాడ శ్రీనివాస్ కు ఆమెకు ఉన్న సంబంధంపై మాధురి క్లారిటీ ఇచ్చారు. దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణికి ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటే తన భర్త దగ్గరికి వెళ్లి తేల్చుకోవాలి.. లేకపోతే లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలి. కానీ, నా లైఫ్ ని మధ్యలో ఎందుకు లాగుతున్నారు అంటూ మాధరి ప్రశ్నించారు. తాను దువ్వాడతోనే ఉంటున్నాననీ, తనపై వచ్చిన ఈ మచ్చ లైఫ్ లో ఎప్పటికీ పోదనీ నిస్సిగ్గుగా చెప్పుకొచ్చారు. ఒక ఫ్రెండ్ గా దువ్వాడ శ్రీనివాస్ తోనే ఉంటాను అంటూ మాధురి స్పష్టంగా చెప్పారు. మొన్న విజయసాయిరెడ్డి వ్యవహారం, తాజాగా దావ్వాడ శ్రీనివాస్ వ్యవహారం చూసిన ఏపీ ప్రజలు.. అది వైసీపీ కాదు.. ఇల్లీగల్ ఎఫైర్స్ పార్టీ అంటూ విమర్శిస్తున్నారు. రాబోయే రోజుల్లో వైసీపీ నేతల చీకటి వ్యవహారాలు మరిన్ని వెలుగులోకి వస్తాయని వైసీపీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది.
http://www.teluguone.com/news/content/ycp-leaders-illegal-affairs-25-182637.html





