దువ్వాడ శ్రీనివాస్ మేటర్.. చాలా పెద్ద వ్యవహారం!
Publish Date:Aug 9, 2024
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వున్న విచిత్రమైన కేరెక్టర్లన్నీ కట్టకట్టుకుని వైసీపీలో ఆశ్రయం పొందినట్టు వున్నాయి. వాళ్ళలో ఒక ముఖ్యమైన కేరెక్టర్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. గురువారం రాత్రి దువ్వాడ శ్రీనివాస్ ఇద్దరు కుమార్తెలు ఆయన ఇంటి ముందు కారులో వెయిట్ చేయడం, వారిద్దరినీ ఆయన లోపలకి రానివ్వకపోవడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. కన్న కూతుళ్ళు రాత్రి వేళలో ఇంటి ముందుకు వచ్చినా, దువ్వాడ శ్రీనివాస్ లోపల వుండి కూడా స్పందించకపోవడంతో జనం దృష్టి ఈ మేటర్ మీద పడింది. శుక్రవారం నాడు ఈ మేటర్ మరింత రసకందాయంలో పడింది. మొదట దువ్వాడ శ్రీనివాస్ పెద్ద కుమార్తె మీడియా ముందుకు వచ్చారు. తన తండ్రిని తమ నుంచి దివ్వెల మాధురి అనే మహిళ దూరం చేసిందని, ఆమె వల్లే తమ కుటుంబంలో సమస్యలు తెలెత్తాయని చెప్పారు. అలాగే దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి కూడా దివ్వెల మాధురి మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. తన భర్తతో మాధురి అక్రమ సంబంధం పెట్టుకుని ఆయన్ని తమకు దూరం చేసిందని, ఇక తనకు దువ్వాడ శ్రీనివాస్‌తో ఎలాంటి సంబంధం, అవసరం లేదని చెప్పారు. కాకపోతే, ఆయన టెక్కలిలో తన రాసలీలలు జరపడం వల్ల తనకు, తన కుమార్తెకు సమస్యగా మారిందని, ఆయన టెక్కలి నుంచి వెళ్ళిపోతే మంచిదని ఆమె చెప్పుకొచ్చారు. తన భర్తని లోబరుచుకున్న దివ్వెల మాధురి చాలామంది మహిళల అభ్యంతరకర వీడియోలు తీసి వాళ్లని బ్లాక్ మెయిల్ చేస్తోందని కూడా వాణి ఆరోపించారు. అయితే దివ్వెల మాధురి మీద వాణి చేసిన ఆరోపణలు వాస్తవాలా కాదా అనే విషయంలో చాలామందిలో సందిగ్ధం ఏర్పడింది. ఈ ముగ్గురూ వైసీపీ నాయకులే కాబట్టి, రాజకీయ కక్షలు ఏవైనా మనసులో పెట్టుకుని దివ్వెల మాధురి మీద వాణి ఆరోపణలు చేస్తున్నారన్న కోణంలో కూడా చాలామంది ఆలోచించారు. అయితే ఈ విషయంలో ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదని దివ్వెల మాధురి ప్రెస్‌మీట్ పెట్టిన తర్వాత క్లారిటీ వచ్చింది. దివ్వెల మాధురి చెబుతున్నదాని ప్రకారం, సమాజంలో ఎంతో ఉన్నత స్థానంలో వున్న తన మీద దువ్వాడ శ్రీనివాస్ భార్య రాజకీయాల కోసం దుష్ప్రచారం చేయడం ప్రారంభించారు. దువ్వాడ శ్రీనివాస్‌తో సంబంధం వుందని ప్రచారం చేశారు. దాంతో తనకు ఏం చేయాలో అర్థంకాక, ఆత్మహత్యకు ప్రయత్నిస్తే, దువ్వాడ శ్రీనివాస్ తనకు ధైర్యం ఇచ్చారు. తన దగ్గరే ‘వుంచుకున్నారు’. దాంతో అప్పటి నుంచి తాను దువ్వాడ శ్రీనివాస్‌తోనే కలసి వుంటోంది. దువ్వాడ శ్రీనివాస్‌తో ఆమె చాలా ‘సన్నిహితంగా’ వుంటోంది. దువ్వాడ శ్రీనివాస్, తన మధ్య వున్నది అక్రమ సంబంధం కాదు.. సక్రమ సంబంధమే అనుకుంటున్నాను... అని మాధురి చెబుతున్నారు. దువ్వాడ శ్రీనివాస్‌తో తనకు సంబంధం వుందని ఆమె స్పష్టంగా చెబుతున్నారు. భవిష్యత్తులో తాము పెళ్ళి చేసుకున్నా చేసుకోవచ్చని అంటున్నారు. మొత్తమ్మీద ఆలోచిస్తే అర్థమవుతున్న విషయం ఏమిటంటే, ఇది వైసీపీ రాజకీయాల బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతున్న ‘ఆయనకిద్దరు’ సినిమా. ఒకపక్క దువ్వాడ శ్రీనివాస్ భార్య, ఆయన కుమార్తెలు దువ్వాడ శ్రీనివాస్‌ని మాధురి లొంగదీసుకుందని బాధపడుతుంటే, మరోవైపు దివ్వెల మాధురి అవును.. నాకు, దువ్వాడ శ్రీనివాస్‌కి సంబంధం వుందని స్పష్టంగా చెబుతున్నారు. దీన్ని రాజకీయ సమస్య అనాలో, కుటుంబ సమస్య అనాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. అవును.. నాకు, దువ్వాడ శ్రీనివాస్‌తో సంబంధం వుంది అని దివ్వెల మాధురి మీడియా ముందు ధైర్యంగా చెప్పడం చూసి చాలామంది బుర్ర తిరిగిపోయింది. ఇంత జరుగుతున్నా దువ్వాడ శ్రీనివాస్ బయటకి రావడం లేదు.
http://www.teluguone.com/news/content/duvvada-srinivas-issue-25-182633.html





