గోరంట్ల మాధవ్ పై చర్యకు వైసీపీ ఎందుకు జంకుతోంది? కారణమదేనా?

Publish Date:Aug 5, 2022

Advertisement

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ డర్టీ వీడియోతో అడ్డంగా దొరికిపోయినా జగన్ ఆయన మీద చర్య తీసుకోవడానికి వెనుకాడుతున్నారు. మాధవ్ ఆ వీడియోలో ఉన్నది తాను కాదనీ, మార్ఫింగ్ చేశారని ఆరోపిస్తున్నారనీ, విచారణ అనంతరం వీడియో మార్ఫింగ్ కాలేదని తేలితే చర్య తీసుకుంటామని మంత్రులు అంటున్నారు.

అంతే తప్ప ఇప్పటి వరకూ ఈ విషయంలో ఎలాంటి చర్యకూ ఉపక్రమించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇంతటి అసహ్యకరమైన రీతిలో మాధవ్ దొరికిపోయినా.. సామాజిక మాధ్యమంలో మాధవ్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నా, మాధవ్ పై చర్యకు మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నా వైసీపీ సర్కార్ లో కదలిక లేకపోవడానికి కారణమేమిటి? మాధవ్ పై చర్యకు జగన్ జంకుతున్నారా? మాధవ్ పై చర్య తీసుకుంటే మరో ఇద్దరు, మంతి అంబటి రాంబాబు, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ల మాటేమిటని జనం నిలదీస్తారన్న భయమా అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు. ఇంతటి జగుప్సాకర రీతిలో మాధవ్ న్యూడ్ వీడియో కాల్ మాట్లాడుతూ దొరికిపోయినా విచారణ, నిజం నిగ్గు తేలాలంటూ చర్యలు తీసుకోకుండా జాప్యం చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అసలు ఏదైనా తీవ్ర మైన ఆరోపణ వచ్చినప్పుడు అదీ బాధ్యతాయుతమైన ఎంపీ వంటి ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తిని ముందు పార్టీ నుంచి సస్పెండ్ చేసి విచారణలో నిర్దోషి అని తేలితే అప్పుడు తిరిగి తీసుకోవాలి. కానీ వైసీపీ మాత్రం గోరంట్ల మాధవ్ విషయంలో  చర్యకు వెనుకాడుతోంది. ఇందుకు కారణం మాధవ్ నైజమేనని పార్టీ వర్గాలే అంటున్నాయి. గతంలో జేసీ దివాకర్ రెడ్డిని సవాల్ చేసిన గోరంట్ల.. ఇప్పుడు ఈ వీడియో విషయంలో తనపై చర్య తీసుకుంటే జగన్ ను సైతం సవాల్ చేయడానికి వెనుకాడడన్న జంకే అతడి పై చర్య విషయంలో వైసీపీ ముందు వెనుకలాడటానికి కారణమంటున్నారు. అంబటి, ఆవంతి శ్రీనివాస్ లపై చర్య ఎందుకు తీసుకోలేదనీ, బీసీని కావడం వల్లే తనపై చర్య తీసుకున్నారనీ యాగీ చేసే అవకాశాలు ఉన్నాయని అందుకే మాధవ్ విషయంలో జగన్ ఆచి తూచి వ్యవహరిస్తున్నారని పార్టీ శ్రేణులే అంటున్నాయి.

సజ్జల, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మినమా మాధవ్ విషయంలో ఇతర వైసీపీ నేతలెవరూ ఏ మాత్రం స్పందించకపోవడాన్ని ఇందుకు నిదర్శనంగా చూపుతున్నారు. అయిన దానికీ కానిదానికీ ట్విట్టర్ వేదకగా తెలుగుదేశంపై విరుచుకుపడే విజయసాయి కూడా మాధవ్ స్వయంగా తెలుగు దేశం కు చెందన కొందరి పేర్లు ప్రస్తావించి మరీ మార్ఫింగ్ చేశారంటూ ఆరోపించినా మాధవ్ కు మద్దతుగా ఒక్క ట్వీట్ కూడా చేయకపోవడాన్ని ఎత్తి చూపుతూ మాధవ్ న్యూడ్ వీడియో మార్ఫింగ్ కాదని తేలిపోవడమే కారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గతంలోనే అంబటి రాంబాబు, ఆవంతి శ్రీనివాస్ లపై పార్టీ పరంగా చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు మాధవ్ విషయంలో కఠినంగా వ్యవహరించడానికి జంకాల్సిన పని ఉండేది కాదని పార్టీ శ్రేణులే అంతర్గత సంభాషణల్లో చర్చించుకుంటున్నారు.  

ఇక గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ పార్లమెంటులో కూడా వైసీపీ పరువు తీసేసింది. ఇతర పార్టీల ఎంపీలు సైతం తమను చులకనగా వ్యాఖ్యలు చేస్తున్నారని వైసీపీ ఎంపీలే చెబుతున్నారు. ఇక వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు అయితే ఈ వ్యవహారంపై సీఎం జగన్ తక్షణమే స్పందించాలన్నారు. ఎందుకంటే వైసీపీ ఎంపీలెవరూ తాడేపల్లి ప్యాలస్ పర్మిషన్ లేకుండా గాలి కూడా పీల్చుకోలేరని సెటైర్ వేశారు.   సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోకి, ఎంపీ గోరంట్ల చూపిస్తున్న జిమ్  వీడియోకి సంబంధమే లేదన్నారు. ఈ  రెండు వీడియోలను మరో రాష్ట్రంలోని ఫోరెన్సిక్‌కి పంపిస్తేనే అసలు నిజం తెలుస్తుందన్నారు.  

By
en-us Political News

  
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.