బొత్స ఇలాకలో వైసీపీకి భారీ షాక్.!
Publish Date:Sep 27, 2026
Advertisement
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సొంత నియోజకవర్గం చీపురుపల్లిలో ఆ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మెరకముడిదాం వైసీపీ మండల అధ్యక్షుడు కోట్ల వెంకట్రావుతో పాటు 13 గ్రామాలకు చెందిన పలువురు మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర ముఖ్య నేతలు ఫ్యాన్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తమ రాజీనామా లేఖలను వైసీపీ అధినేత జగన్‌కి పంపుతున్నట్లు వారు వెల్లడించారు. ఇటీవలే వైసీపీని వీడి టీడీపీలో చేరిన బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)ను తామంతా అనుసరిస్తామని ఈ సందర్భంగా నేతలు స్పష్టం చేశారు. త్వరలోనే వారంతా తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా చీపురుపల్లికి చెందిన ఓ మాజీ జెడ్పీటీసీ దంపతులు పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న సీనియర్ నేత సొంత నియోజకవర్గంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనూహ్య రీతిలో ఎదురుదెబ్బ తగిలింది. దశాబ్దాలుగా బలమైన పట్టు కలిగి ఉన్న ప్రాంతంలో కీలక నాయకులు పార్టీని వీడటం స్థానిక రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో పార్టీ అధిష్టానం తీసుకున్న కొన్ని నిర్ణయాలు స్థానిక కేడర్ మధ్య తలెత్తిన విభేదాలు ఈ పరిణామాలకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ముఖ్యంగా కీలక పదవుల్లో ఉన్న నాయకులు పార్టీ వీడుతుండటంతో ఆ ప్రభావం జిల్లాలవారీగా పార్టీ శ్రేణులపై పడుతోంది.ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ క్యాడర్లో కొంత గందరగోళం నెలకొంది. అయితే, అధిష్టానం మాత్రం పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు వేగవంతం చేసింది. క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టత కోసం ప్రత్యేక వ్యూహాలను రచిస్తూ, శ్రేణుల్లో మనోధైర్యం నింపేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. [ Vizianagaram YSRCP politics, Botsa Satyanarayana, AP local politics updates, YSRCP leader defection, Cheepurupalli political, Majji Srinivasarao, YS Jagan, CM Chandrababu, Naralokesh, Telugu One, Telugu News ]
http://www.teluguone.com/news/content/-vizianagaram-ysrcp-politics-39-232683.html




