పిఠాపురంలో వైసీపీ ఖాళీ?
Publish Date:Mar 4, 2025
Advertisement
పిఠాపురం నియోజకవర్గం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అది ఇప్పటి నుంచే కాదు.. గత ఏడాది ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ ఖరారైనప్పటి నుంచే ఈ నియోజకవర్గంపై రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొందది. సరే ఆ ఎన్నికలలో పవన్ కల్యాణ్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆ తరువాత నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అక్కడే ఇళ్లు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో పిఠాపురం నియోజకవర్గం గురించి ఏ వార్త అయినా రాష్ట్ర వ్యాప్తంగా అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. అటువంటి నియోజకవర్గంలో వైసీపీ క్రమంగా ఖాళీ అయిపోతోంది. ఇప్పటికే పలువురు ఆ పార్టీని వీడి జనసేన గూటికి చేరారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. పెండెం దొరబాటు 2014 నుంచీ వైసీపీతోనే నడిచారు. 2019 ఎన్నికలలో ఆయన పిఠాపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఆయన తెలుగుదేశం అభ్యర్థి ఎస్వీఎస్ఎన్ వర్మపై విజయం సాధించారు. అయితే 2024 ఎన్నికలలో జగన్ పెండెం దొరబాబుకు టికెట్ నిరాకరించారు. వంగా గీతకు ఇక్కడ టికెట్ ఇచ్చారు. జనసేనాని పవన్ కల్యాణ్ ను వంగా గీత అయితేనే దీటుగా ఎదుర్కోగలరని జగన్ భావించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన పెండెం దొరబాబు వైసీపీ మార్కు బుజ్జగింపుల కారణంగా పార్టీలోనే కొనసాగారు. అయితే 2024 ఎన్నికలలో వంగా గీతపై పవన్ కల్యాణ్ 70 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. సరే అది పక్కన పెడితే జగన్ పెండెం దొరబాబు గత ఎన్నికలలో తనను పక్కన పెట్టిన దానికి ఇప్పుడు అదును చూసి దెబ్బ కొట్టారు. వైసీపీని వీడి పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకుని ఆ పార్టీ గూటికి చేరారు. జనసేన కేంద్ర కార్యాలయంలో పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన జనసేన గూటికి చేరడంతో పిఠాపురంలో వైసీపీ దాదాపు ఖాళీ అయిపోయినట్లే. వంగా గీత ఉన్నప్పటికీ ఆమెకు పార్టీ క్యాడర్ లో పెద్దగా పలుకుబడి లేదు. ఆమెకు నియోజకవర్గంలో కార్యకర్తల మద్దతు కూడా పెద్దగా లేదు. పెండెం దొరబాబు చేరికతో పిఠాపురంలో జనసేన బలో పేతం కావడమే కాదు.. ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న వైసీపీ పరిస్థితి మరింత దిగజారింది.
http://www.teluguone.com/news/content/ycp-empty-in-pithapuram-39-193834.html





