పెమ్మసాని ఆస్తులు, అర్హతలు చూసి కుళ్ళుకుని చస్తున్న వైసీపీ!

Publish Date:Apr 24, 2024

Advertisement

వైసీపీలో ఇప్పుడు కొత్త ఏడుపు మొదలైంది. తెలుగుదేశం పార్టీ తరఫున గుంటూరు పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్‌కి వేల కోట్లలో వున్న ఆస్తులను చూసి వైసీపీ వర్గాలు కుళ్ళుకు చస్తున్నాయి. పెమ్మసానికి ఇన్ని ఆస్తులు వున్నాయి.. అన్ని ఆస్తులు వున్నాయి అని వైసీపీ మీడియాలో ఏవేవో కట్టుకథలు వండి వార్చుతున్నారు. అన్ని ఆస్తులు వుండటం వల్లే చంద్రబాబుకు ఎన్నో కోట్లు ఇచ్చి టిక్కెట్ కొనుక్కున్నారనే ప్రచారం మొదలుపెట్టారు. ఈ చెత్త ప్రచారాన్ని పెమ్మసాని చంద్రశేఖర్ విజయవంతంగా తిప్పికొడుతున్నారు. భగవంతుడు తనకు చిన్నతనంలోనే ఎంతో సంపద వచ్చేలా అనుగ్రహించారని, తాను వైసీపీ నాయకుల మాదిరిగా అడ్డదారుల్లో డబ్బు సంపాదించలేదని కౌంటర్ ఇస్తున్నారు. తాను వైసీపీ నాయకుల తరహాలో డబ్బు సంపాదించడానికి రాజకీయాల్లోకి రాలేదని, తన మాతృభూమికి సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని వైసీపీ నాయకుల కర్ణభేరులు బద్దలయ్యేలా చాటుతున్నారు. 

చంద్రబాబుకు డబ్బిచ్చి టిక్కెట్లు కొనుకున్నారంటే ప్రచారం చేస్తున్న వైసీపీ నాయకులకు కర్రుకాల్చి వాత పెట్టేలాంటి ఫ్లాష్‌బ్యాక్‌ని పెమ్మసాని రివీల్ చేశారు. 2019 ఎన్నికల సందర్భంగా పెమ్మసానిని రాజకీయాల్లోకి రప్పించడానికి జగన్ తీవ్రంగా ప్రయత్నించాడట.. ఎమ్మెల్యే, ఎంపీ ఏ సీటు కావాలంటే ఆ సీటుకి టిక్కెట్ ఇస్తాం.. ఎలక్షన్లో పోటీ చేయడం ఇష్టం లేదంటే ఎమ్మెల్సీగానో, రాజ్యసభ సభ్యుడిగానో ఉంటానన్నా ఓకే... మీరు మా పార్టీలో చేరితే చాలు అంటే భారీ స్థాయిలో రాయబారాలు నడిపారట. వీళ్ళు ఎంత కాళ్ళావేళ్ళఆ పడినప్పటికీ, వైసీపీ విధానాలు, వ్యక్తుల పద్ధతులు నచ్చని పెమ్మసాని వైసీపీకి నో చెప్పారట. అప్పుడు తమ పార్టీలో చేరాలంటూ కాళ్ళావేళ్ళా పడిన వైసీపీ నాయకులు ఇప్పుడు తాను టీడీపీలో చేరితే ఇష్టమొచ్చిన ప్రచారాలు చేయడం వాళ్ళ సంస్కారాన్ని బహిర్గతం చేస్తోందని పెమ్మసాని అంటున్నారు.

టీడీపీకి ప్రస్తుత గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఈసారి ఎన్నికలలో పోటీ చేయకుండా తప్పుకున్నారు. ఇక్కడ నుంచి కొత్తగా పోటీకి దిగిన టీడీపి అభ్యర్థిని ఒక ఆట ఆడుకోవాలని అనుకున్న వైసీపీ నాయకులు పెమ్మసాని దూకుడు చూసి బిత్తరపోతున్నారు. పెమ్మసాని ఆడించేవాడే తప్ప, వేరేవాళ్ళు ఆడుకునేవారు కాదని అర్థమై నీళ్ళు నములుతున్నారు. ఎన్నారై కదా, ఏసీ కార్లో వచ్చి, జనానికి చేతులు ఊపి వెళ్ళిపోతాళ్ళే అనుకుంటే, నియోజగకవర్గంలోని గడపగడపనూ పెమ్మసాని సందర్శిస్తున్నారు. వైసీపీ అభ్యర్థి కిలారి రోశయ్య కంటే ప్రచారంలో చాలా ముందున్నారు. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో వార్ వన్ సైడ్ అనేది  డిసైట్ అయిపోయిందని భావిస్తున్నారు.

By
en-us Political News

  
అబూజ్ మడ్ దట్టమైన అటవీ ప్రాంతం. కేవ‌లం రెండు నెల‌ల వ్య‌వ‌ధిలో ఇక్క‌డ జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌ల‌లో 90 మంది చనిపోవడమంటే.. కచ్చితంగా ఈ అబూజ్ మడ్ పైనే సర్కార్ సీరియస్ గా దృష్టి సారించినట్టు అర్థం చేసుకోవచ్చు.
ఏపీ ఇన్ చార్జ్ డీజీపీ రాజేంద్రనాథ్ పై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన విషయం విధితమే. ఈ క్రమంలో కొత్త డీజీపీ నియామకం కోసం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సీఎస్ జవహర్ రెడ్డి ముగ్గురి పేర్లతో కూడిన జాబితాను పంపారు. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీశ్ కుమార్ గుప్తా పేర్లను సీఎస్ ఈసీకి పంపారు.
తెలంగాణ అసెంబ్లీ  ఎన్నికలకు ముందు బిఆర్ఎస్ , బిజెపిలు పాలు నీళ్లలో కలిసి ఉండేవారు. బిజెపి బి టీం బిఆర్ఎస్ అని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ భారీ పరాజయంతో రెండు పార్టీల మధ్య అగాథం బాగా పెరిగాపోయింది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్లు వైసీపీ ప్రభుత్వంతో పూర్తిగా తెగతెంపులు చేసేసుకున్నారా? మరో సారి జగన్ ను నమ్మే పరిస్థితి లేదని విస్పస్టంగా చెప్పేశారా? అంటే పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవడం కోసం వారు దరఖాస్తు చేసుకుంటున్న తీరును బట్టి ఔనని అనక తప్పదు.
వైసీపీ నాయకుడు జగన్‌కున్న మానసిక వ్యాధి పేరు ‘నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్’ అని, దాన్ని షార్ట్‌కట్‌లో ‘నార్సి’ అంటారని,
మామూలు ఓట్లతో మెజారిటీలు సాధిస్తే పోస్టల్ బ్యాలెట్ లెక్కించినా నామమాత్రం అవుతుంది. కానీ ఈసారి నెక్ టూ నెక్ గా ఏపీలో పోరాటం ఉంది. వంద, యాభై, పాతిక, పదీ ఓట్ల తేడాతో కూడా అభ్యర్ధుల గెలుపు ఉండనుంది. దాంతో అపుడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లే డిసైండ్ ఫ్యాక్టర్ గా మారనున్నాయి. అందుకే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కి ఎన్నడూ లేనంతగా ప్రాధాన్యత పెరిగింది.
మాట తప్పను మడమ తిప్పను అనే జగన్ ఇచ్చిన మాటకు పూచిక పుల్లంత విలువ కూడా ఇవ్వరన్న సంగతి ఈ ఐదేళ్ల కాలంలో పదే పదే రుజువైంది. మాట ఇవ్వడం మడమ తప్పటం అన్నది జగన్ నైజంగా జనం భావించే పరిస్థితికి వచ్చేశారు.
నార్సీ వ్యాధికి వున్న కొన్ని లక్షణాలను ఫస్ట్ పార్ట్.లో చెప్పడం జరిగింది. ఈ మానసిక వ్యాధిగ్రస్థులకి వుండే మరికొన్ని లక్షణాలను చూద్దాం.
మనీలాండరింగ్ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఇప్పట్లో ఊరట లభించే అవకాశాలు కనిపించడం లేదు. ఇదే కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే . గత ఏడాది ఫిబ్రవరి 26న అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ సిఎం మనీష్ సిసోడియాకు ఇంత వరకు బెయిల్ లభించలేదు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. అసలు స్వరూపం ఏమిటో మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ బట్టబయలు చేశారు. ఆ యాక్ట్ ను తీసుకువచ్చేసి.. ఇంకా అమలులోకి రాలేదు. పరిశీలనలో ఉంది అంటూ ఏపీ మంత్రులు చేస్తున్న ప్రకటనల డొల్ల తనాన్ని ఆయన ఒకే ఒక్క ట్వీట్ తో బయటపెట్టేశారు. తాను ప్రత్యక్ష బాధితుడిని అంటూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు రాష్ట్రంలో దుమారం రేపుతోంది. జగన్ ప్రభుత్వ దొడ్డిదారి యవ్వారాల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
జగన్‌కి వున్న మానసిక వ్యాధి గుట్టు రట్టయింది.. ఆ వ్యాధి పేరు ‘నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్’, షార్ట్‌కట్‌లో ‘నార్సీ’ అంటారు.
హైదరాబాద్ బిజెపి అభ్యర్థి మాధవిలత తరపున కేంద్ర హోం మంత్రి అమిత్ షా రోడ్ షో తర్వాత కాంగ్రెస్, ఎంఐఎం ఒక్కటయ్యాయి. ప్రత్యర్థి బిజెపి అభ్యర్థిని ఎదుర్కోవడానికి ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించాలని నిర్ణయించాయి.
ఒక నాయకుడు ప్రజల విశ్వాసాన్ని పొందాలంటే వారి మనస్సులు గెలవాలి. అయితే ఇంట్లోనే ఆయన తీరుకు, వైఖరికీ నిరసన వ్యక్తం అవుతుంటే..సొంత కుటుంబ సభ్యులే బయటకు వచ్చి తమ వారిని నమ్మొద్దని చెబుతుంటే ఆ నేతను జనం ఎలా నమ్ముతారు. ఎందుకు విశ్వసిస్తారు. ముందు ఇంట గెలు.. ఈ తరువాత రచ్చగెలవడం గురించి ఆలోచించు అంటారు కదా?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.