నేతలకు కేసుల చిక్కులు.. దిశానిర్దేశం లేక క్యాడర్ కకావికలు.. ఏపీలో వైసీపీ పుంజుకునేనా?

Publish Date:Jul 23, 2026

Advertisement

2024 ఎన్నికలలో  ఓటమి తరువాత నుంచీ వైసీపీ పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతున్న పరిస్థితి. ఈ పార్టీ నేతలు  చట్టపరమైన, న్యాయపరమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. వైసీపీకి చెందిన  కీలక నాయకులు, మాజీ మంత్రులు, నియోజకవర్గ ఇన్ ఛార్జులు, కార్యకర్తలపై  వరుసగా కేసులు నమోదవుతుండటంతో పార్టీ భవిష్యత్తుపై  నీలినీడలు కమ్ముకున్నాయి. రాష్ట్రంలో తెలుగుదేశం  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో జరిగిన పలు అవకతవకలు, అన్యాయాలు, అక్రమాలు, కుంభకోణాలపై  విచారణలు ముమ్మరమయ్యాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనలకు తిలోదకాలిచ్చి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ ఇప్పుడు కేసుల చిక్కుల్లో నిండా ఇరుక్కుంది.

 అధికారంలో ఉండగా చట్టాలకు మనం అతీతులం అన్నట్లుగా వ్యవహరించిన వైసీపీ నేతలకు ఒక్కరొక్కరుగా  పోలీసు కేసులను, సీఐడీ విచారణలను ఎదుర్కొంటూ, అరెస్టులు, బెయిళ్లు అంటూ  న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి పరిస్థితిలో ఉన్నారు. దీంతో క్షేత్ర స్థాయిలో పార్టీ ఉనికే నామమాత్రం అన్నట్లుగా వైసీపీ ప్రస్తుతం మిగిలింది. 

వైసీపీయులపై  నమోదైన కేసుల తీరుతెన్నులను పరిశీలిస్తే, కేవలం ఉన్నత స్థాయి రాజకీయ నేతలే కాకుండా నియోజకవర్గ స్థాయిలో క్రియాశీలకంగా ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు, సోషల్ మీడియా విభాగం సభ్యులు కూడా న్యాయపరమైన చిక్కుల్లో చిక్కుకున్నారు.   ఈ  కేసులతో వైఎస్సార్‌సీపీ చట్టపరమైన రక్షణ కొరకు ప్రతి జిల్లాలోనూ, ఉన్నత న్యాయస్థానాలలోనూ పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. విచారణాధికారుల ముందర హాజరుకావడం, ముందస్తు బెయిల్స్ కొరకు పిటిషన్లు దాఖలు చేయడం, పోలీసుల కస్టడీని ఎదుర్కోవడం వంటి పరిణామాలు పార్టీ రోజువారీ కార్యకలాపాలను, రాజకీయ పోరాటాలను నామమాత్రం చేసేశాయి. దీంతో పార్టీ సంస్థాగతంలో బలహీనపడింది. 

క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను నిర్వహించడానికి, ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తిని ఆసరాగా చేసుకుని ఉద్యమించడానికి పని చేసే నాయకులే వైసీపీలో కరవైయ్యారు. ఉన్న నేతల సమయం అంతా  లీగల్ వివాదాలలో కోర్టులు, న్యాయవాదుల చుట్టూ తిరగడానికే సరిపోతున్న పరిస్థితి.  కొన్ని జిల్లాల్లో నేతలు అరెస్టులకు భయపడి పార్టీ కార్యకలాపాలకు, రాజకీయాలకూ దూరంగా ఉంటున్నారు.  దీంతో పార్టీ క్యాడర్ కు దిశానిర్దేశం చేసే వారే కరవయ్యారు. ఈ పరిస్థితి వచ్చే ఎన్నికల నాటికి పార్టీని సంసిద్ధం చేయాలని భావిస్తున్న జగన్ కు అడుగు ముందుకు పడకుండా చేస్తోంది.  దీంతో రాష్ట్రంలో వైసీపీ భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

Ycp cadre in disarray, YSRCP Legal Troubles, YS Jagan Mohan Reddy, AP Politics,  , Legal Cases,  YCP Leaders

By
en-us Political News

  
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
హైదరాబాద్ నగరవాసుల ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
కొత్త కారు కొనుక్కోవాలని ఎన్నో రోజులుగా కలలు కంటారు.. ఆ కల నెరవేరిన రోజు ఆ ఆనందమే వేరు! ఎంతో ఇష్టపడి కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి..
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వాతావరణం నెలకొంది.
మహారాష్ట్రలోని ప్రఖ్యాత హిందూ హృదయసమ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌పై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి కెప్టెన్‌‌పై జరిగిన కత్తిదాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.
హైదరాబాద్‌ నగరంలో శాంతిభద్రతల నిర్వహణను మరింత సమర్థంగా చేపట్టేందుకు పోలీస్‌ శాఖలో భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు.
దసరా పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉపఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.