నీట్ రగడ.. ధర్మేంద్ర ప్రధాన్ ను మోడీ ఎందుకు వెనకేసుకొస్తున్నట్లు?

Publish Date:Jul 23, 2026

Advertisement

దేశవ్యాప్తంగా  విద్యార్థుల నిరసనలకు దారితీసిన నీట్   పరీక్షల నిర్వహణ వైఫల్యం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారిందనడంలో సందేహం లేదు. పరీక్షా పత్రాల లీకేజీ, మూల్యాంకనంలో అక్రమాల ఆరోపణల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పై విద్యార్థులలో తీవ్ర స్థాయిలో అసంతృప్తి, వ్యతిరేకత వ్యక్తమౌతోంది. ఆయన రాజీనామాకు యువత పట్టుబడుతోంది.  అయితే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న యువత డిమాండ్ ను పట్టించుకోవడం లేదు. నీట్ పై తొలి సారిగా స్పందించి, సోషల్ మీడియా వేదికగా న్యాయం చేస్తాననీ, లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షిస్తామనీ, అందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామనీ చెప్పిన మోడీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీమానా చేయాలన్న యువత డిమాండ్ ను ఇసుమంతైనా పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో మోడీ ధర్మేంద్ర ప్రధాన్ ను వెనకేసుకు వస్తున్నారన్న చర్చ మొదలైంది.   

జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, యువజన సంఘాలు చేపట్టిన ఆందోళనలు నానాటికీ తీవ్రరూపం దాల్చుతున్నా,  ప్రధాని నరేంద్రమోడీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను వెనకేసుకు రావడానికి కారణమేంటన్న చర్చ జోరుగా సాగుతోంది.  ప్రధాన్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) లో సుదీర్ఘకాలం పనిచేసిన  నాయకుడు కావడం, ఆర్‌ఎస్‌ఎస్ అగ్రనాయకత్వంతో ఆయనకున్నపటిష్ట సంబంధం అనుబంధం, అలాగే , పార్టీ పట్ల ఉన్న  విశ్వసనీయత ధర్మేంద్ర ప్రధాన్ కు రక్షణ కవచంగా మారాయని అంటున్నారు.  అదే విధంగా ఒడిశా రాష్ట్ర రాజకీయాల్లో బిజెపి సాధించిన చారిత్రాత్మక విజయాల్లో ధర్మేంద్ర ప్రధాన్ పాత్ర అత్యంత కీలకమైనది కావడంతో ఆయనను పక్కన పెట్టడానికి మోడీ వెనుకాడుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

అలాగే..  నిరసనకారుల  ఒత్తిడికి తలొగ్గి  ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయిస్తే.. ముందు ముందు ఇతర కేంద్ర మంత్రుల విషయంలో కూడా ఇటువంటి పరిస్థితే ఎదురు కావచ్చునని మోడీ భావిస్తున్నారని అంటున్నారు.   

NEET exam controversy, Narendra Modi government, Jantar Mantar protests, BJP's Odisha politics, RSS links

By
en-us Political News

  
వెబ్‌సిరీస్‌ ల్లో ఎక్కువగా బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలే చూసేవాడు.. ఆ తర్వాత తనకున్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకోని సికింద్రాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌ను ఎంచుకున్నాడు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
హైదరాబాద్ నగరవాసుల ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
కొత్త కారు కొనుక్కోవాలని ఎన్నో రోజులుగా కలలు కంటారు.. ఆ కల నెరవేరిన రోజు ఆ ఆనందమే వేరు! ఎంతో ఇష్టపడి కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి..
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వాతావరణం నెలకొంది.
మహారాష్ట్రలోని ప్రఖ్యాత హిందూ హృదయసమ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌పై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి కెప్టెన్‌‌పై జరిగిన కత్తిదాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.
హైదరాబాద్‌ నగరంలో శాంతిభద్రతల నిర్వహణను మరింత సమర్థంగా చేపట్టేందుకు పోలీస్‌ శాఖలో భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు.
దసరా పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.