జగన్ పాలన అధ్వానం అన్నందుకు దళిత మహిళపై వైసీపీ దాడి!
Publish Date:May 17, 2022
Advertisement
రెండు రెళ్లు నాలుగు అన్నందుకు గూండాలు గుండ్రాళ్లు విసిరే సీమలా తయారైంది వైసీపీ పాలనలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం. జగన్ ప్రభుత్వాన్ని, జగన్ పథకాలను విమర్శించినందుకు వైసీపీ శ్రేణులు ఒక మహిళ నివాసంపై సోమవారం అర్ధరాత్రి చేసిన దాడి ఘటన శ్రీశ్రీ చెప్పిన ‘సీమ’ను కళ్లకు కడుతుంది. రాష్ట్రంలో జగన్ పాలన అధ్వానంగా ఉందనీ, ఈ సారి ఎన్నికలలో గెలిచేది చంద్రబాబేనంటూ తన ఎకరంన్న పొలం పందెం కాస్తానన్న మహిళపై సోమవారం అర్ధరాత్రి ఆమె నివాసానికి వెళ్లి దాడి చేశారు.ఈ ఘటనకు సంబంధించిన పూర్వా పరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు గ్రామానికి చెందిన ఎస్సీ మహిళ కె. వెంకాయమ్మకు గ్రామంలో ఉన్న భూమిలో కొంత భాగం ఆక్రమణకు గురైంది. ఆ విషయమై పలు మార్లు అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకపోవడంతో ఆమె సోమవారం గుంటూరు కలెక్టరేట్ లో స్పందన కార్యక్రమానికి వచ్చి కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా ఆమె గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు గ్రామానికి చెందిన కె వెంకాయమ్మకు గ్రామంలో 4.50 సెంట్లు భూమి ఉంది. దానిలో 3.50 సెంట్లు అదేగ్రామానికి చెందిన కర్ని ప్రకాశం ఆక్రమించుకున్నాడు. తన భూమిని తనకు ఇప్పించాలంటూ అనేకసార్లు స్థానిక అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకపోయింది. దీంతో గుంటూరు కలెక్టరేట్‌లో స్పందనకు వచ్చి ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా ఆమె జగన్ పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. వచ్చే ఎన్నికలలో కచ్చితంగా చంద్రబాబే గెలుస్తాడని ఈ విషయంలో కావాలంటే తన ఎకరంన్నర పొలాన్ని పందె కాస్తాననీ సవాల్ చేసింది. జగన్ పాలనలో ఎవరూ సుఖంగా లేరని చెబుతూ, తనకు విద్యుత్ బిల్లు రూ.18 వేలు వచ్చింద చెబుతూ పెన్షన్ సహా పథకాలన్నీ జగన్ ప్రభుత్వం రద్దు చేసిందని వెల్లడించింది. జగన్ ది అసమర్థ పాలన అనీ, అన్న క్యాంటిన్లు రద్దు చేశాడనీ, కోవిడ్ సమయంలో ఆయన అసమర్ధత కారణంగా అనేక మంది మరణించారనీ విమర్శించింది. జగన్ పథకాలు వద్దే వద్దని, ఆయన పథకాలన్నీ ఓట్ల మీద ప్రేమతోనేనని విమర్శించింది.చంద్రన్న కానుక పేర చంద్రబా బు హయాంలో రంజాన్, క్రిస్మస్, సంక్రాంతి కానుకలను అందించారనీ, జగన పాలనలో అవేవీ లేవనీ వెంకాయమ్మ విమర్శించింది. దీంతో వైసీసీ శ్రేణులు సోమవారం అర్ధరాత్రి అమె నివాసంపై దాడి చేశాయి. ఈ దాడిపై మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. తనపై జరిగిన దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. తనకూ, తన కుమారుడికీ ప్రాణ భయం ఉందనీ రక్షణ కల్పించాలని కోరారు. వైసీపీ వారు సోమవారం రాత్రి తనపై దాడి చేసి కొట్టారని అని వెంకాయమ్మ ఆరోపించారు. కాగా వెంకాయమ్మపై దాడిని తెలుగుదేశం నేతలు తీవ్రంగా ఖండించారు.
http://www.teluguone.com/news/content/ycp-attack-on-women-for-criticising-jagan-25-136018.html





