Publish Date:Jul 21, 2023
హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమైన ఎంఎంటీఎస్ సేవలను దక్షిణ మధ్య రైల్వే మరింత విస్తరిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ శివారు ప్రాంతాలకు కూడా ఎంఎంటీఎస్‌ను విస్తరించగా.. ఓఆర్ఆర్ చుట్టూ కూడా ఎంఎంటీఎస్ సేవల కోసం రైల్వే లైన్‌ను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇక తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ను విస్తరించేందుకు ఎప్పటినుంచో ప్రయత్నాలు జరుగుతుండగా.. ఇప్పుడు పనులు మొదలయ్యాయి.యాదాద్రికి ఎంఎంటీఎస్ సేవలను విస్తరించే ప్రాజెక్టు ఖర్చు మొత్తాన్ని రైల్వేశాఖ భరించనుంది. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ పనులు జరగనున్నాయి. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేనర్ అరుణ్ కుమార్ జైన్‌తో పాటు సికింద్రాబాద్ డీఆర్‌ఎం ఏకే గుప్తా తాజాగా యాదాద్రి రైల్వే స్టేషన్‌ను పరిశీలించారు. ఎంఎంటీఎస్ ట్రైన్ల కోసం ప్రత్యేక రైల్వే ట్రాక్ నిర్మించనున్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న యాదాద్రి రైల్వే స్టేషన్‌కు ఎదురుగా గుట్టవైపు మరో రైల్వే స్టేషన్ నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన స్థలాన్ని అధికారులు పరిశీలించారు.కొత్త రైల్వే స్టేషన్ ముఖద్వారాన్ని యాదాద్రి ఆలయ నమూనా తరహాలో నిర్మించాలని అధికారులు భావిస్తున్నారు. యాదాద్రి వరకు ఇప్పటికే రెండు రైల్వే ట్రాక్‌లు ఉన్నాయి. కానీ ఎంఎంటీఎస్ ట్రైన్ల కోసం ఘట్‌కేసర్ నుంచి యాదాద్రి వరకు ప్రత్యేక ట్రాక్ నిర్మించనున్నారు. యాదాద్రికి ఎంఎంటీఎస్ సేవలు అందుబాటులోకి వస్తే చాలా తక్కువ ఖర్చుతో భక్తులు ప్రయాణించవచ్చు. యాదాద్రికి భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు యాదాద్రికి వెళుతుంటారు. ప్రస్తుతం బస్సుల ద్వారానే ఎక్కువమంది ప్రయాణం చేస్తున్నారు. ఎంఎంటీఎస్ అందుబాటులోకి వస్తే తక్కువ ఖర్చుతో సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/yadadri-mmts-works-speedup-25-158708.html
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చందాదారులను ఆకట్టుకునేందుకు మరో వినూత్నమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.
ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భాగ్యనగరంలో వరుస ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
పాతబస్తీ రాజకీయాల్లో కీలక నేతగా, ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా కొనసాగుతున్న అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
తెలంగాణ సాంస్కృతిక ఆత్మకు ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.
భార్యాభర్తల బంధం అంటే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం.. జీవితాంతం కలిసి నడవడం. కానీ.. మధ్యప్రదేశ్‌లో ఓ భర్త డబ్బు కోసం ఆ బంధానికే తూట్లు పొడిచాడు.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
పెట్రోల్‌లో ఇథనాల్ కలపడాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తాజా విధానాలు ఇప్పుడు సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.