అక్టోబర్ 15 నుంచి యూపీఐ కొత్త రూల్స్.. ఏంటో తెలుసా?

Publish Date:Oct 3, 2026

Advertisement

భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశవ్యాప్తంగా సామాన్యుల నుంచి పెద్ద వ్యాపార సంస్థల వరకు విస్తరించిన ఈ డిజిటల్ లావాదేవీలకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు రాబోతున్నాయి. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్న ఈ నిబంధనల ప్రకారం, కొన్ని ప్రత్యేక లావాదేవీలపై మర్చెంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఛార్జీలను వర్తింపజేయనున్నారు.తాజా మార్పుల ప్రకారం, రూ.2,000 మించిన డిజిటల్ చెల్లింపులపై 0.4 శాతం మేర ఎండీఆర్ ఛార్జీలు పడనున్నాయి. అయితే ఈ నిర్ణయం వ్యాపార వర్గాల్లో భిన్నమైన స్పందనలకు దారితీస్తోంది. ఛార్జీల భారాన్ని తప్పించుకునేందుకు వ్యాపారులు మళ్లీ నగదు లావాదేవీలవైపే మొగ్గు చూపుతారనే చర్చ జోరుగా సాగుతోంది.

ఈ పరిణామాల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అప్రమత్తమైంది. అక్టోబర్ 15 తర్వాత మార్కెట్‌లో నగదు డిమాండ్ పెరిగే అవకాశాలు ఉండటంతో, దేశంలోని అన్ని ఏటీఎంలలోనూ తగినంత కరెన్సీ నిల్వలు ఉండేలా చూడాలని బ్యాంకులను ఆదేశించింది. ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది.అయితే సామాన్య వినియోగదారులకు మాత్రం ప్రభుత్వం ఊరటనిచ్చింది. స్నేహితులు, బంధువుల మధ్య జరిపే వ్యక్తిగత (P2P) యూపీఐ లావాదేవీలు యథావిధిగా పూర్తిగా ఉచితం. ఎంత మొత్తం బదిలీ చేసినా ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయబోరని స్పష్టం చేశారు.

కేవలం రిజిస్టర్డ్ వ్యాపారులకు (Merchants) చేసే రూ.2,000 పైబడిన చెల్లింపులకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. ఈ రుసుములను నేరుగా వ్యాపారి బ్యాంక్ ఖాతా నుంచే మినహాయించుకుంటారు తప్ప, కస్టమర్లపై ఎలాంటి ప్రత్యక్ష భారం ఉండదని అధికారులు వెల్లడించారు. మరోవైపు, కొన్ని కీలక రంగాలకు ఈ ఛార్జీల నుంచి మినహాయింపు లభించింది. రైల్వే టికెట్ల బుకింగ్స్, టెలికాం బిల్లులు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు, పెట్రోల్, డీజిల్ కొనుగోళ్ల వంటి సేవలకు రూ.2,000 దాటినా వ్యాపారికి కేవలం రూ.5 మాత్రమే స్థిర ఛార్జీగా వర్తిస్తుంది.డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చడమే ఈ నిబంధనల ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వం చెబుతోంది. అయినప్పటికీ, చిన్న వ్యాపారులు ఏ విధంగా స్పందిస్తారనేది మార్కెట్‌లో ఆసక్తికరంగా మారింది. అక్టోబర్ 15 తర్వాత దేశ ఆర్థిక లావాదేవీలు ఏ మలుపు తిరుగుతాయోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

 

 

[ UPI Rules October 15 2026, MDR Charges on UPI, Digital Payments India, RBI ATM Cash Rules,UPI Transaction Charges, Merchants, RBI, MDR charges ]
 

By
en-us Political News

  
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
పెట్రోల్‌లో ఇథనాల్‌ కలపడాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తాజా విధానాలు ఇప్పుడు సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌‌ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.!
వెబ్‌సిరీస్‌ ల్లో ఎక్కువగా బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలే చూసేవాడు.. ఆ తర్వాత తనకున్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకోని సికింద్రాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌ను ఎంచుకున్నాడు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
హైదరాబాద్ నగరవాసుల ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
కొత్త కారు కొనుక్కోవాలని ఎన్నో రోజులుగా కలలు కంటారు.. ఆ కల నెరవేరిన రోజు ఆ ఆనందమే వేరు! ఎంతో ఇష్టపడి కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి..
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వాతావరణం నెలకొంది.
మహారాష్ట్రలోని ప్రఖ్యాత హిందూ హృదయసమ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌పై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.