కాంగ్రెస్ అనుమానాలే నిజమౌతాయా? కోమటిరెడ్డి బ్రదర్స్ ఒకరి తరువాత ఒకరుగా కమలం గూటికి చేరనున్నారా? ముందుగా తమ్ముడు ఆ తరువాత అన్న అన్న వ్యూహం అమలు చేస్తున్నారా అన్నసందేహాలకు పరిశీలకులు ఔననే బదులిస్తున్నారు. ఎందుకంటే స్వల్ప వ్యవధిలో కోమటి రెడ్డి బ్రదర్స్ కేంద్ర మంతి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఇద్దరూ వేర్వేరుగానే కెళ్లి అమిత్ షాతో భేటీ అయినప్పటికీ పరిశీలకులు మాత్రం సోదరులు కూడబలుక్కునే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని విశ్లేషిస్తున్నారు.
కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ గూటికి చేరడం ఖరారైన నేపథ్యంలో ఆయన అమిత్ షాను వ్యక్తిగతంగా మర్యాదపూర్వకంగా కలిశానని చెబుతుంటే.. ఆయన తరువాత విడిగా వెళ్లి అమిత్ షా తో భేటీ అయిన కోమటి రెడ్డి వెంకటరెడ్డి తెలంగాణలో వరద బాధితుల కష్టాలను కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకు వెళ్లేందుకు కలిశానని చెప్పుకొచ్చారు. తెలంగాణలో వరదల కారణంగా భారీ నష్టం జరిగిందనీ, కేంద్రం ఆదుకోవాలనీ కోరేందుకే తాను అమిత్ షా తో భేటీ అయ్యానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. ఏది ఏమైనా కోమటి రెడ్డ రాజగోపాల రెడ్డి రాజీనామా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహార శైలి కాంగ్రెస్ లో కల్లోలాన్నీ, చిచ్చునూరేపుతున్నాయి.
గత ఏడాది కాలంగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పట్ల కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తన అసమ్మతిని, అసంతృప్తినీ బాహాటంగానే వ్యక్తం చేస్తున్నా ఆయనను బుజ్జగించడానికి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ మాణికంఠాకూర్ ఏ మాత్రం ప్రయత్నించలేదని పార్టీలోని రేవంత్ వ్యతిరేక వర్గం ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కు ఫిర్యాదు కూడా చేశారు.
రేవంత్ రెడ్డి తీరు కారణంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కాంగ్రెస్ ను వీడే అవకాశాలు ఉన్నాయని కూడా వారు తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెబుతున్నారు. సోదరులు ఇద్దరూ కాంగ్రెస్ ను వీడితే నల్లొండ జిల్లాలో కాంగ్రెస్ పట్టు కోల్పోవడం ఖాయమని వారు చెప్పినట్లు తెలుస్తోంది. వారి ఫిర్యాదుకు తగినట్లుగానే పార్టీ వీడనని ఒక వైపు చెబుతూనే.. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ పై విమర్శలు గుప్పించడం.. పార్టీతో ప్రమేయం లేకుండా వరద సాయం కోసమంటూ నేరుగా హోంమంత్రిని కలవడం వంటి చర్యలతో వారి ఫిర్యాదు వాస్తవమేనని సంకేతాలిస్తున్నారు. తాజాగా చెరుకు సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడంపై రేవంత్ పై కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. తనను ఓడించేందుకు ప్రయత్నించిన వ్యక్తికి పిలిచి పీసీసీ పీఠం అప్పగించడంపై మండి పడ్డారు. ఇకపై రేవంత్ ముఖం చూడనని శపథం చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/wount-see-revanth-face-again-says-komati-reddy-39-141326.html
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.