ఇక రేవంత్ ముఖం చూడను, ఆయనతో మాట్లాడను : కోమటి రెడ్డి వెంకటరెడ్డి

Publish Date:Aug 5, 2022

Advertisement

కాంగ్రెస్ అనుమానాలే నిజమౌతాయా? కోమటిరెడ్డి బ్రదర్స్ ఒకరి తరువాత ఒకరుగా కమలం గూటికి చేరనున్నారా? ముందుగా తమ్ముడు ఆ తరువాత అన్న అన్న వ్యూహం అమలు చేస్తున్నారా అన్నసందేహాలకు పరిశీలకులు ఔననే బదులిస్తున్నారు. ఎందుకంటే స్వల్ప వ్యవధిలో కోమటి రెడ్డి బ్రదర్స్ కేంద్ర మంతి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఇద్దరూ వేర్వేరుగానే కెళ్లి అమిత్ షాతో భేటీ అయినప్పటికీ పరిశీలకులు మాత్రం సోదరులు కూడబలుక్కునే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని విశ్లేషిస్తున్నారు.

కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ గూటికి చేరడం ఖరారైన నేపథ్యంలో ఆయన అమిత్ షాను వ్యక్తిగతంగా మర్యాదపూర్వకంగా కలిశానని చెబుతుంటే.. ఆయన తరువాత విడిగా వెళ్లి అమిత్ షా తో భేటీ అయిన కోమటి రెడ్డి  వెంకటరెడ్డి తెలంగాణలో వరద బాధితుల కష్టాలను కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకు వెళ్లేందుకు కలిశానని చెప్పుకొచ్చారు.  తెలంగాణలో వరదల కారణంగా భారీ నష్టం జరిగిందనీ, కేంద్రం ఆదుకోవాలనీ కోరేందుకే తాను అమిత్ షా తో భేటీ అయ్యానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. ఏది ఏమైనా కోమటి రెడ్డ రాజగోపాల రెడ్డి రాజీనామా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి  వ్యవహార శైలి కాంగ్రెస్ లో కల్లోలాన్నీ, చిచ్చునూరేపుతున్నాయి.

గత ఏడాది కాలంగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పట్ల కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తన అసమ్మతిని, అసంతృప్తినీ బాహాటంగానే వ్యక్తం చేస్తున్నా ఆయనను బుజ్జగించడానికి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ మాణికంఠాకూర్ ఏ మాత్రం ప్రయత్నించలేదని పార్టీలోని రేవంత్ వ్యతిరేక వర్గం ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కు ఫిర్యాదు కూడా చేశారు.

రేవంత్ రెడ్డి తీరు కారణంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కాంగ్రెస్ ను వీడే అవకాశాలు ఉన్నాయని కూడా వారు తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెబుతున్నారు. సోదరులు ఇద్దరూ కాంగ్రెస్ ను వీడితే నల్లొండ జిల్లాలో కాంగ్రెస్ పట్టు కోల్పోవడం ఖాయమని వారు చెప్పినట్లు తెలుస్తోంది. వారి ఫిర్యాదుకు తగినట్లుగానే పార్టీ వీడనని ఒక వైపు చెబుతూనే.. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ పై విమర్శలు గుప్పించడం.. పార్టీతో ప్రమేయం లేకుండా వరద సాయం కోసమంటూ నేరుగా హోంమంత్రిని కలవడం వంటి  చర్యలతో వారి ఫిర్యాదు వాస్తవమేనని సంకేతాలిస్తున్నారు. తాజాగా చెరుకు సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడంపై రేవంత్ పై కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. తనను ఓడించేందుకు ప్రయత్నించిన వ్యక్తికి పిలిచి పీసీసీ పీఠం అప్పగించడంపై మండి పడ్డారు. ఇకపై రేవంత్ ముఖం చూడనని శపథం చేశారు.   

By
en-us Political News

  
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.