తెలంగాణలో చంద్రబాబు ఎంట్రీ.. కాంగ్రెస్ లో కంగారు!

Publish Date:Jul 9, 2024

Advertisement

ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో  తెలుగుదేశం కూట‌మి భారీ మెజార్టీతో అధికారంలోకి వ‌చ్చింది. సీఎంగా చంద్ర‌బాబు బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటినుంచి ఏపీ అభివృద్ధిపై దృష్టిపెట్టారు. ఇప్ప‌టికే ప‌లు రంగాల్లో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. అదే సమయంలో సంక్షేమాన్నీ విస్మరించడం లేదు. ఐదేళ్ల కాలంలో అభివృద్ధికి నోచుకోని ఏపీ ప్ర‌జ‌లు చంద్ర‌బాబు దూకుడుతో సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రోవైపు ప‌ద‌హారు ఎంపీ స్థానాల‌తో కేంద్రంలో తెలుగుదేశం అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. ఎన్డీయే ప్ర‌భుత్వం అధికారంలో కొన‌సాగ‌డానికి తెలుగుదేశం మద్దతు అత్యవసరం.  దీంతో గ‌తంలో ఎప్పుడూలేనంత ఉత్సాహం తెలుగుదేశం శ్రేణుల్లో క‌నిపిస్తోంది. బాబు విజన్ కు అనుగుణంగా ఏపీ ప్రగతికి, పురోగతికి కేంద్రం నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందుతాయనీ, ఎందుకంటే మోడీ సర్కార్ కు తెలుగుదేశం మద్దతు కీలకమనీ అంటున్నారు. మొద‌టి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య ఎలాంటి విబేధాలు  లేకుండా అభివృద్ధి చెందాల‌నేది తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు ఆకాంక్ష‌.  ఏపీలో అధికారంలోకి వ‌చ్చిన కొద్ది రోజుల‌కే రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య విభ‌జ‌న స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై చంద్ర‌బాబు దృష్టి కేంద్రీక‌రించారు. ఈ క్ర‌మంలో ఇటీల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌ను విడ‌త‌ల వారిగా ప‌రిష్క‌రించుకోవాల‌ని రెండు రాష్ట్రాల సీఎంలు నిర్ణ‌యించారు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా.. చంద్ర‌బాబు తెలంగాణలో అడుగు పెట్ట‌డంతో తెలంగాణ‌లోని ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్ పార్టీతో పాటు  కాంగ్రెస్ పార్టీ  సైతం ఉలిక్కిపడుతున్నారు. తమ కాళ్ల కింద భూమి కదిలిపోతుందన్నంత కంగారు పడుతున్నారు. 

ఏపీ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత చంద్ర‌బాబు నాయుడు ఇటీవ‌ల తొలిసారి తెలంగాణ‌లో అడుగుపెట్టారు. ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్ లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత‌ల‌తో స‌మావేశం అయ్యారు. రాష్ట్ర న‌లు మూల‌ల నుంచి భారీ సంఖ్య‌లో తెలుగుదేశం కార్య‌క‌ర్త‌లు ఈ స‌మావేశంలో పాల్గొన్నారు. ఈ క్ర‌మంలో తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీ బ‌లోపేతంపై దృష్టిపెడ‌తాన‌ని,  మంచిరోజులు రాబోతున్నాయ‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించ‌డం తెలంగాణ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారింది. తెలంగాణ‌లో చంద్ర‌బాబు అడుగు పెడుతున్నారంటే బీఆర్ఎస్ నేత‌ల్లో ఆందోళ‌న ఉంటుంది. ఎందుకంటే, తెలంగాణ‌లో  తెలుగుదేశం బ‌లోపేతం అయితే బీఆర్ఎస్ పార్టీకి ఆద‌ర‌ణ త‌గ్గుతుంద‌ని ఆ పార్టీ నేత‌ల భ‌యం. ఈ భావ‌న‌తోనే  చంద్ర‌బాబు తెలంగాణ రాజ‌కీయాల‌పై ఎప్పుడు ప్ర‌స్తావించినా బీఆర్ఎస్ నేత‌లు ప్రెస్‌మీట్లు పెట్టి చంద్ర‌బాబు వ‌స్తున్నారు.. మ‌ళ్లీ తెలంగాణ, ఏపీ క‌లిసిపోతాయంటూ రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్ట‌డం ప‌రిపాటిగా మారుతూ వ‌స్తుంది.  చంద్ర‌బాబును తెలంగాణకు శ‌త్రువుగా చూపించ‌డంలో బీఆర్ఎస్ అప్పట్లో  స‌ఫ‌ల‌మైంది.

2014, 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు నాయుడును తెలంగాణ ద్రోణిగా ముద్ర‌వేసి కేసీఆర్ అధికారంలోకి వ‌చ్చారు. ఎన్నిక‌లు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా చంద్ర‌బాబు ప్ర‌స్తావ‌న‌ను తెర‌పైకి తెచ్చే బీఆర్ఎస్ పార్టీకి.. 2023 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ఆ అవ‌కాశాన్ని ఇవ్వ‌లేదు. ఆ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పోటీ నుంచి త‌ప్పుకుంది. దీంతో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌డానికి  తెలుగుదేశం క్యాడర్ తమ వంతు పాత్ర పోషించింది.  ఇటీవ‌ల జ‌రిగిన ఎంపీ ఎన్నిక‌ల్లోనూ  తెలుగుదేశం శ్రేణులు కాంగ్రెస్ పార్టీకే మ‌ద్ద‌తుగా నిలిచారు. అయితే, ఏపీలో మ‌ళ్లీ  తెలుగుదేశం అధికారంలోకి రావ‌డంతో తెలంగాణలోని బీఆర్ఎస్ నేత‌ల‌తో పాటు.. కాంగ్రెస్ పార్టీలోని కొంద‌రు నేత‌లూ ఆందోళ‌న చెందుతున్నారు. వాస్త‌వానికి, చంద్ర‌బాబు  తెలంగాణలో తెలుగుదేశం బ‌లోపేతంపై దృష్టిపెడితే కాంగ్రెస్ పార్టీ  మేలే జ‌రుగుతుంది. ఎందుకంటే.. రాష్ట్రంలో తెలుగుదేశం ఎంతగా బ‌లోపేతం అయితే  అంతగా బీఆర్ఎస్ ఓటు బ్యాంకుకు గండిపడుతుంది.  త‌ద్వారా కాంగ్రెస్ పార్టీ మ‌రింత బ‌ల‌ప‌డుతుంది. కానీ, కాంగ్రెస్ లోని కొంద‌రు నేత‌లు చంద్ర‌బాబు తెలంగాణ రాజ‌కీయాల‌పై దృష్టిపెట్ట‌డాన్ని వ్య‌తిరేకిస్తూ, తెలంగాణకు మ‌ళ్లీ అన్యాయం జ‌రుగుతుందన్నట్లు మాట్లాడారు. కాంగ్రెస్ నాయ‌కురాలు విజ‌య‌శాంతి ఓ అడుగు ముందుకేసి.. తిరిగి తెలంగాణ వాదులు, ఉద్యమకారులు పోరాట ప్రస్థానానికి కదలటం నిశ్చయమైన భవిష్యత్ వాస్తవం.. అంటూ పేర్కొన‌డం కాంగ్రెస్ శ్రేణుల‌సైతం ఆశ్చ‌ర్యానికి గురిచేస్తుంది. 

తెలంగాణ‌లో రాజ‌కీయాలు చేయ‌డానికి చంద్ర‌బాబుకు హ‌క్కులేద‌న్న‌ట్లుగా కొంద‌రు కాంగ్రెస్ నేత‌లు మాట్లాడ‌టం ప‌ట్ల తెలుగుదేశం నాయకులు   ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మీరు అన్న‌ట్లు చంద్ర‌బాబు తెలంగాణ వ్య‌తిరేకి అయితే.. 2018 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం ఎందుకు క‌లిసి పోటీచేశాయి. 2023 ఎన్నిక‌ల్లో తెలుగుదేశం కార్య‌క‌ర్త‌లు కాంగ్రెస్ పార్టీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌టం నిజం కాదా అని ప్ర‌శ్నిస్తున్నారు. పలువురు కాంగ్రెస్ నాయకులు తెలుగుదేశం జెండా పట్టుకుని ర్యాలీలలో పాల్గొనడం వాస్తవం కాదా అని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ డైరెక్షన్ లో చంద్రబాబు, పవన్  పని చేస్తున్నార‌ని.. తెలంగాణ‌లో తెలుగుదేశం బ‌ల‌ప‌డితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో మూడు పార్టీలు క‌లిసి పోటీ చేస్తాయ‌ని, త‌ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఏర్ప‌డుతుంద‌న్న వాద‌న‌ను కొంద‌రు కాంగ్రెస్ నేత‌లు తెరపైకి తీసుకువస్తున్నారు. వాస్తవానికి   తెలంగాణ‌లో బీజేపీ, జ‌నసేన‌, తెలుగుదేశం క‌లిసి పోటీచేస్తే బీఆర్ఎస్ పార్టీ ఉనికే ప్రమాదంలో పడుతుంది. ఆ మూడు పార్టీల కలయిక వల్ల కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు వ‌చ్చే న‌ష్టం ఏమీ ఉండ‌దు.  అయితే కాంగ్రెస్ లోని కొందరు నాయకులు తెలంగాణలో చంద్రబాబు ఎంట్రీని వ్యతిరేకించడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ లో  రేవంత్ రెడ్డి బ‌లోపేతం అవుతారన్న దుగ్ధతోనే అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  మొత్తానికి తెలంగాణ‌లో తెలుగుదేశంబ‌లోపేతంపై చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లు తెలంగాణ రాజ‌కీయాల్లో ర‌చ్చ రేపుతున్నాయి.

By
en-us Political News

  
తెలంగాణ ప్రయోజనాలే తమకు పరమావధన్న ఆయన పార్లమెంటులో ఈ ప్రతిపాదనపై చర్చ,  ఓటింగ్ జరిగినప్పుడు తమ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తారని వెల్లడించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందితే దేశ రాజకీయాలలో కాంగ్రెస్ ప్రతిష్ఠ బాగా మసకబారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. ఇది 2029 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై నిస్సందేహంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
తొలి విడత పంచాయతీ ఎన్నికలలో  వైసీపీ మద్దతుదారులు కనీసం పాతిక శాతం  స్థానాలను కూడా గెలుచుకోలేకపోయారు. అదే సమయంలో తెలుగదేశం కూటమి మద్దతు ఉన్నఅభ్యర్థులు తిరుగులేని విజయాలతో ప్రభంజనం సృష్టించారు. 
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బిల్లు ఉద్దేశాలను, ప్రక్రియను  తప్పుబడుతుండగా, ఇండియా కూటమిలోని పలు ప్రాంతీయ పార్టీలో,  సీట్ల వాటా రక్షణ, సవరణల ఆధారంగా తమ వైఖరిని మార్చుకుంటున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
డీలిమిటేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును తీసుకురావడమే ఈ సమావేశాల నిర్వహన ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ హడావుడి సమావేశాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం బీజేపీకి రాజకీయ లబ్ధి చూకూర్చడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఏ   రాష్ట్రంలోనూ  సీట్ల వాటా తగ్గదు, ప్రస్తుత నిష్పత్తిని కాపాడుతూనే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా స్థానాలు పెరుగుతాయి.  అంతేకాకుండా, 2051 సీట్ల విషయంలో మార్పులు లేకుండా స్తంభనను అమలు చేయడం ద్వారా భవిష్యత్ జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా నియంత్రించామని కేంద్రం చెబుతోంది. 
లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను 50 శాతం పెంచడం వల్ల ఏ రాష్ట్రానికీ నష్టం జరగదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
మాదకద్రవ్యాల మహమ్మారి నుంచి యువతను కాపాడేందుకు చేపట్టిన నషా ముక్త్ భారత్ యాత్రకు ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
తమిళనాడులో సంచలనం సృష్టించిన మహిళా ఐఏఎస్ అధికారిణి వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
మదురై సమీపంలోని తిరుపరంకుండ్రం కొండపై ఉన్న దీపస్తంభం వద్ద శనివారం దీపం వెలిగించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
పార్లమెంట్ సమావేశాలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.