ఇండియా కూటమిలో డీలిమిటేషన్ చిచ్చు: చీలిక దిశగా అడుగులు.. కాంగ్రెస్ కు బిగ్ షాక్.!

Publish Date:Nov 28, 2026

Advertisement

 డీలిమిటేషన్  ప్రతిపక్ష ఇండియా కూటమిలో చీలికకు దారి తీస్తోందా? అంటే పరిశీలకుల నుంచి ఔనన్న సమాధానమే వస్తోంది.  కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ స్థానాల సంఖ్యను పెంచేందుకు, రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తిని స్థిరంగా ఉంచేందుకు రూపొందించిన ప్రతిపాదనలపై ఇండియా కూటమిలోభిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతుండటమే ఇందుకు నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీంతో ఇండియా కూటమి ఐక్యత ప్రశ్నార్థకంగా మారింది.  

ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బిల్లు ఉద్దేశాలను, ప్రక్రియను  తప్పుబడుతుండగా, ఇండియా కూటమిలోని పలు ప్రాంతీయ పార్టీలో,  సీట్ల వాటా రక్షణ, సవరణల ఆధారంగా తమ వైఖరిని మార్చుకుంటున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. తాజాగా కేంద్రం  రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్లను 50 శాతం పెంచడం, పాతికేళ్ల పాటు సీట్ల వాటా నిష్పత్తిని స్తంభింపజేయడం వంటి అంశాలు దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలలో బిల్లుకు అనుకూలత వ్యక్తం అయ్యేలా చేసింది. 

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే తమ రాష్ట్ర సీట్ల వాటా తగ్గకూడదని, 1971 జనాభా ప్రాతిపదికన నిష్పత్తిని కొనసాగించాలని అలాగే సీట్ల వాటా పతికేళ్లు స్థిరంగా ఉంచాలన్న డిమాండ్ కు తన  తాజా ప్రతిపాదన ద్వారా కేంద్రం అంగీకరించినట్లైంది. దీంతో డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా నిలబడాలన్న ఆ పార్టీ వైఖరిలో మార్పు చోటు చేసుకునే అవకాశాలే మెండుగా ఉన్నాయంటున్నారు. ఇక ఇప్పటికే   ఎన్సీపీ (శరద్ పవార్ ) నేతలు బిల్లు పూర్తి స్వరూపాన్ని చూసిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించినప్పటికీ, జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే.. ఆ పార్టీ ఎన్డీయేకు జై కొట్టడం ఖాయమని తేటతెల్లమైపోయింది. 

కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ బిల్లును, ప్రత్యేక సమావేశాల నిర్వహణను బలంగా వ్యతిరేకిస్తోంది. మహిళా రిజర్వేషన్ల పేరుతో నియోజకవర్గాల పునర్విభజనను ముందుకు తీసుకెళ్లడం రాజకీయ లబ్ధి కోసమేనని కాంగ్రెస్ అంటోంది. పునర్విభజన బాధ్యతల నిర్వహణ, ఎన్నికల వ్యవస్థ విశ్వసనీయత, అలాగే రాజ్యాంగ సవరణకు అవసరమైన మెజారిటీని సమీకరించే తీరుపై కాంగ్రెస్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ పరిస్థితే ఇండియా కూటమిలో చీలిక అనివార్యం అన్న భావన కలిగిస్తోందని పరిశీలకులు అంటున్నారు. 

ఇది కూడా చదవండి:  ఇండియా కూటమి కీలక నిర్ణయం...ఇకపై రెండు నెలలకు ఒకసారి భేటీ!​

గతంలో ఏప్రిల్‌లో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ లభించక ఆమోదం పొందని విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే.. ఇప్పుడు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు పెట్టి మరీ ఆ బిల్లును ప్రవేశ పెట్టాలని కేంద్రం నిర్ణయించడానికి ఇండియా కూటమిలో చీలిక ఆశతోనే నని అంటున్నారు. 

 మొత్తంగా చూస్తే, డీలిమిటేషన్ బిల్లు ప్రతిపక్ష కూటమిలోని భిన్న రాజకీయ ఆలోచనలు, ప్రాంతీయ ప్రయోజనాల మధ్య ఉన్న తేడాలను మరోసారి బట్టబయలు చేసింది. పార్లమెంట్ సమావేశాల్లో జరిగే పరిణామాలు జాతీయ రాజకీయాల్లో కొత్త మలుపులకు దారితీసే అవకాశం ఉంది.

మీకు నచ్చవచ్చు:  ప్రధాని అభ్యర్థిగా రాహుల్.. ఇండియా కూటమి పార్టీలు ఓకే.!

ఇండియా కూటమిలోకి జగన్?

[Delimitation Effect, India allience, Split, Shock, Congress, TeluguOne]

By
en-us Political News

  
డీలిమిటేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును తీసుకురావడమే ఈ సమావేశాల నిర్వహన ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ హడావుడి సమావేశాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం బీజేపీకి రాజకీయ లబ్ధి చూకూర్చడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఏ   రాష్ట్రంలోనూ  సీట్ల వాటా తగ్గదు, ప్రస్తుత నిష్పత్తిని కాపాడుతూనే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా స్థానాలు పెరుగుతాయి.  అంతేకాకుండా, 2051 సీట్ల విషయంలో మార్పులు లేకుండా స్తంభనను అమలు చేయడం ద్వారా భవిష్యత్ జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా నియంత్రించామని కేంద్రం చెబుతోంది. 
లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను 50 శాతం పెంచడం వల్ల ఏ రాష్ట్రానికీ నష్టం జరగదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
మాదకద్రవ్యాల మహమ్మారి నుంచి యువతను కాపాడేందుకు చేపట్టిన నషా ముక్త్ భారత్ యాత్రకు ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
తమిళనాడులో సంచలనం సృష్టించిన మహిళా ఐఏఎస్ అధికారిణి వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
మదురై సమీపంలోని తిరుపరంకుండ్రం కొండపై ఉన్న దీపస్తంభం వద్ద శనివారం దీపం వెలిగించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
పార్లమెంట్ సమావేశాలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో పర్యటించారు.
హైదరాబాద్‌లోని గోల్కొండ ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతంలో అనూహ్య విమాన ఘటన చోటుచేసుకుంది.
సైబరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టేందుకు తెలంగాణ పోలీస్ శాఖ కొత్త చర్యలకు సిద్ధమవుతోంది.
ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై హెచ్చరిక చిహ్నాల అమలులో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.