Publish Date:Jun 16, 2022
కోవిడ్ ముప్పు నుంచి ప్రపంచం ఇంకా బయటపడలేదు. ఇప్పటికీ ప్రపంచ దేశాలన్నీ కోవిడ్ జాగ్రత్తలు పాటించాలనే తమ తమ దేశాల ప్రజలను హెచ్చరిస్తూనే ఉన్నాయి. అంతలోనే మరో ముప్పు తరుముకు వస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తున్నది.
అదీ వైరస్సే.. అత్యంత వేగంగా వ్యాపించే మహమ్మారే. ప్రాణ నష్టం అధికంగా ఉండకపోయినా.. ప్రస్తుతం యూరోప్ దేశాలలో విపరీతంగా వ్యాపిస్తున్న ఆ వైరస్ కు ప్రస్తుతం ఉన్న పేరు మంకీ ఫాక్స్. యూరోప్ దేశాలలో అత్యధికంగా వ్యాపిస్తున్నఈ వైరస్ ఇప్పటి వరకూ 39 దేశాలకు విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా 1600 మందికి ఈ వ్యాధి సోకింది.
మరో అంత మందిలొ ఈ వ్యాధి లక్షణాలు ఉన్నాయి. అయితే నిర్ధారణ కావాల్సి ఉంది. ఈ వ్యాప్తి తీవ్రత ఇలాగే కొనసాగితే.. కోవిడ్ లాగే ఇది కూడా ప్రపంచాన్ని కమ్మేయడానికి ఎక్కువ రోజులు పట్టదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తున్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల మేరకు ప్రాంతాల పేర్లు, జంతువుల పేర్లు వైరస్ లకు, వ్యాధులకు పెట్టడం నిషేధం. దాంతో మంకీ ఫాక్స్ గా పిలవబడుతున్న వైరస్ పేరు మార్చేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కసరత్తు చేస్తున్నది.
అంతకంటే ముందు మంకీ ఫాక్స్ వైరస్ వ్యాప్తి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అంతర్జాతీయ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన అవసరాన్నిపరిశీలిస్తున్నది. అందుకోసం డబ్ల్యుహెచ్ ఓ ఈ నెల 22 ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో మంకీ ఫ్యాక్స్ వ్యాప్తి తీవ్రత, మరిన్ని దేశాలకు విస్తరించే ముప్పు, ప్రభావిత దేశాలలో పరిస్థితులు తదితర అంశాలపై చర్చించి హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటనపై ఒక నిర్ణయం తీసుకునే అవకావం ఉంది. స్పష్టమైన హేతుబద్ధమైన ఆధారాలు లేనప్పటికీ ఈ వైరస్ మూలం ఆఫ్రికా దేశాల నుంచే ఆరంభమైందనీ శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. ఆ దిశగా పరిశీలనలు సైతం చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/world-health-emergency-in-the-name-of-monkey-pox-25-137752.html
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్‌షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.