Publish Date:Apr 16, 2026
దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన మూడు కీలక బిల్లులు లోక్‌సభ ముందుకు రావడంతో ఉత్కంఠ పెరిగింది. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణలకు సంబంధించిన ఈ బిల్లులపై శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ నిర్వహించనున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఓటింగ్‌కు ముందు సుదీర్ఘ చర్చ జరగనుంది.
మూడు రోజుల ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు, డీలిమిటేషన్ బిల్లును సభలో ప్రవేశపెట్టనుండగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లును ప్రవేశపెడతారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ అమలు కోసం నియోజకవర్గాల పునర్విభజన అవసరమని కేంద్రం వాదిస్తోంది. ఈ క్రమంలో లోక్‌సభ స్థానాలను ప్రస్తుత 543 నుంచి 850కి పెంచే ప్రతిపాదన కూడా ముందుకు వచ్చింది.
అయితే, మహిళా రిజర్వేషన్ల అమలును డీలిమిటేషన్‌తో ముడిపెట్టడాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా ‘ఇండియా’ కూటమి మహిళా రిజర్వేషన్‌కు మద్దతు ప్రకటించినప్పటికీ, డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తామని స్పష్టం చేసింది. జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేస్తే, జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలు ప్రాతినిధ్యం కోల్పోతాయని ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రభుత్వం డీలిమిటేషన్‌ను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తోందని ఆరోపించారు. “మహిళా రిజర్వేషన్‌కు మేము మద్దతు ఇస్తాం. కానీ డీలిమిటేషన్‌తో గిమ్మిక్కులు చేస్తున్నారన్న అనుమానం ఉంది” అని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే సభలో మూడింట రెండొంతుల మద్దతు అవసరం. అధికార ఎన్డీయే కూటమికి తగిన సంఖ్యలో సభ్యులు లేకపోవడంతో విపక్షాల మద్దతు కీలకంగా మారింది. సుమారు 18 గంటలపాటు కొనసాగే ఈ చర్చలు దేశ రాజకీయాల్లో కీలక మలుపు తీసుకురావొచ్చని భావిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/womens-reservation-bill-36-217537.html
మొదటి దశలో ఆలయం చుట్టూ పటిష్టమైన ప్రాకారం, సుదూర ప్రాంతాల నుండి సైతం భక్తులను ఆకర్షించే విధంగా ఏడు అంతస్తుల మహా రాజగోపురం, భక్తుల సౌకర్యార్థం ఆర్జిత సేవా మండపం, అద్దాల మండపంతో పాటు వాహన, రథ మండపాలను నిర్మించనున్నారు.
దర్యాప్తులో సంబంధిత కాలంలో ఆయనకు వివిధ వనరుల ద్వారా సుమారు 1.60 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందనీ, అదే కాలంలో 71.58 లక్షల రూపాయల మేర ఖర్చులు జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ లెక్కల ప్రకారం ఆయన వద్ద చట్టబద్ధంగా ఉండాల్సింది 88.42 లక్షల రూపాయలు మాత్రమేనని ఏసీబీ ఎఫ్ఐఆర్ లో పేర్కొంది.
విద్యా రంగం పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని గర్హించారు. దీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శలు గుప్పించారు. కాగా ఈ సందర్భంగా పలు డిమాండ్లను విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వం ముందు ఉంచారు.
జింబాబ్వే పర్యటన కోసం ప్రకటించిన భారత టీ20 జట్టు ఎంపిక వివాదాస్పదంగా మారింది. ఐపీఎల్‌లో 501 పరుగులు చేసిన ఆర్సీబీ స్టార్ రజత్ పాటిదార్‌ను పక్కనపెట్టి, ఒక్క వికెట్ తీయని మయాంక్ యాదవ్‌కు చోటు ఇవ్వడంపై సోషల్ మీడియాలో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైజాగ్‌లో కాగ్నిజెంట్ ఐటీ సెజ్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్. మధురవాడ, రుషికొండ, ఎండాడ ప్రాంతాల్లో భారీగా పెరుగుతున్న ఇళ్ల అద్దెలు మరియు కొత్త ఐటీ ఉద్యోగాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి, తిరుపతి ఆర్థిక ప్రాంతాల మాస్టర్ ప్లాన్ కోసం 6 నెలల డెడ్‌లైన్ విధించారు. స్వర్ణ ఆంధ్ర 2047 లక్ష్యాలు, వైజాగ్ బే సిటీ ప్రాజెక్ట్ విశేషాలు మరియు రాయలసీమ హార్టికల్చర్ విప్లవంపై పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయానికి వెళ్లే వారికి ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. హెబ్బాల్ నుంచి ఎయిర్‌పోర్ట్ వరకు రూ.35 కోట్లతో నిర్మించనున్న సిగ్నల్ రహిత కారిడార్, సదాహళ్లి అండర్‌పాస్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
వ్యవస్థీకృత దుష్ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకునే క్రమంలో.. రాజ్యాంగం కల్పించిన భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు, ప్రజాస్వామ్య చర్చలకు, చట్టబద్ధమైన విమర్శలకు ఎలాంటి భంగం కలగకుండా పోలీసులు వ్యవహరించాలని స్పష్టం చేశారు.
ఇరాన్ అంతు చూస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఫినిష్ ది జాబ్ అంటూ ఓవల్ ఆఫీస్ నుండి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, టెహ్రాన్‌లో వ్యక్తమవుతున్న ప్రతీకార జ్వాలల వెనుక ఉన్న అసలు కారణాలు మరియు పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో చూడండి.
బజాజ్ ఆటో సంస్థ ప్రకటించిన రూ. 5,633 కోట్ల మెగా బైబ్యాక్ ఆఫర్ నేటితో ముగియనుంది. ఒక్కో షేరును రూ. 12,000 చొప్పున 20% ప్రీమియం ధరతో కొనుగోలు చేస్తున్న కంపెనీ. అర్హత వివరాలు, ముగింపు గడువు మరియు నిపుణుల సూచనలు ఇక్కడ చదవండి.
ఆత్మహత్యకు ప్రేరేపించడంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కృష్ణలంక పోలీసులు నాగరాజుపై కేసు నమోదు చేశారు.
ఇన్కమ్ టాక్స్ సెక్షన్ 143(3) కింద స్క్రూటినీ నోటీసు వచ్చిందా? ఆందోళన పడకుండా ఆన్‌లైన్‌లో DIN నంబర్ వెరిఫై చేసుకునే విధానం, నోటీసును నిర్లక్ష్యం చేస్తే పడే 50% నుండి 200% భారీ జరిమానాలు మరియు e Proceeding ద్వారా సురక్షితంగా స్పందించే పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో చూడండి.