తమిళనాట నీట్ నిరసనకారులపై కేసుల ఉపసంహరణ.!

Publish Date:Aug 3, 2026

Advertisement

నీట్ పరీక్ష వివాదం దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ తమిళనాడు ప్రభుత్వం అత్యంత కీలకమైన, సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు చెన్నై, హైదరాబాద్ తదితర ప్రధాన నగరాల్లో నీట్ అక్రమాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టిన విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, వారి ప్రజాస్వామ్య నిరసన హక్కును గౌరవిస్తూ ముఖ్యమంత్రి విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం  పట్ట విద్యార్థి లోకం హర్షం వ్యక్తం చేస్తున్నది

ఇటీవల జరిగిన నీట్ పరీక్షలో చోటుచేసుకున్న  ప్రశ్నాపత్రాల లీకేజీ, అక్రమాలపై  దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత రోడ్లపైకి వచ్చి తీవ్ర స్థాయిలో నిరసనలు తెలిపిన సంగతి తెలిసిందే. రాజధాని ఢిల్లీ నుంచి ప్రారంభమైన ఈ ఆందోళనలు దేశవ్యాప్తంగా వ్యాపించాయి. ఈ క్రమంలో తమిళనాడులోనూ పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు, యువత వీధుల్లోకి వచ్చి నిరసనలకు దిగారు ఆ సమయంలో శాంతిభద్రతల నిర్వహణలో భాగంగా  స్థానిక పోలీసులు ఆందోళనల్లో పాల్గొన్న పలువురు విద్యార్థులపై కేసులు నమోదు చేశారు.

విద్యార్థులపై నమోదైన పోలీసు కేసుల వల్ల వారి విద్యాభ్యాసం, భవిష్యత్తు ఉద్యోగ అవకాశాలు దెబ్బతినే ప్రమాదం ఉందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమైంది. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి విజయ్   తక్షణ  చర్యలకు ఉపక్రమించారు. నీట్ ఆందోళనల సమయంలో విద్యార్థులపై నమోదు చేసిన అన్ని కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని ఆయన  స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్య మంత్రి విజయ్ ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా, నీట్  అక్రమాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులపై నమోదైన ప్రతి కేసునూ  ఉపసంహరించుకుంటున్నట్లు తమిళనాడు విద్యాశాఖ మంత్రి వెల్లడించారు.  

ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు నిరసనకారులపై కఠినంగా వ్యవహరిస్తూ, తీవ్రమైన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విద్యార్థుల ఆవేదనను, వారి హక్కులను గుర్తించి మద్దతుగా నిలవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రతీక అని విశ్లేషకులు అంటున్నారు. 

 Withdrawal of cases against NEET protesters in Tamil Nadu, CM Vijay, NEET protests, withdrawal of cases, Tamil Nadu news

By
en-us Political News

  
నల్లమలలో సోదాలు.. కౌకూర్‌, యాప్రాల్‌, అచ్చంపేటలో ఆయుధాల కోసం గాలింపు..!
హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్యనగర్‌లోని హరిహర మెన్ హాస్టల్‌లో దారుణ హత్య చోటుచేసుకుంది. తోటి పనివాడు ప్రమోద్ జరిపిన కత్తిపోట్లకు కుక్ శశిధర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఢిల్లీ ఎర్రకోట బాంబు పేలుడు కేసులో ఎన్ఐఏ సంచలన చార్జ్‌షీట్ దాఖలు చేసింది. 11 మంది ప్రాణాలు తీసిన ఈ ఘటన వెనుక లాల్ మందిర్ దాడి కుట్ర, మూత్రం నుంచి బాంబు తయారీ, 12 సార్లు రెక్కీ నిర్వహించిన విస్తుపోయే వివరాలు వెలుగులోకి వచ్చాయి.
అమెరికాలోని పెన్సిల్వేనియా ల్యాంకాస్టర్ కౌంటీలో ఎఫ్రాతా పోలీసులు చేపట్టిన కీలక అరెస్ట్ వివరాలు. క్రైమ్‌వాచ్ నిఘా మరియు తాజా క్రైమ్ అప్‌డేట్స్ కోసం చదవండి.
ఒడిశా కోరాపుట్ పరిధిలోని బాలిపేట సేవాశ్రమం హాస్టల్‌లో 9వ తరగతి విద్యార్థి సీయారా తాడింగిపై సహవిద్యార్థి తీవ్రంగా దాడి చేశాడు. మత్తు పదార్థాల ప్రభావంతోనే ఈ దాడి జరిగిందని, ర్యాగింగ్ అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఆయుధాలు చోరీ అయ్యాయి అంటూ సీన్ క్రియేట్ చేసిన ఇంటి దొంగలు..!
లండన్ వీసాలు, ఉద్యోగాల పేరిట మోసాల ఆరోపణలతో యూట్యూబర్ నందూస్ వరల్డ్ నందనను విజయవాడ పోలీసులు 4 గంటల పాటు విచారించారు. బిగ్ బాస్ తెలుగు 10 ఎంట్రీ ప్రచారం, రూ. 15 లక్షల ఫిర్యాదు మరియు పోలీసులకు ఆమె ఇచ్చిన షాకింగ్ స్టేట్‌మెంట్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
సంగారెడ్డి జిల్లా కంది మండలంలో అక్రమ ఇసుక దందాపై మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. ఎర్ధనూర్ సర్వే నెంబర్ 134లోని నక్క వాగు పరివాహక ప్రాంతంలో ఉన్న 6 ఇసుక ఫిల్టర్లను ధ్వంసం చేశారు. వాల్టా చట్టం ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు హెచ్చరించారు.
లండన్ ఉద్యోగాలు, వీసా రెన్యువల్స్ పేరిట రూ.15 లక్షల మోసానికి పాల్పడిన ఆరోపణలపై నందూస్ వరల్డ్ యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలు మరియు సీఐ సుబ్రహ్మణ్యం అందించిన పూర్తి సమాచారం ఇక్కడ చదవండి!
ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని పహుజ్ డ్యామ్ వద్ద సోషల్ మీడియా రీల్ కోసం 30 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకిన యువకుడి రెండు కాళ్లు విరిగిపోయాయి. వైరల్ స్టంట్ వికటించిన పూర్తి వివరాలు మరియు వీడియో కథనం ఇక్కడ చదవండి.
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.