Publish Date:Jul 15, 2025
టెస్ట్ క్రికెట్ చరిత్రలో వెస్టిండీస్ చెత్త రికార్డ్ నమోదు చేసింది. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లో విండీస్ రెండో అత్యల్ప స్కోరు చేస్తే... ఆస్ట్రేలియా టీమ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. వెస్టిండీస్‌ను కేవలం 27 పరుగులకే ఆలౌట్ చేసింది. ఇది టెస్ట్‌ల్లో రెండో అత్యల్ప స్కోరు. జమైకాలోని కింగ్‌స్టన్ వేదికగా మూడో టెస్ట్ లో 175 పరుగులతో కంగారూ జట్టు విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 3-0 తేడాతో ఆసీస్ క్లీన్ స్వీప్ చేసింది. కెరీర్‌లో వందో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న మిచెల్ స్టార్క్ భీకర బౌలింగ్‌తో విండీస్ బ్యాట్స్‌మెన్లను బెంబేలెత్తించాడు. స్టార్క్ 6 వికెట్లు తీయగా.. బొలాండ్ 3 (హ్యాట్రిక్), హేజిల్‌వుడ్ ఒక వికెట్ తీశారు. ఆసీస్ బౌలర్ల దెబ్బకు ఏకంగా ఏడుగురు వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ డకౌట్ అయ్యారు. గ్రేవిస్ అత్యధికంగా 11 పరుగులు చేయగా.. మైకేల్ లూయిస్, అల్జారీ జోసఫ్ తలో 4 పరుగులు చేశారు.
స్పార్క్ తన మొదటి ఓవర్‌లో మూడు వికెట్లు తీశాడు. మొత్తం 15 బంతుల వ్యవధిలో 5 వికెట్లు పడగొట్టి విండీస్ పతనాన్ని శాసించాడు. ఆ క్రమంలో టెస్ట్ క్రికెట్ చరిత్రలో అతి తక్కువ బంతుల్లో 5 వికెట్టు సాధించిన బౌలర్‌గా స్టార్క్ రికార్డు సృష్టించాడు. రెండో ఇన్నింగ్స్‌లో కంగారూలను 121 పరుగులకు ఆలౌట్ చేసి సంబరపడిన విండీస్‌కు ఆ ఆనందం ఎంతో సేపు నిలబడలేదు. విండీస్ బ్యాటర్లలో ఏడుగురు డకౌట్ అయ్యారు.
టెస్ట్ చరిత్రలో 1955లో ఇంగ్లాండ్‌పై 26 పరుగులకే అలౌట్ అయిన న్యూజిలాండ్ అత్యల్ప స్కోర్లలో మొదటి స్థానంలో కొనసాగుతోంది. మళ్లీ ఇంత కాలానికి విండీస్ ఆ చెత్త రికార్డుకు చేరువై రెండో అతి చెత్త ఇన్నింగ్ ఆడింది. మన భారత్ 2020లో ఆస్ట్రేలియాపై 36 పరుగులకు ఆలౌట్ అయి ఆ చెత్త రికార్డుల్లో 8వ స్థానంలో ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/windies-worrest-record-in-test-cricket-39-202055.html
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్‌షీట్ విడుదల చేశారు.