తెలంగాణలోనూ బీజేపీ బెంగాల్ ఫార్ములా? వర్కౌట్ అవుతుందా?

Publish Date:Jun 29, 2026

Advertisement

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా  బీజేపీ) వ్యూహాలకు పదును పెడుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్  పార్టీ తెలంగాణ నాయకత్వానికి దిశా నిర్దేశం చేశారు.   ఈ ఏడాది పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని, అక్కడ క్షేత్రస్థాయిలో చేసిన ప్రజా పోరాటాలను తెలంగాణ బీజేపీ నేతలు స్ఫూర్తిగా తీసుకోవాలని  పిలుపునిచ్చారు. బెంగాల్ మోడల్ తరహాలోనే ఇక్కడ కూడా ప్రజా సమస్యలపై పోరాడి విజయం సాధించాలన్న నితిన్ నబీన్.. రాష్ట్ర నాయకుల మధ్య విభేదాలు, క్రమశిక్షణ రాహిత్యాన్ని ఇక ఎంత మాత్రం సహించబోమని స్పష్టమైన హెచ్చరిక చేశారు. అయితే తెలంగాణలో బెంగాల్ ఫార్ములా వర్కౌట్ అవుతుందా? అంటే పరిశీలకులు మాత్రం ఆ అవకాశం ఇసుమంతైనా లేదంటున్నారు.  బెంగాల్‌తో తెలంగాణను పోల్చడం సాధ్యం కాదని కుండబద్దలు కొడుతున్నారు. 

 పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాల మధ్య  రాజకీయంగా  భారీ వ్యత్యాసాలు ఉన్నాయి. బెంగాల్‌లో సుదీర్ఘ కాలం పాటు పని చేసిన కమ్యూనిస్టులు క్షేత్రస్థాయిలో పూర్తిగా పట్టు కోల్పోవడం బీజేపీకి  ప్లస్ పాయింట్‌ అయ్యింది. దానికి తోడు అక్కడ  తృణమూల్ కాంగ్రెస్పై తీవ్రమైన అవినీతి, అక్రమాల ముద్ర పడటం, మమతా బెనర్జీ తర్వాత వారసుడిగా కుటుంబ సభ్యులను ముందుకు తీసుకురావడాన్ని బెంగాల్ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. వీటన్నింటికీ మించి బెంగాల్‌లో సువేందు అధికారి లాంటి బలమైన, మాస్ ఇమేజ్ ఉన్న ఒక ఐకాన్ లీడర్ బీజేపీకి దొరకడం కలిసి వచ్చింది. ఈ రాజకీయ, సామాజిక సమీకరణాలే అక్కడ బీజేపీ విజయానికి మార్గం సుగమం చేశాయి.

కానీ..  అటువంటి పరిస్థితి లేదు.  రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై గానీ, సీఎంపై గానీ ప్రజల్లో పెద్దగా  వ్యతిరేకత కనిపించడం లేదు. అదే సమయంలో ఈ మూడేళ్లలో కాంగ్రెస్ సర్కార్ పై అవినీతి ముద్ర పడిన దాఖలాలు కనిపించడం లేదు. క్షేత్రస్థాయిలో   కొన్ని ఆరోపణలు వస్తున్నప్పటికీ..  వాటిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు సరిదిద్దుకునే ప్రయత్నాలు చేస్తోంది.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల్లో   బలమైన   నేతగా, మాస్  లీడర్‌గా, అసెంబ్లీ లోపలా  బయటా గట్టిగా గళం ఎత్తగల నాయకుడిగా  గుర్తింపు పొందారు. ఇటువంటి బలమైన వ్యూహకర్తను ఢీకొట్టడం బీజేపీ అంత సులభ సాధ్యం కాదని పరిశీలకులు అంటున్నారు.  మరోవైపు..  బెంగాల్‌లో సువేందు అధికారి తరహాలో రాష్ట్రం మొత్తం ప్రభావం చూపించగల  నాయకుడు ప్రస్తుతం తెలంగాణ బీజేపీ ఎవరూ కనిపించడం లేదని చెబుతున్నారు. అలాగే తెలంగాణ బీజేపీలో ముఖ్య నేతల మధ్య  అంతర్గత విభేదాలు, ఆధిపత్య పోరాటాలు, కుమ్ములాటలు క్షేత్రస్థాయిలో క్యాడర్‌ను గందరగోళంలో పడేశాయని చెబుతున్నారు. 

 అలాగే.. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ప్రధాన ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితికి క్షేత్రస్థాయిలో ఓటు బ్యాంక్  ఇప్పటికీ బలంగానే ఉండటం కూడా బీజేపీకి అధికారం అంత సులువుగా దక్కదన్న అభిప్రాయానికి కారణం అవుతోంది. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా.. వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో   త్రిముఖ పోటీ తధ్యమని పరిశీలకులు అంటున్నారు. ఆ కారణంగానే.. బెంగాల్ తరహా ఏకపక్ష వ్యూహాలు ఇక్కడ ఫలించే అవకాశాలు అంతంత మాత్రమేనని విశ్లేషిస్తున్నారు. అన్నిటికీ మించి  రాష్ట్ర విభజన జరిగి దాదాపు 12 సంవత్సరాలు గడుస్తున్నా..  విభజన చట్టంలో పేర్కొన్న ప‌లు కీలక ప్రాజెక్టులు, హామీలు, తెలంగాణకు రావాల్సిన నిధులు వంటి హామీలను  కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటికీ పూర్తిగా నెరవేర్చలేదనే అసంతృప్తి స్థానికంగా చాలా చాలా బలంగా ఉంది.  తెలంగాణ ఆవిర్భావానికి  పార్లమెంట్‌లో తాము కూడా మద్దతు తెలిపామని బీజేపీ క్రెడిట్ కోరుకుంటున్నప్పటికీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న ఈ పుష్కర కాలంలో  రాష్ట్రానికి చేసిన ఆర్థిక సాయం ఎంత అనే ప్రశ్నకు రాష్ట్ర బీజేపీ నేతలు సమాధానం చెప్పలేక తడబడుతున్న పరిస్థితి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలోనే..   కేవలం బెంగాల్ ఫార్ములాను నమ్ముకుని తెలంగాణలో పాగా వేయాలనుకోవడం నేల విడిచి సాము చేయడంగా మారుతుందన్నది పరిశీలకుల విశ్లేషణ. 

By
en-us Political News

  
కంగుతిన్న వైసీపీ అసెంబ్లీలో లోకేష్ ప్రసంగంపై ప్రజలలో చర్చ జరగకుండ ఉండేందుకు మండలి వేదికగా బొత్స పెద్ద డ్రామాకు తెరతీసి.. అచ్చెన్నాయుడు తనను అవమానించారు, క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేసి గందరగోళం సృష్టించే ప్రయత్నించారన్నారు. 
మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన కుమారుడు రాజీవ్, వారి కుటుంబ సభ్యులపై  జోగి రాజీవ్ భార్య  మేఘన పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వరకట్న వేధింపులు, గృహహింస, మతమార్పిడి ఒత్తిళ్లు అంటూ మేఘన  ఫిర్యాదు మేరకు 11 మంది పై కేసు నమోదైన సంగతి తెలిసిందే.
నిబంధనల ప్రకారం భర్తీ చేయాల్సిన ఈ పదవుల కోసం ఆయన ఇప్పటికే ఇద్దరి పేర్లు ప్రతిపాదించారు.  సామాజిక న్యాయం, ప్రాంతీయ సమతుల్యతతో పాటు పార్టీ పట్ల అంకిత భావాన్నీ, పార్టీ కోసం పని చేసిన తీరునూ కూడా పరిగణనలోనికి తీసుకుని మరీ ఈ పేర్లు ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం.    
ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్‌ రెడ్డికి జాయింట్‌ కో-ఆర్డినేటర్‌ బాధ్యత..!
అర్బన్ నక్సల్, రూరల్ నక్సల్ అనే పదాల సరసన ఇప్పుడు దిమాగీ నక్సల్అ నే కొత్త బ్రాండ్‌ను చేర్చారన్నారు భరద్వాజ. అంతేందుకు ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలైట్లను భౌతికంగా నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ప్రకటించి మార్చి 31 2026 డెడ్ లైన్ విధించిన సంగతిని గుర్తు చేశారు.
ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్ ఐదు డీఎస్సీలు నిర్వహించాల్సిన ఆయన ప్రభుత్వం ఒక్క డీఎస్సీ ఎందుకు నిర్వహించలేకపోయిందో చెప్పాలన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకూ ఇప్పుడు వైసీపీ లోకేష్ రాజీనామా చేయాలన్న డిమాండ్ కూ పొంతన లేదన్నారు.
ఈ కొత్త పాలకమండలిలో వివిధ రాష్ట్రాల నుంచి కీలక నాయకులకు చోటు కల్పించారు.  కాగా బిజెపి జాతీయ ఉపాధ్యక్ష పదవుల్లో మొత్తం 13 మంది నాయకులకు అవకాశం దక్కింది. వీరిలో  పురందేశ్వరి ఒకరు. 
వనపర్తి కాంగ్రెస్‌లో టికెట్ వివాదం..నేను కూడా జీవన్ రెడ్డిలా తిరగబడతా..!
ప్రజాసమస్యలపై చర్చ జరగాల్సిన మండలిలో ఇరు పార్టీలకు చెందిన నేతలూ.. వ్యక్తిగత దూషణలతో సభలో మాటల యుద్ధానికి దిగారు.  ముఖ్యంగా  మండలిలో విపక్ష నాయకుడు, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మంత్రి అచ్చెన్నాయుడుల మధ్య మాటల మంటలు రేగాయి. పరస్పరం విమర్శలు, ఆరోపణలు గుప్పించుకున్నారు.
సెంబ్లీ ఎన్నికలలో తన జన సురాజ్ పార్టీ ఘోర పరాజయం పాలైనప్పటికీ... ఇటీవల బంకీపూర్ నియోజకవర్గ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిశోర్ బీజేపీ కంచు కోటను బద్దలు కొట్టి మరీ విజయం సాధించారు.
భారత ప్రధాన న్యాయమూర్తి ఒక కేసు విచారణ సందర్భంగా చేసిన కాక్రోచ్ అన్నపదం ఎంతటి సంచలనానికి దారి తీసిందో.. ప్రధాని తన పంద్రగస్టు ప్రసంగంలో ఉపయోచించిన దిమాగీ నక్సల్ పదం కూడా అంతకు మించి సంచలనం సృష్టించింది. 
 ఏపీ గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్‌గా నాగబాబును నియమిస్తూ..  ఆయనకు కేబినెట్ హోదాను కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ  సోమవారం ఉత్తర్వులు ారీ చేసింది.  
గత కొంతకాలంగా పార్టీలో తనను ఏ విధంగా పక్కన పెట్టారో  వివరించారు. ముఖ్యంగా సింగరేణి కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో, తన కుమారుడి విద్యాభ్యాసానికి సంబంధించిన గ్రాడ్యుయేషన్ వేడుకల కోసం అమెరికా వెళ్లిన  సమయంలోనే కనీసం ముందస్తు సమాచారం,  షోకాజ్ నోటీసు కూడా ఇవ్వకుండా  తనను ఆ పదవి నుంచి తొలగించారని గుర్తు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.