మండలిలో బొత్స వర్సెస్ అచ్చెన్నాయుడు.. దద్దమ్మ.. దున్నపోతు అంటూ మాటల యుద్ధం.!

Publish Date:Aug 17, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాల తొలిరోజే  అధికార తెలుగుదేశం, విపక్ష వైసీపీ సభ్యుల మధ్య మాటలయుద్ధంతో రాజకీయం వేడెక్కింది. ప్రజాసమస్యలపై చర్చ జరగాల్సిన మండలిలో ఇరు పార్టీలకు చెందిన నేతలూ.. వ్యక్తిగత దూషణలతో సభలో మాటల యుద్ధానికి దిగారు.  ముఖ్యంగా  మండలిలో విపక్ష నాయకుడు, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మంత్రి అచ్చెన్నాయుడుల మధ్య మాటల మంటలు రేగాయి. పరస్పరం విమర్శలు, ఆరోపణలు గుప్పించుకున్నారు. సభా మర్యాద మరిచి వ్యక్తిగత దూషణలకు దిగారు.

ఒకరు దద్దమ్మ అంటే మరొకరు దున్నపోతు అన్నారు. అసలీ రచ్చకు కారణం సభలో  డీఎస్సీ   అంశంపై మొదలైన సాధారణ చర్చ. ఈ చర్చ సందర్భంగా బొత్స, అచ్చెన్నాయుడు ఇరువురూ కూడా సంయమనం కోల్పోయి,   వ్యక్తిగత విమర్శలు, దూషణలకు దిగడమే కాకుండా బాడీ షేమింగ్ వ్యాఖ్య కూడా చేసుకున్నారు. 

వైసీపీ  హయాంలో డీఎస్సీ నోటిఫికేషన్ ఎందుకు   ఇవ్వలేకపోయారంటూ ప్రశ్నించిన   మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ నాయకత్వాన్ని నిలదీశారు. విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ వ్యవహరించిన తీరును ఎండగట్టారు.  అప్పట్లో సరైన నోటిఫికేషన్ ఇవ్వలేని  దద్దమ్మ  అంటూ   విమర్శించారు. అచ్చెన్నాయుడు చేసిన  దద్దమ్మ వ్యాఖ్యపై దీటుగా స్పందించిన బొత్స సత్యనారాయణ,  అచ్చెన్నాయుడుపై బాడీ షేమింగ్ కు దిగారు. ఎవరు ఎద్దులాగా పెరిగారో, ఎవరు దద్దమ్మో, ఎవరు ఆంబోతో ప్రజలందరికీ తెలుసునంటూ బొత్స వ్యాఖ్యానించారు.  ఈ వివాదం సభలో కలకలం రేపాయి.  

Botsa Satyanarayana, Atchannaidu, AP Legislative Council, DSC Notification, YCP vs TDP, AP Politics, TeluguOne

By
en-us Political News

  
అర్బన్ నక్సల్, రూరల్ నక్సల్ అనే పదాల సరసన ఇప్పుడు దిమాగీ నక్సల్అ నే కొత్త బ్రాండ్‌ను చేర్చారన్నారు భరద్వాజ. అంతేందుకు ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలైట్లను భౌతికంగా నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ప్రకటించి మార్చి 31 2026 డెడ్ లైన్ విధించిన సంగతిని గుర్తు చేశారు.
ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్ ఐదు డీఎస్సీలు నిర్వహించాల్సిన ఆయన ప్రభుత్వం ఒక్క డీఎస్సీ ఎందుకు నిర్వహించలేకపోయిందో చెప్పాలన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకూ ఇప్పుడు వైసీపీ లోకేష్ రాజీనామా చేయాలన్న డిమాండ్ కూ పొంతన లేదన్నారు.
ఈ కొత్త పాలకమండలిలో వివిధ రాష్ట్రాల నుంచి కీలక నాయకులకు చోటు కల్పించారు.  కాగా బిజెపి జాతీయ ఉపాధ్యక్ష పదవుల్లో మొత్తం 13 మంది నాయకులకు అవకాశం దక్కింది. వీరిలో  పురందేశ్వరి ఒకరు. 
వనపర్తి కాంగ్రెస్‌లో టికెట్ వివాదం..నేను కూడా జీవన్ రెడ్డిలా తిరగబడతా..!
సెంబ్లీ ఎన్నికలలో తన జన సురాజ్ పార్టీ ఘోర పరాజయం పాలైనప్పటికీ... ఇటీవల బంకీపూర్ నియోజకవర్గ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిశోర్ బీజేపీ కంచు కోటను బద్దలు కొట్టి మరీ విజయం సాధించారు.
భారత ప్రధాన న్యాయమూర్తి ఒక కేసు విచారణ సందర్భంగా చేసిన కాక్రోచ్ అన్నపదం ఎంతటి సంచలనానికి దారి తీసిందో.. ప్రధాని తన పంద్రగస్టు ప్రసంగంలో ఉపయోచించిన దిమాగీ నక్సల్ పదం కూడా అంతకు మించి సంచలనం సృష్టించింది. 
 ఏపీ గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్‌గా నాగబాబును నియమిస్తూ..  ఆయనకు కేబినెట్ హోదాను కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ  సోమవారం ఉత్తర్వులు ారీ చేసింది.  
గత కొంతకాలంగా పార్టీలో తనను ఏ విధంగా పక్కన పెట్టారో  వివరించారు. ముఖ్యంగా సింగరేణి కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో, తన కుమారుడి విద్యాభ్యాసానికి సంబంధించిన గ్రాడ్యుయేషన్ వేడుకల కోసం అమెరికా వెళ్లిన  సమయంలోనే కనీసం ముందస్తు సమాచారం,  షోకాజ్ నోటీసు కూడా ఇవ్వకుండా  తనను ఆ పదవి నుంచి తొలగించారని గుర్తు చేశారు.
వందే మాతరం గేయానికి ఆమె చేసిన అపచారాన్ని 140 కోట్ల మంది భారతీయులు ఆమెను ఎన్నటికీ క్షమించరన్నారు.  వందేమాతరం గేయానికి చేసిన అపచారానికి ఆ  గేయ రచయిత బంకించంద్ర ఛటోపాధ్యాయతో పాటు  40 కోట్ల దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు.  
ఆంధ్రప్రదేశ్ లో జగన్ పార్టీకి అదేనండీ వైసీపీకి జనం కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా అర్హత లేదని 2024 ఎన్నికలలో విస్పష్ట తీర్పు ఇచ్చేశారు. అయినా నిస్సిగ్గుగా జగన్ కోర్టును విపక్ష హోదా కోసం ఆశ్రయించారు.
ఎవరైనా సరే పార్టీ గీత దాటి మాట్లాడితే సహించేది లేదు..మహేష్ కుమార్ గౌడ్..!
ధనవంతులు, పలుకుబడి ఉన్న వ్యక్తుల భూములు, ఆస్తులను భూసేకరణ నుండి కాపాడేందుకే యాక్సెస్ రోడ్డును నిబంధలకు విరుద్ధంగా నిర్మించారనీ, ప్రధాన రహదారిలో ఎస్ కర్వ్ ఎందుకు వచ్చిందంటూ ప్రశ్నలు సంధిస్తూ సందేహాలను ప్రేరేపించే ప్రయత్నం వైసీపీ సోషల్ మీడియా ఓ రేంజ్ లో చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.