టాస్క్ ఫోర్స్ టీమ్ సోషల్ మీడియా బూతు పంచాంగానికి చెక్ పడేనా?

Publish Date:Jul 8, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కక్షసాధింపులు, వ్యక్తిగత దూషణలకు వేదికగా మారిన సోషల్ మీడియాను అదుపు చేసేందుకు కూటమి ప్రభుత్వం  అడుగులు వేస్తోంది. ఇంటర్నెట్ వేదికగా సాగుతున్న అసభ్యకర పోస్టులు, వికృత వ్యాఖ్యలను అడ్డుకోవడానికి ప్రత్యేకంగా ఒక  సోషల్ మీడియా టాస్క్ ఫోర్స్ టీమ్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల అధికారికంగా ప్రకటించారు.

గత కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సోషల్ మీడియా వేదికగా విపరీతమైన   విద్వంసకర వాతావరణం నెలకొంది. భావప్రకటనా స్వేచ్ఛ ముసుగులో ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతలు,  ఇతర ప్రజాప్రతినిధులపై  బూతులు తిట్టడం, శృతిమించిన వ్యక్తిగత దూషణలకు దిగడం నిత్యకృత్యంగా మారింది. చదువు చెప్పిన గురువులు, పెంచిన తల్లిదండ్రులు తలదించుకునేలా దరిద్రమైన పదజాలంతో సాగుతున్న ఈ అరాచకానికి బ్రేక్ వేయడమే ఈ టాస్క్ ఫోర్స్ ముఖ్య ఉద్దేశం.

రాష్ట్రంలో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చర్చనీయాంశంగా మారింది. ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు ప్రముఖ నాయకులపై నిస్సిగ్గుగా విమర్శలు చేసినందుకు పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ప్రస్తుత చట్టాల ప్రకారం ఏడేళ్ల లోపు శిక్ష పడే సెక్షన్ల కింద కేసులు నమోదు కావడంతో కోర్టులో అతనికి తక్షణమే బెయిల్ లభించింది.

ఇలాంటి చట్టపరమైన లొసుగులను వాడుకుని నిందితులు సులభంగా బయటపడుతున్నారని  ప్రముఖ విశ్లేషకుడు కిలారు నాగార్జున  అభిప్రాయపడ్డారు. తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన సోషల్ మీడియాలోలొ వికృత, అసభ్య పోస్టులు పెట్టే వారిని పోలీసులు 41ఏ నోటీసులు ఇచ్చి విచారించి వదిలేయడం వారికి  భయం లేకుండా పోతోందన్నారు. కేవలం టాస్క్ ఫోర్స్ బృందాలను వేసి నిందితులను కోర్టు ముందు ప్రవేశపెట్టినంత మాత్రాన ఈ సమస్య పూర్తిగా సమసిపోదన్నారు. 

గత ప్రభుత్వంలో కూడా న్యాయమూర్తులు, ప్రతిపక్ష నేతలపై జరిగిన వ్యక్తిగత దాడులను పరిశీలిస్తే..  చట్టాల్లో కఠినమైన మార్పులు రానంత వరకు సోషల్ మీడియా వికృత చేష్టలకు అడ్డుకట్ట వేయడం అసాధ్యమన్నారు. తీవ్రమైన బూతులు,  బెదిరింపులకు పాల్పడే వారిపై నాన్-బెలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసేలా చట్ట సవరణలు జరగాల్సిన అవసరం ఉందని కిలారు నాగార్జున అన్నారు.

ఈ సోషల్ మీడియా బూతుల పంచాంగానికి శాశ్వత పరిష్కారం లభించాలంటే కేవలం ప్రభుత్వాలు, టాస్క్ ఫోర్స్‌లే కాకుండా అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు స్వీయ నియంత్రణ పాటించాల్సి ఉంటుందన్నారు. మనం వాడే దారుణమైన పదజాలం రేపు మన కుటుంబ సభ్యులపైకి కూడా వస్తుందనే విజ్ఞత ప్రతి ఒక్కరిలోనూ కలగాలి. అప్పుడే ఏపీలో ఆరోగ్యకరమైన రాజకీయ వాతావరణం నెలకొంటుందని కిలారు నాగార్జున అన్నారు. ఎన్నిటాస్క్ ఫోర్సులు వేసినా కఠిన చట్టాలను తీసుకువస్తే తప్ప ఈ సమస్య రూపుమాపడం సాధ్యం కాదన్నారు. 

AP Social Media Task Force, Online Abuse Control AP, Social Media Laws India

 

 

By
en-us Political News

  
డిలీట్ చేసిన డేటా కోసం పోలీసులు ఫోన్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ఆ ల్యాబ్ నుంచి వచ్చిన నివేదికలో షాకింగ్ అంశాలు వెలుగులోకి వచ్చాయి. రావణ్ అమాయక యువతులను టార్గెట్ గా చేసుకుని వారితో అసభ్యకరంగా ప్రవర్తించడం.. ఏకాంతంగా ఉన్న సమయంలో ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసినట్లు ఫోరెన్సీక్ ల్యాబ్ నివేదికలో వెల్లడైనట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న 9 ప్రముఖ AI టూల్స్ యొక్క బలహీనతను వాడుకుని హాకర్లు భారీ బాట్‌నెట్ నెట్‌వర్క్‌లను సృష్టిస్తున్నారు. హాలూస్క్వాటింగ్ (HalluSquatting) అనే ఈ సరికొత్త సైబర్ ముప్పు గురించిన పూర్తి వివరాలు మీకోసం.
2026 సంవత్సరంలో ఉక్కపోత మరియు వేసవి ఎండలను తరిమికొట్టే సరికొత్త షార్క్, డైసన్ మరియు డ్రియో కంపెనీల టాప్ 5 కూలింగ్ ఫ్యాన్స్ వివరాలు, ధరలు మరియు వాటిలోని AI మోషన్ ట్రాకింగ్, వాటర్ మిస్ట్ టెక్నాలజీ ప్రత్యేకతలు మీకోసం.
శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఫలితాల తర్వాత గ్లోబల్ చిప్ మార్కెట్లో భారీ పతనం. అమెరికా వాల్ స్ట్రీట్‌లో ఇంటెల్, ఏఎండీ, శాన్‌డిస్క్ షేర్లు కుప్పకూలాయి. నాస్‌డాక్ 500 పాయింట్లు పడిపోవడానికి గల పూర్తి కారణాలు, చమురు ధరల పెరుగుదల వివరాలు ఇక్కడ చూడండి.
అమరావతి ల్యాండ్ పూలింగ్ రైతులకు ఏపీసీఆర్‌డీఏ భారీ ఊరటనిచ్చింది. ఎకరాకు రూ. 40,000 కౌలు పెంపు, మరో 15 ఏళ్ల పొడిగింపుతో పాటు రూ. 1.5 లక్షల రుణమాఫీ ప్రకటనతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ తాగే వాటర్ బాటిల్ ధర రూ.49 లక్షలు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న షాకింగ్ నిజాలు, ఆ బాటిల్ ప్రత్యేకతలు ఇక్కడ చూడండి.
ఫీఫా వరల్డ్ కప్ 2026 క్వార్టర్ ఫైనల్స్ ముందు ఊహించని పరిణామం క్రిస్టియానో రొనాల్డో పోర్చుగల్, మరియు హోస్ట్ యూఎస్ఏ జట్లు టోర్నీ నుండి అవుట్ కావడంతో క్వార్టర్ ఫైనల్ టికెట్ల ధరలు భారీగా పడిపోయాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో భారత్ ఘోర ఓటమి తర్వాత సంజూ శాంసన్‌ను జట్టు నుంచి తప్పించడంపై వివాదం చెలరేగింది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన వివరణ, స్టేడియం బయట ఫ్యాన్స్ హంగామా పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) మరియు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఉపయోగించి దీర్ఘకాలంలో కోట్ల రూపాయల సంపదను ఎలా సృష్టించాలో ఉదాహరణలతో సులభంగా తెలుసుకోండి.
బ్రిటన్ గ్రామీణ ప్రాంతాల్లో 14 చిన్న తరహా అణు రియాక్టర్ల (SMR) ఏర్పాటు కోసం పోలిష్ బిలియనీర్ 35 బిలియన్ పౌండ్ల భారీ పెట్టుబడిని ప్రకటించారు. AI డేటా సెంటర్ల విద్యుత్ అవసరాల కోసం గూగుల్ భాగస్వామ్యంతో వస్తున్న ఈ ప్రాజెక్ట్ పూర్తి వివరాలు చూడండి.
హోమ్ సెక్యూరిటీ కెమెరాలు అనవసరమైన ఖర్చు అనుకుంటున్నారా? అర్ధరాత్రి వేళ ఇద్దరు దొంగలు గోడ దూకిన ఈ భయంకరమైన నిజ జీవిత సంఘటన మరియు కెమెరాల ప్రాముఖ్యత గురించి ఇప్పుడే చదవండి.
బిట్‌డిఫెండర్ ఐడెంటిటీ థెఫ్ట్ ప్రొటెక్షన్‌తో ఆన్‌లైన్ మోసాలకు అడ్డుకట్ట వేయండి. బడ్జెట్ ధరలో $1 మిలియన్ ఇన్సూరెన్స్, డార్క్ వెబ్ మానిటరింగ్ మరియు క్రెడిట్ అలర్ట్స్ పొందే పూర్తి వివరాలు మీకోసం.
ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్‎డీఎఫ్‎సీ (HDFC Bank) రుణగ్రహీతలకు షాకిస్తూ MCLR లోన్ వడ్డీ రేట్లను సవరించింది. పెరిగిన కొత్త రేట్లు, మీ హోమ్ లోన్, కార్ లోన్ ఈఎంఐలపై పడే ప్రభావం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.