నేడు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభోత్సవం..షెడ్యూల్ ఇదే..!

Publish Date:Jul 31, 2026

Advertisement

 

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నేడు ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేయనున్నారు. ఉదయం 10:45 గంటలకు భోగాపురం చేరుకోనున్న ప్రధానికి  రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తదితరులు స్వాగతం పలుకుతారు.. ప్రధానికి సంప్రదాయ థింసా నృత్యంతో ఘన స్వాగతం పలకనున్నారు. టెర్మినల్‌ వద్ద 200 మంది విద్యార్థులతో కూచిపూడి నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. సుమారు 2 గంటల 25 నిమిషాల పాటు ప్రధాని భోగాపురంలో పర్యటించనున్నారు. 

ఉదయం 11:30 గంటలకు ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభ కార్యక్రమం జరగనుంది. అనంతరం ఓపెన్‌టాప్‌ జీప్‌లో ప్రధాని బహిరంగ సభకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 1:05 గంటలకు భోగాపురం నుంచి ప్రధాని తిరుగు ప్రయాణం కానున్నారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభోత్సవం నేపథ్యంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నేడు జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. యూజీ, పీజీ, ప్రొఫెషనల్‌ కోర్సులకు సంబంధించిన పరీక్షలను వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. 

ఈ పర్యటనలో భాగంగా గిరిజన మహిళలు, బాలికలు ప్రధాని మోదీకి థింసా నృత్యంతో విశిష్ట స్వాగతం పలకనున్నారు. ఏకరీతి దుస్తులు ధరించి, సంప్రదాయబద్ధంగా వారు చేసే నృత్యం ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.ప్రారంభోత్సవం అనంతరం జరిగే బహిరంగ సభ వేదికపై నుంచి ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.  ప్రధాని పర్యటన ఏర్పాట్లను సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నతస్థాయిలో సమీక్షించారు. మంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్, పి. నారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, ఇతర అధికారులు వీడియో కాన్ఫరెన్సులో పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు.

 Bhogapuram Airport Flight Schedule, Air India New Flights Vizag, Bhogapuram International Airport, Hyderabad to Bhogapuram Flights, Vijayawada to Bhogapuram Air India, Vizianagaram Airport Operations
 

By
en-us Political News

  
మానవ DNAలో దాగి ఉన్న రహస్య గోస్ట్ లినేజ్ ఆనవాళ్ళను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 8 లక్షల సంవత్సరాల నాటి ఈ అజ్ఞాత మానవ జాతి డిఎన్ఏ మన శరీరంలోకి ఎలా వచ్చింది? పరిశోధనలో తేలిన సంచలన గణాంకాలు మరియు నిజాలు ఇవే!
ప్రముఖ సౌండ్ ఇంజనీర్ కుర్ట్ మార్టినెజ్ తన ఇంటి వెనుక ఉన్న 2.5m x 3.5m గార్డెన్ షెడ్‌ను ప్రపంచ స్థాయి డాల్బీ ఆట్మాస్ మ్యూజిక్ స్టూడియోగా ఎలా మార్చారో, అందులో వాడిన స్పీకర్లు, అకౌస్టిక్ టెక్నాలజీ మరియు ఆశ్చర్యపరిచే నిజాలు ఇక్కడ తెలుసుకోండి.
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అర్ధాంగి అన్నా కొణిదెల తన పుట్టినరోజు సందర్భంగా సమాజానికి స్ఫూర్తిదాయకమైన నిర్ణయం తీసుకున్నారు.
మీరు ఎలక్ట్రిక్ వాహనం ఉపయోగిస్తున్నారా? సాధారణ మోటార్ ఇన్సూరెన్స్ మీ EV బ్యాటరీ మరియు ఛార్జింగ్ కిట్‌లకు రక్షణ ఇవ్వదు. EV షీల్డ్, ఆన్ డ్యామేజ్ ప్రీమియం, మరియు జీరో డిప్రిసియేషన్ గురించి తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
భారతదేశపు మొట్టమొదటి ఆర్‌ఈఐటీ ఇండెక్స్ ఫండ్‌ను ఆగస్టు 5న ఎడెల్‌వైస్ మ్యూచువల్ ఫండ్ ప్రారంభించనుంది. తక్కువ ఖర్చుతో వాణిజ్య రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి, టాక్స్ బెనిఫిట్స్ మరియు గత రాబడుల సమగ్ర విశ్లేషణ ఇక్కడ తెలుసుకోండి.
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ తన ఆల్ టైమ్ టాప్ 8 వన్డే బ్యాటర్ల జాబితాను ప్రకటించారు. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌ను వెనక్కి నెట్టి విరాట్ కోహ్లీకి అగ్రస్థానం కట్టబెట్టారు. రోహిత్ శర్మకు 5వ స్థానం దక్కింది. పూర్తి గణాంకాలు, వివరాలు ఇక్కడ చూడండి!
ఉత్తరాంధ్ర రూపురేఖలను సమూలంగా మార్చేసే దిశగా రూపుదిద్దుకున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది.
హీరో మోటోకార్ప్ విడా VX2 GO FB 3.1kWh ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. రూ.1.13 లక్షల ధరతో 128 కిమీ రేంజ్, 70 కిమీ టాప్ స్పీడ్, డైరెక్ట్ ప్లగ్ ఛార్జింగ్, 4.3 అంగుళాల డిస్‌ప్లే మరియు 65 నిమిషాల ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
కోల్‌కతా నైట్ రైడర్స్ KKR లో తీవ్ర నాయకత్వ సంక్షోభం! అజింక్య రహానే రిటైర్మెంట్‌తో కొత్త కెప్టెన్ అన్వేషణ మొదలైంది. ఐపీఎల్ 2024 విజేత శ్రేయస్ అయ్యర్‌ను వదులుకోవడం వల్ల కేకేఆర్ ఎలా నష్టపోయిందో, రాబోయే ఐపీఎల్ 2027 కోసం రేసులో ఉన్న ఆటగాళ్ల వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ఏపీ సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు.
55 అడుగులు దాటిన నీటిమట్టం..!
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
మైలవరం రాజకీయాలు, వీటీపీఎస్ ఫ్లై యాష్ రవాణా వివాదం, పార్టీ అంతర్గత అంశాలపై మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.