రేవంత్ కాంగ్రెస్ కాడి వదిలేస్తారా?

Publish Date:Jan 7, 2023

Advertisement

తెలంగాణలో కాంగ్రెస్ లో వర్గ పోరు చినికి చినికి గాలివానగా మారిందా?  అధిష్ఠానం జోక్యం. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మార్పు తర్వాత కూడా విభేదాలు సమసి పోలేదా అంటే జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఔననే సమాధానమే వస్తుంది.  అసమ్మతి నేతల తీరుతో రేవంత్ రెడ్డి విసిగిపోయారని ఆయన మాటలను బట్టే అర్ధమౌతుంది. పార్టీ కోసం అవసరమైతే తాను టీ పిసిసి అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని రేవంత్ అనడం వెనుక ఆయన ఫ్రస్ట్రేషనే కనిపిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు తాను ఎంత ప్రయత్నిస్తున్నా అసమ్మతి నేతలు పడనీయడం లేదన్న భావన రేవంత్ లో నెలకొందన్న విషయాన్ని ఆయన సన్నిహితులు ఆఫ్ ది రికార్డ్ చెబుతున్నారు. అన్నిటికీ మించి కాంగ్రెస్ లోని కొందరు నేతలు  బిఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని రేవంత్ భావిస్తున్నారు.  

ఆ విషయం తెలిసినా అధిష్ఠానం కూడా చూసీ చూడనట్లు వ్యవహరించడం రేవంత్ మనోభావాలను గాయపరిచిందని అంటున్నారు. అసమ్మతి వర్గం డిమాండ్ మేరకు   తెలంగాణ కాంగ్రెస్   వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్ ను అధిష్ఠానం పక్కన పెట్టడం ఒక రకంగా తన దూకుడు తగ్గించాలని హెచ్చరించడంగానే రేవంత్ పరిగణిస్తున్నారని అంటున్నారు.  అసలు టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి  నుంచీ పార్టీలో సీనియర్లుగా చెప్పుకుంటున్న వారి నుంచి ఎటువంటి సహకారం అందలేదన్నది వాస్తవం. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం రేవంత్ ఒక అడుగు ముందుకు వేస్తే.. అసమ్మతి వర్గం తన చర్యలతో పది అడుగులు వెనక్కులాగేసే ప్రయత్నాలు చేశారు. తెలుగుదేశం నుంచి నిన్న కాక మొన్న పార్టీలో చేరిన రేవంత్ కు టీపీసీసీ అధ్యక్ష పగ్గాలు అప్పగించడమేమిటన్న దుగ్ధ వినా పార్టీలో అసమ్మతి నాయకులు రేవంత్ కు వ్యతిరేకంగా జట్టు కట్టడానికి మరో కారణం కనిపించదు.  

రాష్ట్రంలో అధికార పార్టీని దీటుగా ఎదుర్కొని ప్రజా క్షేత్రంలో ప్రజల మద్దతుతో ముందుకు వెళ్లాలని భావించినా రేవంత్ రెడ్డికి సొంత పార్టీలో అంతర్గత సమస్యలు అడుగడుగునా అడ్డం పడుతున్నాయి. తొలి నుంచీ  టీపీసీసీ చీఫ్ రేవంత్ నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ సీనియర్లు, ఇటీవల పీసీసీ కమిటీల్లోనూ  రేవంత్ వర్గానికి పెద్దపీట వేశారన్న నెపంతో ఒక్కసారిగా అసమ్మతి స్వరం పెంచడంతో పంచాయతీ రోడ్డెక్కింది. ఇంత కాలం పట్టీపట్టనట్టు వ్యవహరించిన అధిష్ఠానం రంగంలోకి దిగింది. అయితే కర్రా విరగకుండా, పామూ చావకుండా పంచాయతీని పరిష్కరించడానికి హై కమాండ్ చేసిన ప్రయత్నం ఏ మాత్రం ఫలించలేదు సరికదా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మరింత బలహీన పరిచిందని పార్టీ వర్గాలే అంటున్నాయి.  పార్టీలో ఉన్న పంచాయితీలు మరింత రచ్చకెక్కాయి.  రేవంత్ రెడ్డికి  సహకరించాడని, రేవంత్ వర్గం వద్ద డబ్బులు తీసుకుని పదవులు కట్టబెట్టారని పార్టీ సీనియర్లు మాణిక్కం ఠాగూర్ ను ఆ పదవి నుంచి తొలగించాలని ఇటీవల తెలంగాణా కు వచ్చిన దిగ్విజయ్ సింగ్ వద్ద డిమాండ్ చేశారు.

ఇక దిగ్విజయ్ సింగ్ నివేదిక మేరకు అన్నంత పని చేసిన కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ ను పక్కన పెట్టి ఆయన స్థానంలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జిగా మాణిక్యరావు ఠాక్రేకు అవకాశం కల్పించింది. అయితే ఈ నిర్ణయం ఇటు రేవంత్ రెడ్డిని కానీ, అటు ఆయన వ్యతిరేక వర్గం వారిని కానీ సంతృప్తి పరచలేదనే చెప్పాలి. తన వ్యతిరేకుల డిమాండ్ కు తలొగ్గి అధిష్ఠానం తీసుకున్న నిర్ణయం తనను బలహీనుడిని చేసిందని రేవంత్ భావిస్తుంగా, మాణిక్కం ఠాగూర్ ను మాత్రమే కాదు, రేవంత్ ను కూడా టీపీసీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించాలన్న తమ డిమాండ్ ను హై కమాండ్ పూర్తిగా నెరవేర్చలేదన్న అసంతృప్తి  రేవంత్ వ్యతిరేక వర్గంలో కనిపిస్తోంది.  ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ కాడె మోయడం అనవసరమన్న భావనకు వచ్చారని ఆయన వర్గీయులు అంటున్నారు.

పార్టీ బలోపేతం చేయడానికి రేవంత్ చేపట్టదలచిన పాదయాత్రను సైతం తన వ్యతిరేక వర్గం అంటే సీనియర్లు అడ్డుకోవడానికి ప్రయత్నించడాన్ని రేవంత్ ఏ విధంగానూ సహించలేకపోతున్నారని అంటున్నారు. అంతే కాకుండా పార్టీ హైకమాండ్ కూడా సీనియర్లు అన్న ఒకే ఒక్క కారణంతో తన వ్యతిరేక వర్గం మాటకు విలువనిస్తుండటం కూడా రేవంత్ రెడ్డికి మింగుడు పడటం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన నోటి వెంట రాజీనామా మాట వచ్చిందని అంటున్నారు.   టీ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి తీసుకున్న అనేక నిర్ణయాలను సీనియర్లు తప్పుపడుతుండటాన్ని కూడా రేవంత్  సీరియస్ గా తీసుకున్నారంటున్నారు.  ఈ నేపథ్యంలోనే రేవంత్ తన భవిష్యత్ కార్యాచరణపై తీవ్రంగా ఆలోచిస్తున్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. కాంగ్రెస్ ను వీడి సొంత పార్టీ ఏర్పాటు చేయడమా లేక తెలంగాణలో బలోపేతం కోసం ప్రయత్నిస్తున్న తెలుగుదేశం గూటికి చేరడమా అన్న ఆలోచనలో ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

By
en-us Political News

  
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4-0తో ఎన్డీఏ క్లీన్ స్వీప్.!
జగన్‌ తాను మళ్లీ  అధికారంలోకి వస్తానంటూ జగన్ 2.o అంటూ చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ మేం 10x చూపిస్తామంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ జగన్ చేసిన హెచ్చరికలకు పవన్ కల్యాణ్  దీటుగా ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ పొలిటికల్ సర్కిల్స్ లోనూ, సోషల్ మీడియాలోనూ కూడా పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.  
పులివెందుల నియోజకవర్గ పరిధిలో కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. దశాబ్దాల కాలంగా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఏకపక్షంగా జగన్ కు పట్టుఉన్న నియోజకవర్గం పులివెందుల. అటువంటి పులివెందులలో ఎంపీటీసి జడ్పీటీసి స్థానాలను టీడీపీ  ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.