ఒకే దెబ్బకు రెండు పిట్లలు.. ఇదే బీఆర్ఎస్ స్కెచ్

Publish Date:Jan 7, 2023

Advertisement

 ఒకే దెబ్బకు రెండు పిట్టలు..  బిఆర్ఎస్ వెనుక దాగి ఉన్న భారీ స్కెచ్ ఇదేనా? అంటే రాజకీయ వర్గాలు ఔననే అంటున్నాయి.  తెలంగాణలో కె. చంద్రశేఖర్ రావు,  ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  ఇద్దరు మళ్ళి అధికారంలోకి వచ్చేందుకు వేసిన మాస్టర్ ప్లానే బీఆర్ఎస్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పార్టీ ఒక్కటే రాష్ట్రాలే రెండు అన్నట్లుగా ఒకే పార్టీతో ఇటు తెలంగాణ, అటు ఏపిలోనూ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వేసిన బృహత్తర ప్రణాళికే బిఆర్ఎస్ అంటున్నారు ప్రాంతీయ సెంటిమెంట్ రగిలించి, దానిని  ఓట్ల రూపంలో దండుకోవాలి,  ఎన్నికల్లో గెలవాలన్న లక్ష్యంతోనే బీఆర్ఎస్ ఆవిర్భవించిందంటున్నారు  

బిఆర్ఎస్ విస్తరణ పేరిట ఏపిలో నాయకులను కొందరిని చేర్చుకొని, వారితో ప్రకటనలు చేయించడం, సమావేశాలు, సభల నిర్వహణకు సమాయత్తం కావడం ఇదంతా ఆ వ్యూహంలో భాగమే అంటున్నారు. బీఆర్ఎస్ సాకుతో కేసీఆర్ ఏపీలో అడుగుపెట్టడంపై ఏపీ నేతల నుంచి విమర్శలను ఆహ్వానించడం, వీటికి ప్రతిగా ఏపీ నేతలపై తెలంగాణలో ఆగ్రహజ్వాలలు ఎగసి పడటం జరగాలన్న లక్ష్యంతోనే బీఆర్ఎస్ ఏపీలో విస్తరణకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు విశేష ప్రచారం చేశాయంటున్నారు.  బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఏపీలో, బీఆర్ఎస్ పై విమర్శలకు నిరసనగా తెలంగాణలో ప్రాంతీయ సెంటిమెంట్ రగల్చాలన్నదే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వ్యూహంగా చెబుతున్నారు.  

 ఆ వ్యూహంలో భాగంగానే తోట చంద్రశేఖర్, రావెల కిషోర్, పార్థసారథి తదితరులు బీఆర్ఎస్ లో చేరగానే వైసిపి నేతలు, మంత్రులు తమ గళానికి పదును పెట్టారు. మంత్రులైతే.. ఏకంగా సిగ్గుండాలి.. బుద్ది  చెప్పుతారు.. అంటూ కేసీఆర్ లక్ష్యంగా విమర్శలకు పదును పెట్టారు. ఏపీకి వెన్నుపోటు పొడిచింది చాలదా..? శ్రీశైలంలో, నాగార్జున్ సాగర్ లలో విద్యుత్  దోచుకుంటూ.. నీటిని సముద్రంలోకి వదులుతున్న వాళ్ళు ఇక్కడకు వచ్చి  చేసేదేంటి అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. మంత్రి రోజా కూడా తనదైన శైలితో స్పందించారు. విభజన చట్టం ప్రకారంగా రాష్ట్రానికి ఇవ్వాల్సినది ఇవ్వకుండా ఈ ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెడితే ప్రజలే బుద్ది చెప్పుతారంటూ నిప్పులు చెరిగారు.  కెసిఆర్ జాతీయ స్థాయిలో కొట్లాడాలే గానీ, ఆంధ్రప్రదేశ్ లో చేసేదేమిటి..? రాష్ట్ర విభజనలో,  ఏపీ నష్టపోవడంలోనూ ఆయన పాత్ర ఉందంటూ కొడాలి నాని ధ్వజమెత్తారు.

ఈ విమర్శలు, నిప్పులు చెరగడాలు అన్నీ కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వ్యూహంలో భాగమేననీ అంటున్నారు.  ఇక ఏపీలో బీఆర్ఎస్ సభ తరువాత నుంచీ తెలంగాణ నుంచి ఏపీ నేతలపై విమర్శలు ప్రారంభమౌతాయన్నది పరిశీలకుల విశ్లేషణ. ఇప్పటికే కేసీఆర్, ఆ తరువాత మంత్రులు ఏపీలో అభివృద్ధి లేమి గురించిన విమర్శలు మళ్లీ మొదలెట్టేశారు. తాజాగా స్వచ్చ సర్వేక్షణ్ అవార్డులు తెలంగాణకు భారీగా రావడంపై హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో   కేటీఆర్ ప్రసగించారు. బీఆర్ఎస్ హయాంలో భారీగా అభివృద్ధి జరిగిందని చెప్పారు. అయితే ఎంత అభివృద్ధి జరిగిందో చెప్పుకోవాలంటే పోలిక ఉండాలి కాబట్టి పక్క రాష్ట్రాన్ని చూపించారు. ఆ రాష్ట్రం వెళ్లి చూసి వస్తే తేడా తెలుస్తుందన్నారు. ఏపీలో గుంతల రోడ్లు, విద్యుత్ కష్టాలు, తరలిపోతున్న పరిశ్రమలు,  కరవైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పరోక్షంగా ప్రస్తావిస్తూ కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే తెరాస ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇటీవల తిరుమల శ్రీవారి దర్వనం చేసుకున్నారు. ఆ సందర్బంగా విలేకరులతో మాట్లాడుతూ.. రాజకీయాలలో మార్పు రావాలంటే బీఆర్ఎస్ తోనే సాధ్యమని అన్నారు. ఏపీలో చాలామంది ఎమ్మెల్యేలు, మాజీలు బీఆర్ఎస్ పార్టీకి టచ్ లో ఉన్నారని త్వరలో అందరూ బీఆర్ఎస్ లో చేరతారని అన్నారు. సరైన నాయకత్వం లేక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో వెనుకబడి ఉందని వ్యాఖ్యానించారు. మొత్తంగా ఒక పక్కా వ్యూహం ప్రకారం ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ తమ తమ రాష్ట్రాలలో తమ విజయం ఖరారు చేసుకోవడానికి, ఇరు రాష్ట్రాల ప్రజలలో సెంటిమెంట్ రగిల్చి.. ప్రాంతీయ చిచ్చు రగిల్చి లబ్ధి పొందేందుకు బీఆర్ఎస్ ను వాడుకుంటున్నారన్నది పరిశీలకుల విశ్లేషణ.

By
en-us Political News

  
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4-0తో ఎన్డీఏ క్లీన్ స్వీప్.!
జగన్‌ తాను మళ్లీ  అధికారంలోకి వస్తానంటూ జగన్ 2.o అంటూ చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ మేం 10x చూపిస్తామంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ జగన్ చేసిన హెచ్చరికలకు పవన్ కల్యాణ్  దీటుగా ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ పొలిటికల్ సర్కిల్స్ లోనూ, సోషల్ మీడియాలోనూ కూడా పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.  
పులివెందుల నియోజకవర్గ పరిధిలో కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. దశాబ్దాల కాలంగా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఏకపక్షంగా జగన్ కు పట్టుఉన్న నియోజకవర్గం పులివెందుల. అటువంటి పులివెందులలో ఎంపీటీసి జడ్పీటీసి స్థానాలను టీడీపీ  ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.