పీకే కాంగ్రెస్‌లో చేరిన‌ట్టేనా?.. కేసీఆర్‌కు హ్యాండ్ ఇచ్చిన‌ట్టేనా?

Publish Date:Apr 18, 2022

Advertisement

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే వార్తలు చాలా కాలంగానే వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రాలతో గతంలోనూ ఆయన అనేక మార్లు చర్చలు జరిపారు.  అయితే, ఎందుకనో గానీ ఆ వ్యవహారం అంత సాఫీగా సాగినట్లు లేదు. కొంత గ్యాప్ వచ్చింది.పరస్పర విమర్శలు వినిపించాయి. నెహ్రూ గాంధీ కుటుంబ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకోదని పీకే చేసిన ట్వీట్లు, రాహుల్ గాంధీని చులకన్ చేస్తూ చేసిన ట్వీట్లు అప్పట్లో వైరల్ అయ్యాయి.

అయితే ఇప్పుడు మళ్ళీ పీకే కాంగ్రెస్ గూటికి చేరుతున్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. అందుకు కారణం లేక పోలేదు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్టీ ముఖ్యనేతలతో జరిపిన కీలక సమావేశంలో  పీకే కూడా పాల్గొన్నారు. పాల్గొనడమే కాదు, 2024 ఎన్నికల వ్యూహంపై ఆయన ప్రజెంటేషన్’ కూడా ఇచ్చారు. ఈ ప్రజెంటేషన్’ ను పరిశీలించేందుకు, సోనియా గాంధీ ముగ్గురు సభ్యులతో ఓ కమిటీని వేశారు. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి నిర్ణయం ఉంటుందని, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ మీడియాకు తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్టీ  సీనియర్ నాయకులతో కలిసి పీకేతో ఎన్నికల వ్యూహం గురించి చర్చించడం బహుశా ఇదే తొలిసారి,కావచ్చును.గతంలోనూ సొనియా, రాహుల్, ప్రియాంక వాద్రాలతో ఉమ్మడిగా, విడివిడిగానూ కూడా పీకే సమావేశమయ్యారు. అయితే,ఆ సమావేశాలో ఇతర నాయకులు ఎవరూ పాల్గొన సమాచరం అయితే లేదు. అంతే కాదు, పార్టీ అధికారికంగా సమావేశం వివరాలను మీడియా ముందు ఉంచలేదు.ఆ విధంగా ప్రస్తుత సమావేశం ప్రాధాన్యత సంతరించుకుందని అంటున్నారు. 

రాబోయే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024 సార్వత్రిక ఎన్నికల్లో అనుచరించవలసిన వ్యూహంపై చర్చించేందుకు మరో నెలరోజుల్లో కాంగ్రెస్ పార్టీ ‘చింతన్ శిభిర్’ నిర్వహిస్తున్న నేపధ్యంలో పీకే ప్రెజెంటేషన్ ఇవ్వడం, అదే విధంగా అదే సమావేశంలో ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరే విషయం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే గతంలోనే, ఆయన కండిషన్లు ఒప్పుకుని పీకేను  పార్టీలోకి తీసుకోవడానికి అంగీకరించని సీనియర్ నాయకులు ఇప్పుడు కూడా అదే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, గతంలో పీకే కాంగ్రెస్’లో చేరాలంటే తనకు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవితో పాటుగా, పొత్తులు, ఎన్నికల వ్యూహాల విషయంలో పూర్తి సేచ్చ ఇవ్వాలనే కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పుడు పీకే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారా? లేక కేవలం ఎన్నికల వ్యూహ కర్తగా పనిచేసేందుకు మాత్రమే సోనియా గాంధీ, ఇతర సీనియర్ నాయకులతో చర్చలు జరిపారా అనే విషయంలో స్పష్టత లేదు. 

అయితే, కాంగ్రెస్ లో చరికపై ప్రశాంత్ కిశోర్  గత కొంత కాలంగా విభిన్న  రీతుల్లో స్పందిస్తూ వచ్చారు. ఒక సందర్భంలో అయితే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు తాను సిద్ధంగానే ఉన్నాన్ననని, అయితే, కొన్ని విషయాల్లో, ముఖ్యంగా కుటుంబ నాయకత్వం విషయంలో కొన్ని చిక్కుముళ్ళున్నాయని చెప్పు కొచ్చారు. అయితే, అదే సమయంలో కాంగ్రెస్ లేకుండా ఏర్పడే ఏ కూటమి అయినా బీజేపీన ఓడించలేదని చెప్పు కొచ్చారు. 

కాంగ్రెస్’లో చేరే విషయంగా పీకే ఇప్పటికే పలు మార్లు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో భేటీ అయ్యారు. మరోవంక పీకే కండిషన్స్, షరతులు అంగీకరిస్తూ ఆయనను పార్టీలో చేర్చుకునే విషయమై కాంగ్రెస్ హైకమాండ్ ఎప్పటినుంచి అటూ ఇటూ అవుతోంది. ఇంతవరకు జరిగిన కథ ఇరివురికి కూడా, ‘కొంచెం ఇష్టం, కొంచెం కష్టం’  కథలానే సాగుతోంది.  అయితే, కీలకమైన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో స్పష్టమైన నిర్ణయం వెలువరించాలని అధినేత్రి సోనియా డిసైడ్ అయినట్లు సమాచారం. దీంతోపాటే చింతన్ బైఠక్ తీరుతెన్నులు, అజెండా, భేటీ తేదీలను చర్చించడానికే సోనియా శనివారం నాటి సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి పీకేను కూడా పిలవడం ద్వారా ఆయన చేరికపై అధినేత్రి పాజిటివ్ సిగ్నల్స్ పంపినట్లయిందని అంటున్నారు.మరోవంక తన రాజకీయ భవిష్యత్తుగా మే 6లోగా కచ్చితంగా ఏదోఒక నిర్ణయం తీసుకుంటానని ప్రశాంత్ కిషోర్ ఇదివరకే ప్రకటించిన నేపధ్యంలో మరో 20 రోజుల్లో పీకే, కొత్త అవతారం ఏమిటో తేలిపోతుందని, రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

By
en-us Political News

  
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.