మునుగోడు ‘మరో చరిత్ర’ సృష్టిస్తుందా?

Publish Date:Sep 4, 2022

Advertisement

గత ఏడాది (2021)  అక్టోబర్ మాసంలో  జరిగిన హుజురాబాద్ అసెంబ్లీ నియోజక వర్గం ఉప ఎన్నిక చరిత్రను సృష్టింది. అలాగే, ఈ సంవత్సరం చివర్లో  జరిగే మునుగోడు అసెంబ్లీ నియోజక వర్గం ఉప ఎన్నికకు రంగం  సిద్దమవుతోంది. ఈ నేపధ్యంలో హుజురాబాద్ చరిత్రను మునుగోడు తిరగ రాస్తుందా? మరో చరిత్రను సృష్టిస్తుందా? ఇప్పుదు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతోంది.   
నో ... నో... మనం ఇప్పుడు మాట్లాడుకుంటోంది ఎన్నికల ఫలితాల గురించి కాదు. హుజూరాబాద్ ఫలితం మునుగోడులో పునరావృతం అవుతుందా, కాదా అని అసలే కాదు.  ఓటర్ల చైతన్యం గురించి అంతకంటే కాదు. హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రజాసామ్య వ్యవస్థపై మిగిల్చిన చెరగని మరక గురించే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము. అవును, హుజురాబాద్ ఉప ఎన్నిక చరిత్రలో ఒక మచ్చలా మిగిలిపోయింది.  
హుజురాబాద్ ఉప ఎన్నికకు కొన్ని నెలల ముందు నుంచే, ఎన్నికల సందడి మొదలైంది. నియోజక వర్గం ప్రజలు ఇంచు మించుగా నాలుగు నెలల పాటు, నిత్య విందులలో మునిగి తేలారు. అవును, హుజురాబాద్ ఉప ఎన్నిక ఖర్చు అక్షరాల ఇన్ని కోట్లని చెప్పలేము. తక్కువలో తక్కువ ఒక వెయ్యి కోట్ల పైమాటగానే, చెప్పుకుంటున్నారు. కానీ, శ్రీ సర్కార్ వారు ఆ మూడు నాలుగు నెలలో  నియోజకవర్గంలో  అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కోసమే, ప్రభుత్వ ఖజానా నుంచి రూ.5 వేల కోట్ల వరకు ఖర్చు చేశారని, అధికారిక గణాంకాలే సూచిస్తున్నాయని అంటున్నారు. 
ఇక అధికార పార్టీ ఖర్చుచేసిన కోట్ల విషయం అయితే చెప్పనక్కరలేదు. అవును అధికార పార్టీకి సమతూకంగా కాకపోయినా, అందుకు దీటుగానే బీజేపీ (ఈటల) కూడా కోట్లు ఖర్చు చేశారు. అలా ఓ వంక ప్రభుత్వం, మరో వంక అధికార, ప్రత్యర్ధి పార్టీలు కోట్లలో కుమ్మరించారు, ఓటు రేటు రూ.6000 నుంచి రూ.10,000 వేల వరకూ పలికిందన్న ప్రచారం జరిగింది.  కాబట్టే, హుజురాబాద్ ఉపఎన్నిక రాష్ట్రంలో కాదు, దేశంలోనే, ‘అత్యంత’ఖరీదైన ఉప ఎన్నికగా చరిత్ర  సృష్టించింది. అంతే కాదు, అధికార తెరాస ఇచ్చిన, కానుకల కవర్లు తమ దాకా రాలేదని ఓటర్లు తెరాస నాయకులను బహిరంగంగా నిల దీశారు. ధర్నాలు చేశారు. ఇది కూడా, హుజురాబాద్ ఉప ఎన్నిక సృష్టించిన మరో  ‘చరిత్ర’. 
నిజానికి హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత, రాజీనామాకు ఎమ్మెల్యేల పై ప్రజల వత్తిడి పెరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజీనామా చేసి, ఉప ఎన్నిక వస్తే హుజూరాబాద్ ఓటర్లకు దక్కిన  భోగ భాగ్యాలు తమకు కూడా దక్కుతాయనే ఆశలు అందరిలో చిగురించాయి. అందుకే ఎమ్మెల్యేల రాజీనామాకు ప్రజలు కోరుకున్నారు. నిజానికి, ఒక హుజూరాబాద్ అనే కాదు, హుజూరాబాద్   మోతాదు లో కాకున్నా, ఉప ఎన్నికలు జరిగిన అన్ని నియోజక వర్గాల్లోనూ తెరాస ప్రభుత్వం, అభివృద్ధి, సంక్షేమ పథకాలను పరుగులు తీయించింది. తెరాస  రెండవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ నాలుగు నియోజక వర్గాల్లోనూ  ప్రభుత్వం, అధికార పార్టీ  ఆకాశమే హద్దు అన్న విధంగా నిధులను ఖర్చు చేయడం జరిగింది. అఫ్కోర్స్, హుజూరాబాద్ ను ముఖ్యమంత్రి ఇజ్జత్ కి సవాల్ గా  తీసుకున్నారు కాబట్టి  అక్కడ మోతాదు మరింతగా పెరిగింది. ఫ్యామిలీకి పదిలక్షలు ఇచ్చే దళిత బంధు పథకం అనివార్యంగా బయటకు వచ్చింది. 
సరే, అదలా ఉంచి మళ్ళీ మనం, మన మునుగోడు... విషయానికి వస్తే,హుజూరాబాద్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం, అధికార పార్టీ కొంచెం ఆచి తూచి అడుగులు వేస్తున్నాయి.

అయితే, కొత్త పథకాల జోలికి వెళ్లకుండా పాత పెండింగ్ లో ఉన్న పెన్షన్లు, మండలాల ఏర్పాటు, ఇప్పటికే నిధులు మంజూరై పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను కానిచ్చేయడం, అవసరమనుకున్న చోటే అభివృద్ధి పనులను చేయడం మంచిదనే అభిప్రాయానికి ప్రభుత్వ పెద్దలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రధానంగా హుజూరాబాద్ లో ఎదురైన పరాభవం ఒక కారణం అయితే, మూడేళ్ళుగా అభివృద్ధికి నోచుకోని నియోజక వర్గంలో ఎంతో కొంత అభివృద్ధి సాధించేందుకే రాజీనామా చేస్తున్నానని, సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఉప ఎన్నికలలో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్ధి కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి చేస్తున్న చేస్తున్న ప్రచారానికి భయపడి, అధికార తెరాస ప్రస్తుతానికి అయితే కొంత ముందు చూపుతో, మెల్ల మెల్లగా అడుగులు వేస్తోందని అంటున్నారు. 

అయితే, మునుగోడు ఓటర్లు మాత్రం, ఉప ఎన్నికపై  చాలా చాలా ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వ పథకాలు అభివృద్ధి పనుల విషయం ఎలా ఉన్నా, తెరాస, బీజేపీతో పాటుగా కాంగ్రెస్ పార్టీ కూడా సీరియస్ గా పోటీలో ఉన్న నేపధ్యంలో ఓటు రేటు భారీగా పెరుగుతున్నదని, ఓటర్లు లెక్కలు వేస్తున్నారు. మూడు ప్రధాన పార్టీలూ ఒక్కో ఓటుకు ఒక్కో పార్టీ రూ.10 వేల దాకా ఇస్తుందన్న ప్రచారం నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. అంటే, మూడు పార్టీల నుంచి కలిపి ఓటుకు రూ.30 వేల వరకు అందుతాయని స్థానికంగా చర్చ జరుగుతోంది.

 దీంతో ఈ నియోజకవర్గానికి చెందిన, ప్రస్తుతం ఇతర ప్రాంతాల్లో ఓటు హక్కు ఉన్న వారందరి దృష్టి ఇప్పుడు మునుగోడుపై పడింది. ఉప ఎన్నిక నేపథ్యంలో వారంతా మునుగోడు నియోజకవర్గంలో ఓటు నమోదు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన వారు కూడా తమ ఓటును బదిలీ చేసుకునేందుకు దరఖాస్తు చేసుకుంటున్నారు. వీరితో పాటు ఇప్పటిదాకా ఓటు హక్కు రానివారు కూడా పెద్ద సంఖ్యలో ఓటు కోసం దరఖాస్తు చేస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆగస్టు 2 నుంచి ఈ నెల 2వ తేదీ వరకు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కలిపి 13 వేల మంది ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. 

మరో వంక నియోజక వర్గం పరిధిలో, మద్యం ఘుమఘుమలు ఇప్పటికే మొదలయ్యాయి నియోజకవర్గానికి సమీప మండలాల్లోనూ మద్యం విక్రయాలు రెట్టింపయ్యాయి. ఆగస్టు 1 నుంచి 29వ తేదీ వరకు చండూరు, నాంపల్లి, రామన్నపేట ఎక్సైజ్‌ సర్కిళ్ల పరిధిలో 1,11,279 పెట్టెల మద్యం విక్రయాలు జరిగాయి. ప్రభుత్వానికి రూ.43.19 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రధాన రాజకీయ పార్టీలు ప్రత్యేకంగా ఫంక్షన్‌ హాళ్లను తీసుకుని సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ప్రతిరోజూ గ్రామాల్లో పార్టీల ఫిరాయింపు బేరసారాలతో రాత్రివేళ అధిక సంఖ్యలో మద్యం సిట్టింగ్‌లు జరుగుతున్నాయి. దీంతో మద్యం విక్రయాలు మరింత పెరుగుతున్నాయి. అయితే, హుజురాబాద్ తో మునుగోడు పోటీ పడుతుందా? హుజూరాబాద్ మలిన చరిత్రను మునుగోడు చెరిపేస్తుందా? ఇంకా ఎక్కువ చేస్తుందా, అంటే, పరిశీలకులు  చూడాలి మరి ..అంటున్నారు.

By
en-us Political News

  
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.