కాపు సామాజికవర్గంపై జగన్ వ్యూహం.. మొదటికే మోసం.. వైసీపీలో మధనం

Publish Date:Jun 20, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్.. వ్యవహార శైలి, ఆయన అమలు చేస్తున్న వ్యూహాల పట్ల వైసీపీలోనే అసంతృప్తి వ్యక్తం అవుతోందా? అంటే ఆ పార్టీ వర్గాల నుంచే ఔననే సమాధానం వస్తున్నది. ఏపీ రాజకీయాలలో కాపు సామాజికవర్గం ఓటు బ్యాంకుకు  ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగలిగే సత్తా ఉంది. అటువంటి కాపు సామాజికవర్గం విషయంలో జగన్ అనుసరిస్తున్న వ్యూహం మొదటికే మోసం తెచ్చేలా ఉందన్న ఆందోళన వైసీపీ వర్గాలలో వ్యక్తం అవుతున్నది. 

గత సార్వత్రిక ఎన్నికల్లో కాపు సామాజికవర్గం అంతా ఏకతాటిపైకి వచ్చి కూటమికి అండగా నిలబడటం, ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెంటే నడవటం వల్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలోనే జగన్ మోహన్ రెడ్డి రాబోయే రోజుల్లో పార్టీ మనుగడ కోసం, రాష్ట్రంలో మళ్లీ పట్టు సాధించడం కోసం కాపు సామాజికవర్గం విషయంలో  వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే ఆ విషయంలో జగన్.. వరుసగా తప్పుడు వ్యూహాలు, నిర్ణయాలతో కాపు సమాజికవర్గాన్ని పార్టీకి దూరం చేసేలా వ్యవహరిస్తున్నారన్న ఆందోళన వైసీపీ వర్గాలలో వ్యక్తం అవుతోంది.  

 జగన్ మోహన్ రెడ్డి   కాపు సామాజికవర్గాన్నిపార్టీకి అనుకూలంగా మర్చుకోవడానికి ప్రయత్నించడం మాని, ఆ వర్గం అదే సమాజికవర్గానికి చెందిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు దూరం అయితే చాలన్న వ్యూహాన్ని అమలు చేస్తున్నారనీ, కానీ ఇది అంతిమంగా వైసీపీకి తీరని నష్టం చేకూరుస్తుందన్న ఆందోళన వైసీపీ వర్గాలలో బలంగా వ్యక్తం అవుతోంది.  

జగన్ ఈ తీరునువైసీపీలోని  పలువురు సీనియర్లు ప్పుబడుతున్నట్లు తెలుస్తోంది. కాపు సామాజికవర్గంలో అనైక్యతను పెంచడం వల్ల, వారి మధ్య చిచ్చు పెట్టడం వల్ల వైసీపీకి ఇసుమంతైనా ప్రయోజనం, రాజకీయ లబ్ధి ఉండకపోవడం అటుంచి.. అది బూమరాంగ్ అయ్యి మొత్తం కాపు సామాజికవర్గాన్నే పార్టీకి దూరం చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.   

By
en-us Political News

  
దేశ రాజధానిలో నిరసనల నేపథ్యంలో విధించిన కఠిన నిబంధనలపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది.
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకున్న ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
ఆడుతూ పాడుతూ గడపాల్సిన వయసులోనే ఐదేళ్ల చిన్నారి అరేలియా జీవితం విషాదాంతమైంది.
భర్త మంచానికే పరిమితమయ్యాడు.. కుటుంబ బాధ్యతలు ఓవైపు.. జీవితంలో ఎదురైన కష్టాలు మరోవైపు
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
విశాఖపట్నంలో అర్ధరాత్రి వేళ హైవేపై జరిగిన కార్ ఛేజింగ్‌ కలకలం రేపింది.
దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతల అరెస్టు వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసింది
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అక్టోబర్ 13న ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించే అవకాశం ఉందన్న వార్తలు రాజకీయ, జలవనరుల వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
జాతీయ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర రాజకీయ ఉద్రిక్తతలు నడుస్తున్న వేళ, కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.
శ్రీవారికి జైపూర్ దంపతులు రూ.51.55 లక్షల ఆభరణాల కానుక.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.