కేజ్రీవాల్ శపథం వర్కవుట్ అయ్యేనా?

Publish Date:Sep 23, 2024

Advertisement

మళ్ళీ ముఖ్యమంత్రిగానే శాసనసభలో అడుగుపెడతానంటూ చంద్రబాబు చేసిన శపథం వర్కవుట్ అయింది. మొన్నటి ఎన్నికలలో ఘన విజయం సాధించిన ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. ‘చాణక్య శపథం’ తరహాలోనే ‘చంద్రబాబు శపథం’ అనే కొత్త టర్మ్.ని కూడా ఆయన క్రియేట్ చేశారు. ఇప్పుడు అచ్చం అలాంటి శపథాన్నే ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా చేశారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కున్న ఆయన మొన్నటి  వరకూ సీఎం హోదాలోనే రిమాండ్‌లో వున్నారు. జైలు నుంచే ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తించారు. జైల్లో వున్నంతకాలం ముఖ్యమంత్రి పీఠాన్ని విడిచిపెట్టని ఆయన, అదేంటోగానీ బెయిల్ వచ్చిన తర్వాత తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. కేజ్రీవాల్ జైల్లో వున్నప్పుడు పరిపాలన బాధ్యతలను సమర్థంగా నెరవేర్చిన విద్యాశాఖ మంత్రిణి ఆశితిని తన స్థానంలో ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెడుతున్నానని ప్రకటించారు. వచ్చే ఫిబ్రవరిలో ఢిల్లీ ఎన్నికలు జరగాల్సి వుంది. డిసెంబర్లోనే ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని కేజ్రీవాల్ కోరుకుంటున్నారు. ఈసారి జరిగే ఎన్నికలలో తన ప్రజాబలాన్ని నిరూపించుకుని, ఆ తర్వాతే ముఖ్యమంత్రి స్థానం మీద కూర్చుంటానని కేజ్రీవాల్ శపథం చేశారు. ‘కేజ్రీవాల్ శపథం’ బాగానే వుందిగానీ, ఆయన శపథం నెరవేరే అవకాశం ఎంతవరకు వుందనేదే ప్రశ్న!

‘ఒకే ఒక్కడు’ సినిమాలో హీరో అర్జున్‌కి ఒక్కరోజు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని రఘువరన్ కల్పిస్తాడు. అర్జున్ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్న తర్వాత రఘువరన్ చాలా కాజువల్‌గా ఈ ఒక్కరోజు ముఖ్యమంత్రిగా చేసి నీ దారిన నువ్వు వెళ్ళు అంటాడు. దానికి అర్జున్ నాకు చెప్పడానికి మీరెవరు? ఇప్పుడు నేను ముఖ్యమంత్రిని అంటాడు. ఆ తర్వాత రఘువరన్‌కి జలక్ ఇస్తాడు. దాంతో రఘువరన్ జీవితంలో మరోసారి ముఖ్యమంత్రి అవ్వడు. కేజ్రీవాల్ పరిస్థితి కూడా అలాగే అయ్యే అవకాశం వుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్న ఆశితి ఆ పదవి మీద మమకారం పెంచుకుని, పార్టీ మొత్తాన్నీ తన అధీనంలోకి తెచ్చుకుని, కేజ్రీవాల్‌కి జలక్ ఇస్తే పరిస్థితి ఏమిటి? అందరూ జయలలిత చెప్పినట్టల్లా వినే పన్నీరుసెల్వం తరహాలో వుండరు కదా. మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండేల్లాంటి వాళ్ళు కూడా వుంటారు. ఈసారి ఢిల్లీ ఎన్నికలలో కేజ్రీవాల్ గెలుస్తారని ఏమైనా రాసిపెట్టి వుందా? ఎన్నికలలో ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడతారో ఎవరికీ తెలియదు. కేజ్రీవాల్ అందుకు భిన్నమేమీ కాదు. ఎన్నికల సందర్భంగా బీజేపీ ఎన్ని ట్రిక్కులు ప్లే చేయనుందో ఎవరికి ఎరుక? సరే, ఒకవేళ కేజ్రీవాల్ పార్టీ గెలిచినా, ముఖ్యమంత్రి స్థానంలో వున్న ఆశితి, ఆ స్థానంలోనే తాను వుండాలని ముచ్చటపడి పార్టీలో చీలిక తీసుకురారని నమ్మకమేంటి? అందువల్ల కేజ్రీవాల్ చేసిన శపథం అంత ఈజీగా నెరవేరే అవకాశాలైతే కనిపించడం లేదు. కేజ్రీవాల్ శపథం... శపథంలా వుంటుందో, తనకు తానే విధించుకున్న శాపంలా మారుతుందో కాలమే చెప్పాలి.

By
en-us Political News

  
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.