తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధం.. !

Publish Date:Sep 17, 2026

Advertisement

పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. రాష్ట్రంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ అలాగే వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు జరగనున్న ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన జారీ చేసింది. వచ్చే ఏడాది 2027 మార్చి నెలలో సిట్టింగ్ ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో, ఈ రెండు స్థానాలకు కొత్తగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జూరీ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి షెడ్యూల్‌ను అధికారులు తాజాగా విడుదల చేయడంతో పట్టభద్రుల్లో ఉత్కంఠ నెలకొంది. 


ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలనుకునే అర్హులైన అభ్యర్థుల కోసం అధికారిక యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టింది.  ఈ ప్రత్యేక ఓటర్ల నమోదు ప్రక్రియకు సంబంధించి సెప్టెంబర్ 28వ తేదీన అధికారికంగా ప్రజా నోటీసు లేదా ప్రకటన వెలువడనుంది. నవంబర్ 1, 2026 నాటికి డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత సాధించిన పట్టభద్రులందరూ ఈ ఓటర్ల నమోదుకు పూర్తిగా అర్హులుగా ఉంటారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అర్హులైన నిరుద్యోగులు, ఉద్యోగులు మరియు పట్టభద్రులు తమ ఓటు హక్కు కోసం నవంబర్ 6వ తేదీ వరకు ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.

 అక్టోబర్ 15న పత్రికల్లో తొలి పునఃప్రచురణ, అక్టోబర్ 25న రెండో పునఃప్రచురణ చేపట్టనున్నారు. గడువు ముగిసిన తర్వాత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నవంబర్ 25వ తేదీన ముసాయిదా (డ్రాఫ్ట్) ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు.  ఒకవేళ ముసాయిదా జాబితాలో పేర్లు లేకపోతే లేదా తప్పులు ఉంటే, వాటి సవరణలు మరియు అభ్యంతరాల స్వీకరణ కోసం నవంబర్ 25 నుండి డిసెంబర్ 10వ తేదీ వరకు ప్రత్యేక సమయం కేటాయించడం జరిగింది. 

ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను నిశితంగా పరిశీలించి అన్ని రకాల మార్పు చేర్పులు పూర్తి చేసిన అనంతరం, డిసెంబర్ 30వ తేదీన తుది ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేయనున్నట్లు ఎన్నికల సంఘం తేల్చిచెప్పింది. అయితే, ఇక్కడ పట్టభద్రులు అత్యంత గమనించాల్సిన కీలక విషయం ఏమిటంటే.. గతంలో పాత ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నవారు సైతం ఈసారి కొత్తగా మార్పు చేసిన ఫారం-18 ద్వారా విధిగా దరఖాస్తు చేసుకోవాలని ఈసీ స్పష్టం చేసింది. దరఖాస్తుతో పాటు అర్హతకు సంబంధించిన ధ్రువీకరించిన సర్టిఫికెట్ల కాపీలను జతచేయాల్సి ఉంటుంది. పట్టభద్రులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సకాలంలో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. 

 

 

 

[ graduate mlc elections, telangana voters list, form 18 registration, mlc election schedule, telangana news, graduate voters, Mlc Tinmar Malanna, Telugu one, Telugu News ]

By
en-us Political News

  
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.