ఖమ్మం సభతో కేసీఆర్ కు జాతీయ నాయకుడిగా గుర్తింపు వచ్చేసినట్లేనా?

Publish Date:Jan 17, 2023

Advertisement

తెరాసను బీఆర్ఎస్ గా మార్చేసి జాతీయ పార్టీ అని ప్రకటించేసి.. తనకు తానుగా జాతీయ నాయకుడినని భావిస్తున్న కేసీఆర్ కు నిజంగా ఆ గుర్తింపు వచ్చిందా? ఓ ముగ్గురు, నలుగురు ఇతర పార్టీల కు చెందిన నాయకులు ఆయనను కలిసినంత మాత్రాన బీఆర్ఎస్ జాతీయ పార్టీ అయిపోతుందా? ఆయనకు జాతీయ నేతగా గుర్తింపు వచ్చేసిందా? ఆయనను కలిసిన వారంతా తమ నాయకుడిగా కేసీఆర్ ను అంగీకరించేసినట్లేనా? ప్రస్తుతం రాజకీయ వర్గాలలో జోరుగా జరుగుతున్న చర్చ ఇది. ఎందుకంటే.. కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు ముందు తనను తాను జాతీయ నాయకుడిగా ఆవిష్కరించుకోవడానికీ, గుర్తింపు కోసమూ చేయని ప్రయత్నం లేదు.  ఎక్కని గడప లేదు. ఆ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.

ఇక వేరు దారి లేక సొంతంగానే పార్టీని ఏర్పాటు చేసి జాతీయ రాజకీయాలలోకి దూకేశారు. అంతకు ముందు దాదాపు నాలుగుళ్లు ఆయన జాతీయ రాజకీయాలలో ప్రవేశం కోసం అన్ని రకాలుగా ప్రయత్నించారు. సఫలీకృతులు కాలేకపోయారు. చివరాఖరకు   ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ను ఎంగేజ్’ చేసుకున్నా  లాభం లేక పోయింది. ప్రాతీయ పార్టీల జాతీయ కూటమి అంటూ దేశం పట్టుకు తిరిగారు. శరద్ పవార్ మొదలు అరవింద్ కేజ్రీవాల్ వరకు, నితీష్ మొదలు అఖిలేష్ వరకు, మమత మొదలు స్టాలిన్ వరకు ఎక్కని  గడప లేదన్నట్లుగా బీజేపీ వ్యతిరేక నేతలందరినీ కలిశారు. అయినా జేడీయు నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి మినహా మరెవ్వరు, కేసీఆర్ తో కలిసేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. అప్పడు ఇక  చేసేదేం లేక తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)  పేరును భారత రాష్ట్ర సమితి ( భారాస)గా మార్చి, జాతీయ రాజకీయాల్లోకి దూకేశారు.  

అయితే, భారాస జాతీయ పార్టీ అని  కేసీఆర్ ఆయన పరివారం ప్రచారం చసుకున్నంత మాత్రన  భారాస జాతీయ పార్టీ కాదు. ఔను నిజమే భారాస ప్రాంతీయ పార్టీ కాదు. కేంద్ర ఎన్నికల సంఘం, తెరాస పేరు మార్పును అంగీకరించిందే కానీ,   జాతీయ పార్టీగా గుర్తించలేదు. నిజానికి  అది కేంద్ర ఎన్నికల సంఘం చేతిలో పని కూడా కాదు. 

దేశంలో తెరాస/ భారాస వంటి ప్రాంతీయ పార్టీలు చాలానే ఉన్నాయి. అలాగే, రిజిస్టర్ అయిన పార్టీలు.. కాని పార్టీలు చాలానే ఉన్నాయి. అయితే జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందిన పార్టీల సంఖ్య రెండంకెలు కూడా దాటలేదు. గుజరాత్, అసెంబ్లీ ఎన్నికల్లో 13 శాతం వరకు ఓట్లు సాధించి,  ఐదు అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని జాతీయ పార్టీగా గుర్తింపు పొందిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)తో కలిపి, మొత్తం తొమ్మిది పార్టీలు మాత్రమే జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందాయి. గతంలో కాంగ్రెస్‌, భాజపా, సీపీఐ, సీపీఎం, బీఎస్సీ, ఎన్సీపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలకు మాత్రమే జాతీయ పార్టీ హోదా ఉండగా.. 2019లో అరుణాచల్‌ప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో పోటీచేసి అవసరమైన ఓట్లు, సీట్లు సాధించడం ద్వారా నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ(ఎన్‌పీపీ) జాతీయ పార్టీ హోదాను పొందింది. ఈ పార్టీకి అంతకముందు మణిపూర్‌, మేఘాలయా, నాగాలాండ్‌లలో గుర్తింపు ఉండగా.. 2019లో అరుణాచల్‌ప్రదేశ్‌లోనూ రాష్ట్ర పార్టీగా గుర్తింపు సాధించడం ద్వారా 2019 జూన్‌లో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్‌పీపీకి జాతీయ హోదాను కల్పించింది. దీంతో దేశంలో ఇప్పటివరకు జాతీయ పార్టీల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఇక తాజగా ఈ జాబితాలో తొమ్మిదో పార్టీగా ఆప్‌ అర్హత సాధించింది.

అందుకే ఇప్పటికీ కేసీఆర్ అంటే ఆయన నాయకత్వం వహిస్తున్న పార్టీ పేరులో భారత్ ఉన్నా జాతీయ మీడియా, జాతీయ నాయకులు ఇప్పటికీ ప్రాంతీయ పార్టీ నాయకుడిగానే గుర్తిస్తున్నారు. అందుకే ఆయన తన బీఆర్ఎస్ తొలి బహిరంగ సభను ఘనంగా నిర్వహించి.. జాతీయ రాజకీయాలో ప్రవేశాన్ని చాటుకోవాలని భావిస్తున్నారు. ఇందు కోసం ఆయన తొలుత ఢిల్లీలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని భావించారు. అదే బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ కావాలని.. తద్వారా దేశ రాజధానిలో తన తొలి అడుగు ఘనంగా పడేలా ఉండాలని భావించారు.

అయితే తానొకటి తలిస్తే.. అన్నట్లుగా అన్ని ఆప్షన్లనూ కాదనుకుని బీఆర్ఎస్ తొలి బహిరంగ సభకు ఖమ్మం వేదిక చేశారు. ఈ సభకు ఢిల్లీ, కేరళ, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులను, యూపీ మాజీ సీఎంను ఆహ్వానించారు. కేసీఆర్ ఆహ్వానాన్ని మన్నించి వారంతా ఖమ్మం సభకు తరలి వస్తున్నారు. అలా వచ్చిన వారికి ఆయన తాను పునర్నిర్మించిన యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని చూపించనున్నారు.  ఖమ్మం సభకు వామపక్షాల జాతీయ నేతలు సైతం వస్తున్నారు. ఎంత లేదనకుండా దాదాపు వంద మంది ప్రముఖులు వస్తున్నట్లు సమాచారం. వీరందరికీ కేసీఆరే ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేశారనీ చెబుతున్నారు. దీంతో అనివార్యంగా బీఆర్ఎస్ ఖమ్మం సభకు జాతీయ మీడియా కూడా ప్రాధాన్యత ఇస్తుందని అంటున్నారు. అయితే కొన్ని పార్టీల అధినేతలు, కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరైనంత మాత్రాన కేసీఆర్ కు జాతీయ నాయకుడిగా గుర్తింపు వచ్చేస్తుందా? బీజేపీ వ్యతిరేక పోరాటంతో తమ నేతగా ఆయా నాయకులు కేసీఆర్ కు  పట్టం కట్టేసినట్లేనా అంటే పరిశీలకులు కాదనే చెబుతున్నారు.

ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది. ఖమ్మం సభను కేజ్రీవాల్ అందుక ఒక అవకాశంగా మార్చుకునే అవకాశం ఉంది. హస్తినలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవానికి హాజరు కాకపోవడమే కాకుండా, నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ బీఆర్ఎస్ ఫ్లెక్సీలను తొలగించిన ఆప్ సర్కార్.. కేసీఆర్ ను జాతీయ స్థాయిలో నాయకుడిగా అంగీకరించి వెనుక ర్యాలీ అవుతుందా? అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. 

By
en-us Political News

  
విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాల ఐక్యత.. ఏపీకి సాయం.!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఒక్కోసారి చిన్న ప్రయత్నం కూడా ఊహించని విధంగా జీవితాన్ని మార్చేస్తుందనడానికి నిదర్శనంగా నిలిచింది ఒక ఉదంతం.
ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాను ప్రభావంతో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు నష్టం వాటిల్లింది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ సిబ్బంది సేవలందిస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
కేరళలోని కొచ్చిలో సంచలనం సృష్టించిన మెర్సిడెస్ బెంజ్ కారు ప్రమాదం కేసు పోలీసు శాఖలో కలకలం రేపుతోంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
మహా న‌గ‌రం హైద‌రాబాద్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ తాగు నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4-0తో ఎన్డీఏ క్లీన్ స్వీప్.!
ప్రభుత్వ కార్యాలయాల గోడలపై ఎక్కడ చూసినా ఒకే నినాదం కనిపిస్తుంది.. లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరం
జగన్‌ తాను మళ్లీ  అధికారంలోకి వస్తానంటూ జగన్ 2.o అంటూ చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ మేం 10x చూపిస్తామంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ జగన్ చేసిన హెచ్చరికలకు పవన్ కల్యాణ్  దీటుగా ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ పొలిటికల్ సర్కిల్స్ లోనూ, సోషల్ మీడియాలోనూ కూడా పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.  
రాష్ట్రంలో అర్నబ్ తుపాను ప్రభావంతో పరిస్థితులు తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.