బీజేపీ అధ్యక్షుడిగా నడ్డా కొనసాగింపు!

Publish Date:Jan 16, 2023

Advertisement

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జెపి నద్దానే కొనసాగించే అవకాశాలు ప్రస్ఫుటమౌతున్నాయి. ఆయన పదవీకాలం ముగిసినప్పటికీ, ఈ ఏడాది 9 రాష్ట్రాలలో జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని,  తిరిగి ఆయననే   అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశాలున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఆ మేరకు  , ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు సందర్భంగా అధికారికంగా ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

బీజేపీ తాత్కాలిక జాతీయ అధ్యక్షుడిగా జెపి నద్దాను కొనసాగనున్నట్లు దాదాపు ఖరారైందని చెబుతున్నారు.   తన సొంత హిమాచల్‌ప్రదేశ్‌లో పార్టీ ఓటమి పాలయినందున, నద్దాను అధ్యక్షుడిగా తొలగిస్తారన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. అయితే ఇప్పుడు అధ్యక్షుడిని మారిస్తే.. కొత్త సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నందున, నడ్డానే కొనసాగించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  ఆ కారణంగానే పార్టీ సభ్యత్వ కార్యక్రమాలు ఈ ఏడాది చేపట్టలేదని అంటున్నాయి.

నడ్డా హయాంలో పలు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించినప్పటికీ,  ఆయన సొంత రాష్ట్రంలో మాత్రం, పార్టీని విజయపథంలో నడిపించడంలో విఫలమయ్యారు. అలాగే సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ లో పార్టీలో వర్గ విభేదాలను పరిష్కరించడంలో కూడా విఫలమైన నడ్డాను పార్టీ అధ్యక్షుడిగా కొనసాగించే అవకాశాలు లేవని గత కొంత కాలంగా విస్తృతంగా ప్రచారం జరిగింది.   ఒక్క నడ్డానే  కాకుండా  ఏపీ, బిహార్‌, రాజస్థాన్‌, కేరళ, తెలంగాణ రాష్ట్రాలలో కూడా  పార్టీ అధ్యక్షులను మార్చే అవకాశం ఉందని జరిగిన ప్రచారం కూడా కూడా జరిగింది.  ఏపీ, బిహార్‌, రాజస్థాన్‌కి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి.  కేరళ అధ్యక్షుడిపై నిధుల దుర్వినియోగం చేశారన్న ఆరోపణలతో ఆయన మార్పూ ఖాయమని కూడా ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఈ మార్పులేవీ జరగకపోవచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి.  

తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌ను మార్చాలన్న డిమాండ్‌, సీనియర్ల నుంచి చాలాకాలం నుంచి వినిపిస్తోంది. ఆ క్రమంలో ఆయ స్థానంలో మాజీ మంత్రి చేరికల కమిటీ ఇన్చార్జి ఈటల రాజేందర్‌ను నియమించి, సంజయ్‌ను కేంద్రమంత్రివర్గంలోకి తీసుకుంటారన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. కానీ  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌.. హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా, బండి సంజయ్‌ ఆధ్వర్యంలోనే ఎన్నికలకు వెళతామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను కానీ,   అధ్యక్షులను  కానీ మార్చే అవకాశాలు లేవని, పార్టీ వర్గాలు చెబుతున్నాయి . 

By
en-us Political News

  
విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాల ఐక్యత.. ఏపీకి సాయం.!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఒక్కోసారి చిన్న ప్రయత్నం కూడా ఊహించని విధంగా జీవితాన్ని మార్చేస్తుందనడానికి నిదర్శనంగా నిలిచింది ఒక ఉదంతం.
ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాను ప్రభావంతో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు నష్టం వాటిల్లింది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ సిబ్బంది సేవలందిస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
కేరళలోని కొచ్చిలో సంచలనం సృష్టించిన మెర్సిడెస్ బెంజ్ కారు ప్రమాదం కేసు పోలీసు శాఖలో కలకలం రేపుతోంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
మహా న‌గ‌రం హైద‌రాబాద్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ తాగు నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4-0తో ఎన్డీఏ క్లీన్ స్వీప్.!
ప్రభుత్వ కార్యాలయాల గోడలపై ఎక్కడ చూసినా ఒకే నినాదం కనిపిస్తుంది.. లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరం
జగన్‌ తాను మళ్లీ  అధికారంలోకి వస్తానంటూ జగన్ 2.o అంటూ చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ మేం 10x చూపిస్తామంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ జగన్ చేసిన హెచ్చరికలకు పవన్ కల్యాణ్  దీటుగా ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ పొలిటికల్ సర్కిల్స్ లోనూ, సోషల్ మీడియాలోనూ కూడా పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.  
రాష్ట్రంలో అర్నబ్ తుపాను ప్రభావంతో పరిస్థితులు తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.