పార్టీ పెట్టే ధైర్యం జూనియర్ కు ఉందా?

Publish Date:Jul 15, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి నందమూరి వారసుడు, స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయరంగ ప్రవేశంపై జోరుగా చర్చ సాగుతోంది. ఈ నెల 18న ఎన్టీఆర్ తన అభిమానులతో ఒక భారీ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తుండటమే ఇందుకు ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో ఆయన జూలై 18న నూతన రాజకీయ పార్టీని ప్రకటిస్తారా, లేక కేవలం సామాజిక సేవా సంస్థకే పరిమితం అవుతారా అనే అంశంపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ఈ సంచలన పరిణామాలపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు భరద్వాజ్  తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.  కొందరు రాజకీయ నేతలు, న్యాయ నిపుణులు ఎన్టీఆర్ ఖచ్చితంగా పార్టీ పెడతారని, ఇందుకు సంబంధించిన ఆహ్వానాలు కూడా అందాయని బలంగా చెప్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయి సమీకరణాలు మాత్రం అందుకు  భిన్నంగా ఉన్నాయని భరధ్వాజ వెల్లడించారు. 

గతంలో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు (సీనియర్ ఎన్టీఆర్) తెలుగుదేశం పార్టీని స్థాపించడానికి ముందు.. తాను సినిమాలకు స్వస్తి పలుకుతున్నానని, కేవలం సమాజ సేవ కోసమే ఒక సంస్థ  పెడుతున్నానని ప్రకటించారు.  తర్వాతే ఆయన దానిని  తెలుగుదేశం' రాజకీయ పార్టీగా మార్చారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ విషయంలోనూ ఇలాంటి వ్యూహమే నడుస్తోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమిళ నటుడు విజయ్, గతంలో రజనీకాంత్ వంటి వారు కూడా అభిమాన సంఘాల బలాన్ని సమీకరించిన తీరును ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.  

అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ వెంటనే రాజకీయ పార్టీని స్థాపించే సాహసం చేయకపోవచ్చనన్న భరద్వాజ ఇందుకు   ఆయనకున్న భారీ సినీ కమిట్ మెంట్లు కారణమన్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో  డ్రాగన్ ,  త్రివిక్రమ్ ప్రాజెక్ట్,  దేవర 2 వంటి భారీ చిత్రాలు ఉన్నాయి. ఇవి పూర్తి కావడానికి కనీసం ఐదారేళ్ల సమయం పడుతుంది.  ఈ దశలో సినిమాలను వదిలి పూర్తి సమయం రాజకీయాలకు కేటాయించడం  జూనియర్ ఎన్టీఆర్ కు సాధ్యమయ్యే పని కాకపోవచ్చని భరద్వాజ అన్నారు.   

మరోవైపు, పాన్ ఇండియా మార్కెట్లో తన పట్టును మరింత బలోపేతం చేసుకోవడానికి, సోషల్ మీడియా వేదికగా తన సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి అభిమానుల నెట్వర్క్ ను ఒక నిర్మాణాత్మకమైన కమిటీగా మార్చేందుకే ఈ సమావేశం ఉపయోగపడవచ్చనీ,   హీరో అల్లు అర్జున్ సైతం జాతీయ స్థాయిలో తన ఆర్మీ కమిటీలను వేసిన విషయాన్ని భరద్వాజ గుర్తు చేశారు. 

ఏది ఏమైనప్పటికీ, ఏపీలో ప్రాంతీయ పార్టీల మనుగడపై జాతీయ పార్టీల ఒత్తిడి ఎక్కువగా ఉన్న తరుణంలో.. ఎన్టీఆర్ అడుగులు ఎటు పడతాయనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఆయన సేవా సంస్థను స్థాపించినా, భవిష్యత్తులో అది రాజకీయ పార్టీగా రూపాంతరం చెందే అవకాశాలను కొట్టిపారేయలేము. ఈ సర్వత్రా వ్యక్తమవుతున్న సస్పెన్స్కు తెరపడాలంటే జూలై 18న జరగబోయే అభిమానుల సమావేశం వరకు వేచి చూడాల్సిందే.

 

 Jr NTR July 18 Meeting, NTR Legacy, Telugu Politics News, Jr NTR New Party Launch

By
en-us Political News

  
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
బహదూర్‌పురా నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్‌ను రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) నియమించింది.
ఇండియా టుడే-సి ఓటర్ సర్వే అంచనాల ప్రకారం.. మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి  20 పార్లమెంట్ స్థానాలను దక్కించుకుంటుంది.
 దువ్వాడ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కి పార్టీ ప్రతిష్ఠ మసకబారే పరిస్థితి రావడంతో వైసీపీ అధినేత జగన్ తప్పని సరిపరిస్థితుల్లో  దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేశారు.   అయితే పేరుకే సస్పెన్షన్ తప్ప ఆయన ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీగానే చెలామణి అవుతున్నారు.
తెలుగుదేశం కూటమి సునాయాసంగా 20 స్థానాలను కైవసం చేసుకుంటుంది.   2024 ఎన్నికల ఫలితాలు పునరావృతమౌతాయిని ఇండియా టుడే సర్వే పేర్కొంది.
సొంత పార్టీ శాసనమండలి సభ్యుడిపై  మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తన మరియు వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తడంతో, ఎమ్మెల్సీ రహమత్ బేగ్‌పై వేటు వేశారు.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్  రాజకీయ సన్యాసం స్వీకరించబోతున్నారా? అంటే ఔనన్న సమాధానమే వస్తున్నది.   ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడే అనిల్ కుమార్ యాదవ్, తాజాగా చేసిన వ్యాఖ్యలను బట్టి రాజకీయవర్గాలలో ఆయన పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారా అన్న చర్చ జోరందుకుంది.  
రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొండా సురేఖకు ఉద్వాసన తప్పదనీ, ఆమె స్థానంలో  కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, సనీనటి విజయశాంతిని కేబినెట్ లోకి తీసుకునే అవ కాశాలు మెండుగా ఉన్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది.
ఖర్గేతో భట్టి భేటీ.. హస్తం పార్టీలో తీవ్ర ఉత్కంఠ..!
నూకరాజు కుటుంబం ఆత్మహత్య వెనుక లవ్ జిహాదీ, మత మార్పిడికి ఒత్తిడి చేసిన సాధిక్ ఖాన్ అనే వ్యక్తికి కూడా వైసీపీతో అనుబంధం సంబంధం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్  అవుతున్నాయి. 
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయంలో అధికార పార్టీ నేతల మధ్య చోటుచేసుకుంటున్న పరిణామాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.