Publish Date:Jul 25, 2022
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎలాగైనా రాష్ట్రంలో రెండో సారి అధికార పగ్గాలు చేపట్టాలన్న పట్టుదలతో ఉన్నారు. ఆయన ప్రతి మాటా, ప్రతి కదలికా, ప్రతి చర్యా, ప్రతి ప్రసంగం ఆ విషయాన్నే చెబుతుంది.
అయితే వాస్తవ పరిస్థితులు అందుకు అనుగుణంగా ఉన్నాయా అంటే మాత్రం కనీసం పార్టీ శ్రేణుల నుంచి కూడా ఔననే సమాధానం వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. జగన్ పాలనలో ఏ వర్గమూ సంతోషంగా లేదు. అందులో వైసీపీ వాళ్లు మినహాయింపు ఎంత మాత్రం కాదు. నియోజకవర్గంలో తిష్ట వేసిన సమస్యలను సీఎం దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేద్దామని ప్రయత్నించే ఎమ్మెల్యేలకు ఆయన దర్శనమే దొరకదు. ఈ మూడేళ్ల కాలంలో ఒక్కసారంటే ఒక్క సారి కూడా సీఎంను కలుసుకోవడానికి కనీస అవకాశం దొరకని ఎమ్మెల్యేల సంఖ్య వందకు పైగానే ఉంటుందని వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి. జగన్ చెబుతున్నట్లు వచ్చే నెల నుంచి నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించడం జరిగే పని కాదని ఆ పార్టీ వారే పెదవి విరుస్తున్నారు.
నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తే ముందుగా చర్చకు వచ్చేది ఆ నియోజకవర్గంలోని సమస్యలేనని అంటున్నారు. అయితే ఆ సమస్యలను అడ్రెస్ చేసే తీరిక కానీ, ఓపిక కానీ జగన్ కు లేవనడానికి గడప గడపకూలో ఎదురౌతున్న సమస్యలను జగన్ కు తెలియజెప్పడానికి యత్నించిన ఎమ్మెల్యేలకు ఆయన విసుగు, చిరాకు ఎదురైన సంగతిని పార్టీ శ్రేణులు గుర్తు చేస్తున్నరు. రోజుకు ఒక నియోజకవర్గాన్ని ఎంచుకుని ఆ నియోజకవర్గానికి చెందిన ఓ 50మంది ముఖ్యులతో సమావేశమైనా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలనూ కవర్ చేయాలంటే కనీసం ఆరు నెలలు పడుతుందని చెబుతున్నారు. ఒక వైపు గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం, మరో వైపు నియోజకవర్గాల వారీగా సమావేశాలు అంటే ఎమ్మెల్యేలు రెంటినీ అవాయిడ్ చేసే అవకావం ఉందని పార్టీ శ్రేణులే అంటున్నాయి.
నియోజకవర్గాల వారీ సమావేశాలలో అనివార్యంగా ప్రజా సమస్యలే ముందుగా చర్చకు వస్తాయి. అవి చర్చకు రాగానే వాటి పరిష్కారాన్ని సీఎం సూచించాలి. అలా సూచించడానికైనా ముందుగా నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి నిధులు విడుదల చేయాలి. ఏ విధంగా చూసినా ఇప్పుడు నియోజకవర్గాలలో సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించే పరిస్థితే లేదు. వీటన్నిటికీ మించి తమ ప్రభుత్వంపై నమ్మకంతో పార్టీ నేతలకు చేసిన పనులకు ఇన్నేళ్లుగా బిల్లులు రాలేదు. ఆ బిల్లులు చెల్లించకుండా జగన్ మాత్రం ఏ ముఖం పెట్టుకుని వారితో సమావేశం కాగలరు అని పార్టీ వర్గాలే ప్రశ్నిస్తున్నాయి.
చివరాఖరికి ఇటీవలి వరదల సమయంలో ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తీసుకు వచ్చిన పడవలకు డీజిల్ డబ్బులు కూడా ఇవ్వలేని ప్రభుత్వం చేసిన పనులకు బిల్లులు వడుదల చేస్తుందని ఆశించడం దురాశే అవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్న నేపథ్యంలో జగన్ చెప్పినట్లుగా వచ్చే నెలనుంచి నియోజకవర్గాల వారీ సమావేశాలు జరిగే అవకాశాలు దాదాపు మృగ్యమనే అంటున్నాయి పార్టీ శ్రేణులు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/will-jagan-conduct-constituency-wise-party-meetings-39-140508.html
Publish Date:Oct 11, 2026
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
Publish Date:Oct 11, 2026
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది. కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ