తమిళనాడు సీఎం విజయ్ పై ఎన్నికల కేసు: ఈ నెల 14న తీర్పు.!

Publish Date:Oct 8, 2026

Advertisement

తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీ్ు అధినేత   విజయ్ ఎన్నికకు సంబంధించిన వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. చెన్నైలోని మద్రాస్ హైకోర్టు ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై  తుది తీర్పును ఈ నెల  14కు వాయిదా వేసింది. పెరంబూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయ్ గెలుపును సవాలు చేస్తూ  దినేశ్  అనే వ్యక్తి దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌ను కొట్టివేయాలని కోరుతూ విజయ్ దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలు పూర్తయ్యాయి.

తమిళనాడు  అసెంబ్లీ ఎన్నికల్లో పెరంబూర్ నియోజకవర్గం నుంచి విజయ్  తన సమీప ప్రత్యర్థి డీఎంకే అభ్యర్థి ఆర్.డి. శేఖర్‌పై 53 వేల 715 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. అయితే విజయ్ ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తులకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించలేదని ఆరోపిస్తూ  దినేశ్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఆరోపణల ఆధారంగా ఆయన ఎన్నికను రద్దు చేయాలని పిటిషన్‌లో  కోరారు. 

పిటిషనర్ తరఫున విజయ్‌కు సంబంధించిన కొన్ని ఆస్తుల వివరాలు ఎన్నికల అఫిడవిట్‌లో పూర్తిగా వెల్లడించలేదని వాదించారు. ముఖ్యంగా పన్రుటి ప్రాంతంలో కొనుగోలు చేసినట్లు పేర్కొన్న వ్యవసాయ భూమి విలువ సుమారు  30 కోట్ల రూపాయలు ఉంటుందనీ,   దాని వివరాల వెల్లడిపై అభ్యంతరాలు ఉన్నాయని తెలిపారు. అలాగే కొడైకెనాల్‌లోని విల్పట్టి గ్రామంలో ఉన్నట్లు పేర్కొన్న 50 సెంట్ల భూమి ప్రభుత్వ భూమి అయి ఉండవచ్చని రెవెన్యూ రికార్డులను ప్రస్తావించినట్లు నివేదికలు చెబుతున్నాయి.

దీనిపై విజయ్ తరఫు న్యాయవాదులు  ఎన్నికల అఫిడవిట్‌లో అవసరమైన సమాచారాన్ని వెల్లడించామని, చిన్నపాటి లోపాలు లేదా వివరాలపై వివాదాలను మాత్రమే ఆధారంగా చేసుకుని ఎన్నికను రద్దు చేయలేమని వాదించినట్లు సమాచారం. ఆస్తుల వివరాలపై వచ్చిన ఆరోపణలు ఎన్నికల ఫలితాన్ని ఎలా ప్రభావితం చేశాయో చూపాల్సిన అవసరం ఉందని కూడా   పేర్కొన్నారు.

 ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం పిటిషన్‌పై తుది తీర్పు  అక్టోబర్ 14న ప్రకటించనున్నట్లు కోర్టు తెలిపింది. అప్పటిలోగా సంబంధిత పక్షాలు తమ రాతపూర్వక వాదనలు సమర్పించాలని సూచించింది. ప్రస్తుతం కోర్టు ముందున్న ప్రశ్న విజయ్ ఎన్నికను వెంటనే రద్దు చేయాలా అన్నది మాత్రమే కాదు; ఆయన ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించాలా,  లేదా అన్న అంశంపైనా కోర్టు తీర్పు వెలువరించనుంది.   


[Verdict on Tamilnadu CM Vijay Election Case,    Madras High Court, Perambur Constituency, Election Affidavit, Tamil Nadu Politics, October 14 Verdict, Telugu One]

By
en-us Political News

  
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.