నువ్వొస్తానంటే... మేం రానిస్తామా?

Publish Date:Oct 8, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ జనం ఏ మాత్రం అంగీకరించని, ఆమోదించని విషయం ఏదైనా ఉంటుందంటే అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన మాత్రమే. సీమాంధ్రులకు ఏ మాత్రం అంగీకార యోగ్యం కాని, ఆమోదయోగ్యం కాని విభజనను బలవంతంగా నెత్తిమీద రుద్దారు.

ఆ ఆగ్రహం ప్రతి సీమాంధ్రుడిలోనూ ఉంది. అందుకే విభజనకు అంగీకరించి, ఆమోదించి, విభజనను సాకారం చేసిన కాంగ్రెస్ కు ఏపీలో ఉనికి లేకుండా చేశారు. కనీసం విభజన సమస్యలను పరిష్కరించి, విభజన సందర్బంగా పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందన్న ఆశలను వమ్ము చేసిన బీజేపీకి 2019 ఎన్నికలలో అదే గుణ పాఠం చెప్పారు.

అసెంబ్లీలో కనీసం ప్రాతినిథ్యం లేకుండా చేశారు. ఇక 2019 ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన జగన్ విభజన గాయాల గురించి కనీసం పట్టించుకోలేదు సరికదా.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ తాన అంటే తందానా అంటూ తన పబ్బం గడుపుకోవడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారు. ఈ తరుణంలో జాతీయ పార్టీ అంటూ కేసీఆర్ బీఆర్ఎస్ పేరుతో తగుదునమ్మా అంటూ ఏపీలో ప్రవేశిస్తానంటే అంగీకరిస్తారా? దశాబ్దాల పాటు తిరుగులేని అధికారాన్ని ఇచ్చి ఆదరించిన కాంగ్రెస్ నే విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సోదిలోకి లేకుండా బుద్ధి చెప్పారు. గత రెండు ఎన్నికలలోనే కాదు సమీప భవిష్యత్ లో కాంగ్రెస్ ఏపీలో ప్రభావమంతమైన రాజకీయ పార్టీగా ఎదుగుతుందన్న నమ్మకం పరిశీలకులలోనే కాదు.. కాంగ్రెస్ పార్టీలోనూ లేదు.

ఇక బీజేపీకి.. 2014 ఎన్నికలలో తెలుగుదేశంతో పొత్తు ఉండటమొక్కటే కాదు.. కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏపీకి జరిగిన నష్టాలను ఏదో మేరకు పూడుస్తుందన్న విశ్వాసంతోనే ఆదరించారనడంలో సందేహం లేదు. అయితే ఏపీ జీవనాడి పోలవరం సహా అన్ని ఆశలనూ బీజేపీ వమ్ము చేసింది. దీంతో 2019 ఎన్నికలలో బీజేపీకి రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం లేకుండా చేశారు. ఇప్పుడు విభజన కోసమే ఉద్యమించి, విభజన వద్దంటున్న సీమాంధ్రులపై నిప్పులు చెరిగి, విభజన సాకారం అయిన తరువాత ఎనిమిదేళ్లుగా తెలంగాణ ముఖ్యమంత్రిగా విభజిత ఆంధ్రప్రదేశ్ పై నిప్పులు చెరుగుతూ ఏపీ ప్రయోజనాలకు అడుగడుగునా గండి కొట్టిన కేసీఆర్ జాతీయ పార్టీ అంటూ ఏపీలో కాలుపెడతాననడం పాత గాయాలను కెలకడంగానే ఆంధ్రులు భావిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

అరకొరగా అక్కడక్కడా బీఆర్ఎస్ పోస్టర్లు వెలిసినంత మాత్రాన ఏపీలో బీఆర్ఎస్ కు జనం బ్రహ్మరథం పడుతున్నారని భావించడానికి వీల్లేదని అంటున్నారు.  ఏపీలో బీఆర్ఎస్ విస్తరణ బాధ్యతలను ఓ ముగ్గురు నేతలకు అప్పగించేసి ఇక రాష్ట్రంలో పాగా వేసినట్లేనని కేసీఆర్ భావించడం వాస్తవాన్ని విస్మరించి ఊహలలో విహరించడంగానే పరిగణించాల్సి ఉంటుందంటున్నారు. వాస్తవానికి ఇప్పటికీ విభజన పట్ల, ఆ విభజన జరిగిన తీరు పట్లా ఆంధ్రులలో అలవిమాలిన కోపం అలాగే ఉంది.    అడ్డగోలు విభజన చేసిందనే  కాంగ్రెస్ కి ఏపీలో స్థానం లేకుండా చేశారు.  

విభజన హామీలునెరవేర్చడం అటుంచి, న్యాయంగా రావాల్సిన వాటికి కూడా మోకాలడ్డిన బీజేపీకి  2019 ఎన్నికల్లో గట్టి బుద్ధి చెప్పారు. ఏపీలో 2019 ఎన్నికలలో బీజేపీకి వచ్చిన  ఓట్ల కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చాయంటే బీజేపీ పట్ల ఆంధ్రుల తిరస్కారం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఇక ఇప్పుడు విభజనకు కర్త, కర్మ, క్రియ తానేనని చాటుకునే కేసీఆర్ జాతీయ పార్టీ అంటూ ఏపీలోకి అడుగుపెడితే ఆయన భాషలోనే చెప్పాలంటే కిర్రికాల్చి వాత పెట్టడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు. విభజన చేసిన పాపానికి మద్దతు ఇచ్చిన నేరానికి కాంగ్రెస్ బీజేపీలకు పాతరేసిన ఏపీ జనం కేసీఆర్ ను ఎంత మాత్రం ఉపేక్షించే అవకాశం లేదనీ, ఏపీలో బీఆర్ఎస్ ముసుగులో రావాలని ప్రయత్నిస్తున్న కేసీఆర్ ను తగిన గుణపాఠం చెబుతారనడంలో సందేహం లేదనీ అంటున్నారు. 

By
en-us Political News

  
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
పెట్రోల్‌లో ఇథనాల్‌ కలపడాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తాజా విధానాలు ఇప్పుడు సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌‌ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.!
వెబ్‌సిరీస్‌ ల్లో ఎక్కువగా బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలే చూసేవాడు.. ఆ తర్వాత తనకున్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకోని సికింద్రాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌ను ఎంచుకున్నాడు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
హైదరాబాద్ నగరవాసుల ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
కొత్త కారు కొనుక్కోవాలని ఎన్నో రోజులుగా కలలు కంటారు.. ఆ కల నెరవేరిన రోజు ఆ ఆనందమే వేరు! ఎంతో ఇష్టపడి కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి..
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వాతావరణం నెలకొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.