హైదరాబాద్‌లో విషాదం..యువ వైద్యురాలు అనుమానాస్పద మృతి.!

Publish Date:Oct 2, 2026

Advertisement

హైదరాబాద్‌‌ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్‌పేట్ ప్రాంతంలో ఓ యువ వైద్యురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సంగారెడ్డి జిల్లాకు చెందిన 27 ఏళ్ల యువతి మహబూబ్‌నగర్‌లో మెడిసిన్ పూర్తి చేసి, ఇటీవల వరంగల్‌లో పీడియాట్రిక్స్ విభాగంలో పీజీ పట్టా అందుకున్నారు. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో ఉన్న ఆమె ఇలా అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోవడం కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టింది.కొద్ది రోజుల క్రితం ఆమె తన స్నేహితుడైన యువకుడితో కలిసి వరంగల్ నుంచి నగరానికి చేరుకున్నారు. 

అనంతరం హఫీజ్‌పేట్‌లోని ఆదిత్య నగర్ ప్రాంతంలో ఉన్న ఒక ప్రైవేట్ సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో రూమ్ తీసుకుని బస చేసినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అయితే, గత కొన్ని గంటలుగా కూతురి ఫోన్ నంబర్‌కు ఏమాత్రం స్పందన రాకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందారు. ఆ సమయంలో అనుమానం వచ్చి ఆమె మొబైల్ ఫోన్ లొకేషన్‌ను ట్రేస్ చేయగా, అది మియాపూర్ పరిధిలోని ప్రాంతంలో చూపించింది.దీంతో వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీసులను ఆశ్రయించారు. తమ కుమార్తె ఆచూకీ తెలియడం లేదని, ఫోన్ కూడా పనిచేయడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు.తల్లిదండ్రుల ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. 


వారు తెలిపిన సర్వీస్ అపార్ట్‌మెంట్‌కు చేరుకుని తనిఖీలు చేపట్టగా, అక్కడ యువ వైద్యురాలు అనుమానాస్పద రీతిలో మృతి చెంది ఉండటాన్ని గుర్తించి నిర్ఘాంతపోయారు.ఈ ఘటనపై మియాపూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జయరాం మీడియాతో మాట్లాడుతూ, మృతురాలితో పాటు ఆ గదిలో ఉన్న యువకుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. ఈ మృతికి గల అసలు కారణాలు ఏమిటనే కోణంలో లోతైన దర్యాప్తు ప్రారంభించినట్లు స్పష్టం చేశారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్ట్ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్ట్ నివేదిక వస్తేనే ఆమె మృతికి గల అసలు కారణాలు స్పష్టమవుతాయని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న యువకుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు అధికారులు వెల్లడించారు.

 

 

[ Hyderabad young doctor suspicious death, Miyapur service apartment news, Hafeezpet doctor murder case,Telangana crime news Telugu, Miyapur police station investigation,  Hyderabad police, CP Sajjanar, DGP C.V. Anand, Telugu One, Telugu News ]
 

By
en-us Political News

  
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.!
వెబ్‌సిరీస్‌ ల్లో ఎక్కువగా బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలే చూసేవాడు.. ఆ తర్వాత తనకున్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకోని సికింద్రాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌ను ఎంచుకున్నాడు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
హైదరాబాద్ నగరవాసుల ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
కొత్త కారు కొనుక్కోవాలని ఎన్నో రోజులుగా కలలు కంటారు.. ఆ కల నెరవేరిన రోజు ఆ ఆనందమే వేరు! ఎంతో ఇష్టపడి కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి..
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వాతావరణం నెలకొంది.
మహారాష్ట్రలోని ప్రఖ్యాత హిందూ హృదయసమ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌పై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి కెప్టెన్‌‌పై జరిగిన కత్తిదాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.
హైదరాబాద్‌ నగరంలో శాంతిభద్రతల నిర్వహణను మరింత సమర్థంగా చేపట్టేందుకు పోలీస్‌ శాఖలో భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.