ఏపీ సర్కార్ మత వివక్ష నిజమేనా? టీటీడీని అభాసుపాలు చేస్తున్నది అందుకేనా? 

Publish Date:Aug 31, 2021

Advertisement

ఒక్క తెలుగు వారు మాత్రమే కాదు, ఒక్క హిందువులు మాత్రమే కాదు.. ఒక్క భారతీయులు మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కోట్ల కోట్ల మంది భక్తులు తిరుమల దేవుడు, వెంకటేశ్వర స్వామిని కుల వేలుపుగా కొలుస్తారు. పరమ పవిత్రంగా ఆరాధిస్తారు. ఎక్కడెక్కడి నుంచో భక్తులు గోవిందనామ స్మరణతో వెంకన్నను చేరుకుంటారు. దర్శించుకుంటారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా కొలుస్తారు. వడ్డి కాసుల వాడికి, కానుకలు సమర్పించుకుంటారు. తిరుమల కొండలను ఆ దేవదేవుని ప్రతిరూపంగా, పవిత్రంగా భావిస్తారు. భక్తీ భావంతో వెనుతిరుగుతారు.   

కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, టీటీడీ పాలక మండలి మాత్రం, వడ్డీ కాసుల వాడిని , వట్టి కాసుల వాడిగానే చూస్తున్నాయని, అనుకోవలసి వస్తోంది. ఇంకా చెప్పాలంటే, ముఖ్యమంత్రి జగన్మోహాన్ రెడ్డి ప్రభుత్వం తిరుమల కొండను బంగారు బాతుగా, వెంకన్న దేవుని, భక్తుల భక్తి బావాన్ని, ఒక వ్యాపర వస్తువుగా చూస్తోందనే సందేహాలకు తవిచ్చేలా, ఇటు ప్రభుత్వం, అటు టీటీడీ నిర్ణయాలు, ప్రవర్తన ఉన్నాయి, అంటే కాదనే పరిస్థితి లేదు. ఓ వంక వెంకన్నా దేవుని ఆస్తులను అమ్మి సోమ్ముచేసుకునే కుట్రలు సాగిస్తూనే మరో వంక పవిత్ర పుణ్య క్షేత్రాన్ని వ్యాపార కేంద్రంగా మార్చి, వివాదాలకు నిలయంగా మార్చింది. 

ఇప్పుడే కాదు, జగన్మోహాన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచి టీటీడీ వివాదాలకు నిలయంగామారి పోయింది. పరోక్షంగానే కావచ్చును అన్యమత ప్రచారాన్నిప్రోత్సహిస్తోందనే ఆరోపణలూ ఉన్నాయి. టీటీడీలో కొలువు తీరిన అన్యమతస్తుల ఏరివేతకు ప్రయత్నించడమే పాపమన్నట్లుగా అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుభ్రమణ్యంను జగన్ రెడ్డి ప్రభుత్వం రాత్రికి రాత్రి బదిలీ చేసింది. నిజానికి, ఈ రెండున్నర సంవత్సరాలలో జగన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో హిదువుల మనోభావాలు దెబ్బతినే సంఘటలు, టీటీడీలోనే కాదు రాష్ట్రం అంతటా సాగుతూనే ఉన్నాయి. విగ్రహాల ద్వంస రచన మొదలు, అన్యమత ప్రచారానికి, అండదండలు అందించడం వరకు జగన్ రెడ్డి ప్రభుత్వం  మత వివక్ష, విద్వేషాలకు తావిచ్చేల పరిపాలన సాగిస్తోందనే విధంగానే ప్రభుత్వ పాలనా సాగుతోంది.  

టీటీడీవిషయంలోనూ ముఖ్యమంత్రి సొంత బాబాయి వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్ నియమించిండం మొదలు, ప్రతి విషయంలోనూ భక్తుల మనోభావాలను దెబ్బతీసీ విధంగానే, వ్యవహారం నడుస్తోందనే విమర్శలున్నాయి. ఒక దశలో టీటీడీఆస్తుల విక్రయానికి జగన్ రెడ్డి ప్రభుత్వం సిద్దమైంది. అయితే, భక్తుల నుంచి తీవ్ర ప్రతిఘటన రావడంతో వెన కడుగు వేసింది.అయితే, అప్పుడు ప్రభుత్వం భక్తులు తిరగబడతారనే భయంతో వెనకడుగు వేసినా, ప్రభుత్వం దృక్పధంలో మాత్రం మార్పులేదు. అందుకే, ఇప్పడు మళ్ళీ, సంప్రదాయ భోజనం పేరిట కొండమీద మరో దుకాణాన్ని తెరిచింది. రసాయన ఎరువులు వాడకుండా, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలతో 14 రకాల వంటలు భక్తులకు విక్రయించే దుకాణం దుకాణం తెరిచారు.అయితే, కొండ మీద అన్నం అమ్మడమా, అది కూడా టీటీడీ.. అంటూ భక్తుల నుంచి విమర్శలు రావడంతో మళ్ళీ మరోమారు వెనకడుగు అయితే వేసింది, కానీ, వెనకటి గుణం మాత్రం మారలేదు. సంప్రదాయ భోజన విధానం నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ  సుబ్బా రెడ్డి ప్రకటించారు. పాలకమండలి పదవీ కాలం ముగిసిన సమయంలో అధికారులు ఆ నిర్ణయం తీసుకున్నారని, అయితే దానిపై తాను చర్చించి నిర్ణయం ఉపసంహరించుకున్నట్లు ఆయన తెలిపారు. తిరుమల కొండపై భక్తులకు స్వామివారి ప్రసాదంగానే భోజనం అందించాలని, అన్నప్రసాదానికి డబ్బులు తీసుకోకూడదని అధికారులకు సూచించామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. వైవీ తెలివిగా నేరాన్ని, అధికారులపైకి నెట్టేశారు, కానీ, యథారాజా తథా ప్రజా అన్నట్లుగా, జగన్ రెడ్డి అడుగుజదాల్లోనే అధికారులు నడుస్తున్నారు అనేది వైవీ కూడా కాదనలేని నిజం. 

అందుకు ఉదాహరణ, సంప్రదాయ భోజనం వివాదం ముగియక ముందే, అదే టీటీడీ పలక మండలి, ఉభయ తెలుగ  రాష్ట్రాల్లోని 177 కళ్యాణ మండపాల నిర్వహణను హిందూ సంస్థలు, ఆలయాలు, మఠాలు, ట్రస్ట్ లు, హిందూ మతానికి చెందిన వ్యక్తులకు 5 సంవత్సరాల పాటు లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే, ఇందులో ఇంకేదో మతలబు ఉందని, దేవాలయాలలోనే ప్రభుత్వ పెద్దల సహకారంతో అన్యమతస్తులు అధికారం చెలాయిస్తున్నప్పుడు,కళ్యాణ మండపాల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇవ్వడం అంటే, దొడ్డిదారిన అన్యమతస్తులకు అవకాశం కలిపించడం కాదా, అన్న అనుమానాలు  విన వస్తున్నాయి. అయితే, చరిత్ర చెపుతునండి ఏమంటే, వెంకన్న జోలికి వచ్చిన వారెవ్వరూ బాగుపడింది లేదు, బావుకున్నదీ లేదు.

By
en-us Political News

  
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.