అమరావతి రీలాంచ్ సరే.. జగన్ నిర్వాకంపై మోడీ మౌనమేల?

Publish Date:May 3, 2025

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజథాని అమరావతి నిర్మాణానికి 2015లో శంకుస్థాపన జరిగింది. అప్పట్లో ఈ కార్యక్రమానికి ప్రధాని హోదాలో మోడీ హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని నభూతో అన్నట్లుగా నిర్వహించారు. సరే మళ్లీ ఇప్పుడు అంటే మే 3న అదే అమరావతికి ప్రధాని మోడీ మరో సారి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాన్ని అమరావతి నిర్మాణ పనుల పున: ప్రరంభ కార్యక్రమం అని చెబుతున్నారు. అప్పుడూ.. ఇప్పుడూ కూడా కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వమే ఉంది. ప్రధానిగా నరేంద్రమోడీ, ఏపీ సీఎంగా చంద్రబాబు రెండు సార్లూ కూడా అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామనే అన్నారు. అయితే ఈ మధ్యలో ఐదేళ్లలో ఏం జరిగింది? 2015లో అట్టహాసంగా ప్రారంభమైన అమరావతి నిర్మాణ కార్యక్రమం 2019 నుంచి 2024 వరకూ ఎందుకు నిలిచిపోయింది. నిర్వీర్యమైపోయింది అన్నది అందరికీ తెలిసిన చరిత్రే. 

అయితే అప్పటికీ ఇప్పటికీ ఒక తేడా ఉంది. నాడు మోడీ కేవలం అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసి మట్టీ, నీళ్లు ఇచ్చి వెళ్లిపోయారు. అమరావతి నిర్మాణం, పురుభివృద్ధి ఒక బాధ్యతగా భావించలేదు. అది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక కార్యక్రమంగానే భావించారు. ఎందుకంటే అప్పుడు కేంద్రంలో ఉన్నది ఎన్డీయే ప్రభుత్వమే అయినా, భాగస్వామ్య పక్షాల మద్దతు ఇసుమంతైనా అవసరం లేనంత బలం ఒంటరికగా బీజేపీకే ఉంది. అందుకే అప్పట్లో మోడీ మిత్రపక్షాల ఆకాంక్షలను, డిమాండ్లను పట్టించుకోలేదు. 

అయితే ఇప్పుడు 2025లో మోడీకి ఆ పరిస్థితి లేదు. కేంద్రంలో తన ప్రభుత్వం మనుగడ సాగించాలంటే చంద్రబాబు మద్దతు అవసరం. అందుకే ఇప్పుడు  మోడీ మరో సారి అమరావతి నిర్మాణ పనులను రీ లాంచ్ చేశారు. అవును మళ్లీ అమరావతి నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టారు. అయితే ఈ సారి గతంలోలా దీనిని ఒక లాంఛనంగా కాకుండా ఒక బాధ్యతగా  తీసుకున్నారు. అమరావతి అభివృద్ధిలో కేంద్రం బాధ్యతగానే కాకుండా భాగస్వామిగా కూడా ఉంటుందని చెప్పడానికే 57 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలూ చేశారు. అంతే కాదు అమరావతికి ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి గ్రాంట్లు అందేలా చూడటమే కాకుండా హుడ్కో నుంచి కేటాయింపులు కూడా వచ్చేలా సంపూర్ణ సహకారం అందించింది. దీంతో గతానికి భిన్నంగా ఈ సారి మోడీ చిత్తశుద్ధి కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. అందుకు ఆయన రాజకీయ అవసరం కూడా కారణం అనుకోండి అది వేరే సంగతి. 

ఇంత వరకూ బాగే ఉంది.. 2015లో తానే స్వయంగా శంకుస్థాపన చేసిన అమరావతి నిర్మాణం అర్ధంతరంగా ఐదేళ్ల పాటు నిలిచిపోవడానికీ, నిర్వీర్యమైపోవడానికీ కారణమైన జగన్ నిర్వాకం గురించి మోడీ శుక్రవారం (మే 2)న జరిగిన అమరావతి పనుల పున:ప్రారంభోత్సవ సభలో ఒక్కటంటే ఒక్క మాట అనలేదు. ఐదేళ్ల జగన్ అరాచక పాలన కారణంగా ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలుగా వెనుకబడిపోవడం తెలిసిందే. అయితే ఇంతటి అరాచక పాలన సాగించి, కేవలం రాష్ట్ర రాజధాని మాత్రమే కాదు.. ఒక శక్తి అని చెప్పిన ప్రధాని మోడీ.. ఆ శక్తిని నిర్వీర్యం చేయడానికి గత ఐదేళ్లలో విశ్వ ప్రయత్నం చేసిన జగన్ పాలనపై చిన్న పాటి విమర్శ కూడా చేయకపోవడం విమర్శలకు తావిస్తున్నది. 

మూడు రాజధానుల పేరుతో అమరావతి విధ్వంసానికి పూనుకున్న మాజీ ముఖ్యమంత్రి   జగన్  పాలనను కానీ, జగన్ సర్కార్ ప్రభుత్వ విధానాలపై కానీ చిన్నపాటి విమర్శ కూడా మోడీ చేయలేదు.  గత పదేళ్లుగా అమరావతి నిర్మాణాలకు అవసరమైన అన్ని సదుపాయాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది అని చెప్పుకున్న మోడీ.. మరి గత ఐదేళ్లుగా అమరావతిలో కనీసం ఒక్క ఇటుక కూడా పేర్చని జగన్ పాలన గురించి అసలు ప్రస్తావించనేలేదు.   ఇక్కడే ఇప్పటికీ మోడీ జగన్ ను షీల్డ్ చేస్తున్నారా? అన్న అనుమాలు వ్యక్తమౌతున్నాయని పరిశీలకులు అంటున్నారు. 

By
en-us Political News

  
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.