బతుకమ్మ వేడుకలకు కవిత డుమ్మా.. ప్రగతి భవన్ లోకి ఎంట్రీ లేదా? 

Publish Date:Oct 13, 2021

Advertisement

కల్వకుంట్ల కవితకు ప్రగతి భవన్ లోకి ఎంట్రీ లేదా? కేటీఆర్ తో ఆమెకు విభేదాలు మరింత తీవ్రమయ్యాయా?  ఈ చర్చ తెలంగాణలో కొన్ని రోజులుగా సాగుతోంది. అన్న కేటీఆర్ తో కలిసి ఎమ్మెల్సీ కవిత కనిపించిన సందర్భాలు కూడా ఇటీవల కాలంలో కనిపించలేదు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయనే ప్రచారం జరిగింది. రాఖి పౌర్ణమి రోజున జరిగిన పరిణామాలు ఈ అనుమానాలకు మరింత బలాన్నిచ్చాయి. అన్న కేటీఆర్ కు కవిత రాఖీ కట్టకపోవడం చర్చగా మారింది. ప్రతి ఏటా అన్నకు రాఖీ కట్టి సందడి చేసేది కవిత. సోషల్ మీడియాలో ఆ ఫోటోలు స్పెషల్ అట్రాక్షన్ గా ఉండేవి. కాని ఈసారి కవిత రాఖీ కట్టకపోవడంతో ఇద్దరి మధ్య గ్యాప్ భారీగా పెరిగిందనే చర్చ వచ్చింది. ఈ వార్తలను ఇద్దరు కూడా ఖండించకపోవడంతో నిజమేనని అందరూ భావించాల్సి వచ్చింది.

కొన్ని రోజులుగా కనిపించకుండా పోయిన కవిత.. గత రెండు వారాలుగా మళ్లీ యాక్టివ్ అయ్యారు. బతుకమ్మ వేడుకల ఏర్పాట్లలో బిజీగా గడిపారు. ఈసారి జాగృతి తరపున ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ తో హై రేంజ్లో బతుకమ్మ సాంగ్ రూపొందించారు కవిత. ఆ సాంగ్ ఆవిష్కరణను కూడా ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ వేడుకల్లోనూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. హైదరాబాద్ లో నిర్వహిస్తున్న పలు వేడుకలకు హాజరవుతున్నారు కవిత. మంగళవారం పీపుల్స్ ప్లాజా లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొని.. మంత్రి సత్యవతి రాథోడ్ తో కలిసి ఆడి పాడారు. 

బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటున్న కల్వకుంట్ల కవిత... బుధవారం ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్ లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో మాత్రం కనిపించలేదు. ప్రగతి భవన్ లో జరిగిన సద్దుల బతుకమ్మ సంబురాల్లో సీఎం కేసీఆర్ సతీమణి శోభమ్మ, మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమ  మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కాని కేసీఆర్ కూతురు కవిత మాత్రం హాజరుకాలేదు. గతంలో ప్రగతి భవన్ లో నిర్వహించిన వేడుకల్లో అంతా తానై వ్యవహరించేవారు కవిత. అలాంటిది ఈసారి ప్రగతి భవన్ కు రాకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 

ప్రగతి భవన్ లోకి ఎంట్రీ లేకపోవడం వల్లే బతుకమ్మ వేడుకలకు కవిత వెళ్లలేదని అంటున్నారు. గత కొన్ని నెలలుగా కవిత ముఖ్యమంత్రి నివాసానికి రావడం లేదంటున్నారు. కవిత ప్రగతి భవన్ కు ఎందుకు రావడం లేదన్నదానిపై పార్టీ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. తండ్రి కేసీఆర్ తో విభేదాలున్నాయా లేక అన్న కేటీఆర్ తో గ్యాప్ వచ్చిందా అన్నదానిపై రకరకాల చర్చలు జరిగాయి. ముఖ్యమంత్రి మార్పు విషయంలో కేసీఆర్ కుటుంబంలో గొడవలు జరిగాయని గతంలో ప్రచారం జరిగింది. కేటీఆర్ ను సీఎం చేయాలని కేసీఆర్ భావించగా.. కవిత తీవ్రంగా వ్యతిరేకించారనే చర్చ జరిగింది. అప్పటి నుంచి కేటీఆర్, కవిత మధ్య విభేదాలు వచ్చాయని.. క్రమంగా అది పెరుగుతూ వచ్చిందని చెబుతున్నారు.

కేటీఆర్ తో గ్యాప్ బాగా పెరగడం వల్లే ఆయనకు రాఖీ కట్టడానికి కవిత ఇష్టపడలేదని చెబుతున్నారు. అందుకే రాఖీ పౌర్ణమి రోజున హైదరాబాద్ లో ఉండకుండా విదేశాలకు వెళ్లారనే గుసగుసలు వినిపించాయి. తాజాగా ప్రగతి భవన్ లో జరిగిన బతుకమ్మ వేడుకలకు కవిత హాజరు కాకపోవడంతో బయట జరుగుతున్న ప్రచారమంతా నిజమేనని తెలుస్తోంది. కేటీఆర్ సతీమణితో కలిసి బతుకమ్మ ఆడటం ఇష్టం లేకే కవిత.. ప్రగతి భవన్ వెళ్లలేదని అంటున్నారు. మొత్తంగా ప్రగతి భవన్ బతుకమ్మ వేడుకలకు కవిత హాజరుకాకపోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చగా మారింది. 

By
en-us Political News

  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
ఇదే వేదికపై నుంచి   544.11 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రేవంత్ రెడ్డి,  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా   ప్రారంభించారు.
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.