వంశీకి జ్ఞానోదయం అయిందా? వంగవీటి కేంద్రంగా పావులు కదుపుతున్నారా? 

Publish Date:Dec 27, 2021

Advertisement

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ... తన మార్క్ రాజకీయానికి తెర తీశాడా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మళ్లీ సైకిల్‌పై సవారీకి ఆయన ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నాడా?.. అందుకోసమే తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన ప్రయత్నాలు ముమ్మరం చేసుకుంటున్నారా? అంటే.. అదీ కూడా అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

ఇటీవల టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన భార్య నారా భువనేశ్వరిపై వల్లభనేని వంశీ చేసిన హాట్‌ హాట్ కామెంట్స్.. అవి రాజకీయంగా ఎంత హీటు పుట్టించాయో... ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు అందరికీ తెలిసిందే. ఈ ఎపిసోడ్ అంతా తెలుగు రాష్ట్రాల్లో రచ్చ రచ్చ అయింది. ఆ తర్వాత చంద్రబాబు భార్య నారా భువేనేశ్వరికి వల్లభనేని వంశీ మీడియా సాక్షిగా సారీ చెప్పారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో అటు వల్లభనేని వంశీపైనా.. ఇటు అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపైన ప్రజల్లో ఓ విధమైన వ్యతిరేకత అయితే వచ్చిందని రాజకీయ విశ్లేషకులు స్పష్టంగా చెబుతున్నారు.

ఈ విషయం నిఘా వర్గాల ద్వారా సీఎం వైయస్ జగన్‌ మోహన్ రెడ్డికి నివేదిక చేరడం.. ఆ వెంటనే అధికార పార్టీ అగ్రనేతలు యుద్ధప్రాతికన వల్లభనేని వంశీపై చర్యలకు శ్రీకారం చుట్టడం... అదీకూడా వల్లభనేని వంశీని పొమ్మనకుండా పొగ పెట్టే విధంగా సాగనంపాలని ఫ్యాన్ పార్టీ అగ్రనేతలు నిర్ణయం తీసుకోవడం..  ఆ క్రమంలో వల్లభనేని వంశీ మా పార్టీ ఎమ్మెల్యే కాదు.. ఆయన టీడీపీ ఎమ్మెల్యే అంటూ సీఎం జగన్ సొంత జిల్లా ఎమ్మెల్యే బహిరంగ సభలో పక్కా క్లారిటీగా చెప్పడం.. అంతా పథకం ప్రకారమే జరిగిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

అయితే ఈ విషయం వల్లభనేని వంశీకి అప్పటికప్పుడు అంతగా బోధపడలేదని.. కానీ ఆ తర్వాత జగన్ పార్టీలో ఎదురైన స్వీయానుభవాలతో సదరు గన్నవరం ఎమ్మెల్యేకు తత్వం బోధపడిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆ క్రమంలో తన జీవితం అటు అధికార పార్టీకీ.. ఇటు ప్రతిపక్షానికి కాకుండా రెండిటికీ చెడ్డ రేవడిలా తయ్యారయ్యే పరిస్థితి ఉందని వల్లభనేని వంశీ భావించారని.. ఆ క్రమంలో ఏ పార్టీ తరఫున అని కాకుండా.. ప్రజల్లోకి నేరుగా వెళ్లితే.. కొద్ది రోజుల్లో పరిస్థితి చక్కదిద్దుకుంటుందని ఆయన భావిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

అందులోభాగంగానే స్వర్గీయ వంగవీటి మోహనరంగా వర్ధంతిని వేదికగా చేసుకుని.. ప్రజల్లోకి వెళ్లాలని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముందుగా పథక రచన చేసుకుని.. ఆ దిశగా తన రాజకీయా ప్రయాణాన్ని సాగించాలని.. ఆ క్రమంలోనే విజయవాడలో వంగవీటి మోహన రంగా విగ్రహానికి ఆయన కుమారుడు వంగవీటి రాధాతో కలిసి వల్లభనేని వంశీ పూలమాల వేయడం.. ఆ తర్వాత రాధాతో కలిసి.. కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలంలోని శ్రీకొండాలమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయడం జరిగిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 

ఈ విగ్రహావిష్కరణ సందర్భంగా వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన హత్యకు రెక్కి నిర్వహించారని.. ఆ విషయాలన్నీ త్వరలోనే తెలుస్తాయంటూ ఆయన ఈ సభ ద్వారా వెల్లడించారు. ఆ తర్వాత ఇదే సభపై నుంచి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడుతూ.. వంగవీటి రాధాను రక్షించుకోవాల్సిన బాధ్యత.. రంగా అభిమానులపై ఉందన్నారు.దీంతో వల్లభనేని వంశీ తన రాజకీయాన్ని చాలా పకడ్బంధీగా నడుపుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చంద్రబాబు ఫ్యామిలీపై వంశీ కామెంట్స్‌తో ఆయన సొంత నియోజకవర్గంలోని ఆయన సామాజిక వర్గంలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆ క్రమంలోనే వంగవీటి రాధాతో కలిసిన నడిస్తే.. తనపై ఉన్న వ్యతిరేకత ఇవాళ కాకుంటే రేపు జనాలు మరిచిపోయే ఛాన్స్ ఉందనే భావనలో వంశీ ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. 

ప్రస్తుతం ఆయన సొంత నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలకు కేంద్రమైందని... వాటిని పరిష్కరించ లేని పరిస్థితిలో వల్లభనేని వంశీ ఉన్నారనే టాక్.. గన్నవరంలో వైరల్ అవుతోంది. ఫ్యాన్ పార్టీలోకి జంప్ చేసి.. సీఎం జగన్ రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేస్తే.. తన రాజకీయ భవిష్యత్తు బంగారు మయం అవుతుందని వల్లభనేని వంశీ భావించారని.. కానీ ఇంతలా తన రాజకీయ భవిష్యత్తుకు గడ్డురోజులు దాపురిస్తాయని మాత్రం కలలో కూడా అనుకోలేదని వల్లభనేని వంశీనే స్వయంగా తన అంతరంగికుల వద్ద వాపోయినట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఫ్యాన్ పార్టీలోకి జంప్ అనే ఒకే ఒక్క తప్పటడుగుతో వల్లభనేని వంశీ రాజకీయ జీవితం గందరగోళమైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

ఆ క్రమంలోనే వల్లభనేని వంశీ.. మళ్లీ రాజకీయంగా ఎదగడానికి... వంగవీటి రాధాను పావుగా వాడుకున్నా.. పెద్దగా అశ్చర్య పోనక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాజకీయమనే వైకుంఠ పాళీలో వల్లభనేని వంశీకి గతంలో చంద్రబాబు, ఇప్పుడు వంగవీటి రాధా లాంటి వాళ్లు.. నిచ్చెలా ఉపయోగించుకుంటారని రాజకీయ విశ్లేషకులు తమదైన శైలిలో విశ్లేషిస్తున్నారు.

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.