వరిపై తుస్.. తెరపైకి కంటోన్మెంట్! కేటీఆర్ డైవర్ట్ గేమ్.. 

Publish Date:Dec 21, 2021

Advertisement

కేంద్ర ప్రభుత్వంపై కొన్ని రోజులుగా పోరాటం చేస్తోంది టీఆర్ఎస్. వరి కొనుగోళ్ల విషయంలో తెలంగాణపై వివక్ష చూపిస్తోందని ఆరోపిస్తూ ఆందోళనలు చేస్తోంది. సీఎం కేసీఆర్ స్వయంగా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేశారు. రెండు సార్లు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది టీఆర్ఎస్. అయితే వరి విషయంలో గులాబీ పార్టీ ఆరోపణలను లైట్ తీసుకుంది మోడీ సర్కార్. కేసీఆర్ ఆరోపణలను తిప్పికొట్టింది. సీఎం కేసీఆర్ అబద్దాలు చెబుతున్నారని, రైతులను మోసం చేస్తున్నారని కేంద్ర మంత్రి పియూష్ గోయెల్ ప్రకటించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సైతం వరి విషయంలో కేసీఆర్ తీరును ఎండగట్టాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. 

వరి కొనుగోళ్లపై రచ్చ సాగుతుండగానే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ మరో అంశాన్ని తెరపైకి తెచ్చారు. రోడ్ల మూసివేతపై కిషన్‌రెడ్డిని ఉద్దేశిస్తూ  కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో చట్టవిరుద్ధంగా రోడ్లను మూసివేసి లక్షలాది మందిని ఇబ్బందులకు గురిచేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.. లోకల్‌ మిలటరీ అథారిటీస్‌ (ఎల్‌ఎంఏ) నిబంధనలు ఉల్లంఘిస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా 21 రహదారులు మూసేశారంటూ పురపాలక మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆ రహదారులకు సంబంధించిన జాబితాను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ట్విటర్‌ ద్వారా పంపించారు. 

లక్షలాది మంది ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఆ రహదారులను తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చేలా చూడాలని కేంద్ర మంత్రిని కోరారు కేటీఆర్.   ఇదిగో జాబితా.. ఆయా రోడ్లను తక్షణమే తెరిచేలా లోకల్‌ మిలటరీ అథారిటీస్‌కు ఆదేశాలిస్తూ లక్షలాది మంది స్థానికులకు ఉపశమనం కలిగిస్తారని ఆశిస్తున్నాం అంటూ కిషన్ రెడ్డికి  ట్వీట్ చేశారు.అలాగే రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను ఉద్దేశిస్తూ కూడా కేటీఆర్‌ ఓ ట్వీట్‌ చేశారు. మీ మంత్రికి క్షేత్రస్థాయిలో పరిస్థితులపై అవగాహన లేనట్లుంది.. కంటోన్మెంట్‌లో మొత్తం 21 రోడ్లు మూసేస్తే, మీ మంత్రి కేవలం రెండే మూసేసినట్లు చెబుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. 

ఓవైపు వరి విషయంలో మోడీ సర్కార్ తో వార్ సాగుతుండగానే.. కేంద్రం పరిధిలోని కంటోన్మెంట్ సమస్యలను కేటీఆర్ బయటికి తీయడం చర్చగా మారింది. నిజానికి కేటీఆర్ చెబుతున్న కంటోన్మెంట్ రోడ్ల సమస్యలు చాలా కాలంగా ఉన్నాయి. రోడ్లను కొన్ని సార్లు ఓపెన్ చేయడం... కొన్ని సార్లు క్లోజ్ చేయడం జరుగుతోంది. అయినా ఆ సమస్యను కేటీఆర్ కొత్తగా బయటికి తీయడానికి బలమైన కారణమే ఉందంటున్నారు. వరి విషయంలో కేంద్రాన్ని ఇరికించాలని చూసిన వర్కవుట్ కాకపోవడంతో.. కేటీఆర్ ఇలా నరుక్కొచ్చారని అంటున్నారు. కంటోన్మెంట్ సమస్య ద్వారా ప్రజల దృష్టిలో మోడీ సర్కార్ ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశారని అంటున్నారు. వరి విషయంలో కేంద్రమంత్రి గోయెల్ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంతో డిఫెన్స్ లో పడిన గులాబీ లీడర్లు.. ఆ అంశాన్ని సైడ్ ట్రాక్ పట్టించడానికే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని కమలం నేతలు చెబుతున్నారు.  

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.