హుజురాబాద్ కు కేటీఆర్ దూరం.. కారణం ఇదేనా? 

Publish Date:Oct 2, 2021

Advertisement

తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నికకు నామినేషన్లు మొదలయ్యాయి. తొలి రోజే టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ వేశారు. హుజురాబాద్ ఎన్నికను సవాల్ గా తీసుకుంది టీఆర్ఎస్. తనపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న ఈటల రాజేందర్ ను ఓడించాలనే కసితో కేసీఆర్ ఉన్నారని అంటున్నారు. అందుకే ఆయనే+ స్వయంగా ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్నారని చెబుతున్నారు. కేసీఆర్ డైరెక్షన్ లోనే టీఆర్ఎస్ నేతలు హుజురాబాద్ లో తిరుగుతున్నారు. అయితే మంత్రి హరీష్ రావు అక్కడే మకాం వేసి ప్రచారం చేస్తుండగా.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ మాత్రం హుజురాబాద్ వైపు వెళ్లడం లేదు.

నిజానికి కేటీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఆయనే పెద్ద దిక్కు. కరీంనగర్ జిల్లా పరిధిలోనే హుజురాబాద్ ఉన్నా... కేటీఆర్ మాత్రం అక్కడ కనిపించడం లేదు. పార్టీకి అత్యంత కీలకం కావడంతో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ఈ ఫలితం ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇలాంటి కీలకమైన ఎన్నిక జరుగుతున్నా... కేటీఆర్ హుజురాబాద్ లో ప్రచారం చేయకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. అయితే కేటీఆర్ హుజురాబాద్ వెళ్లకపోవడానికి బలమైన కారణాలే ఉన్నాయని అంటున్నారు. 

సీఎం కేసీఆరే కావాలని కేటీఆర్ ను హుజురాబాద్ ప్రచారానికి దూరం పెట్టారని చెబుతున్నారు. ఇటీవల కాలంలో కేటీఆర్ పై ప్రజల్లో వ్యతిరేకత భారీగా పెరిగింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులోనూ ఆయన లింకులు బయటపడ్డాయని అంటున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు కేటీఆర్ సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. వర్షాలకు వరదలతో హైదరాబాద్ సహా రాష్ట్రంలోని మున్సిపాలిటీలన్ని అతలాకుతలం అయ్యాయి. వరద నివారణ చర్యలు చేపట్టడంలో మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వచ్చాయి. కేటీఆర్ పై అవినీతి ఆరోపణలు వినబడుతున్నాయి. ఉపఎన్నికలో కేటీఆర్ ప్రచారంలోకి దింపితే అంతిమంగా జనాల వ్యతిరేకత పార్టీ అభ్యర్ధి గెల్లు శ్రీనివాసయాదవ్ గెలుపుపై ప్రభావం చూపుతుందని కేసీయార్ కు రిపోర్టు వచ్చిందట.

అందుకనే  కేటీఆర్ ను హుజురాబాద్  దూరం పెట్టేసి మొత్తం బాధ్యతను మేనల్లుడు హరీష్ రావు మీదే కేసీఆర్ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. అంటే టీఆర్ఎస్ అభ్యర్ధి గెలుపు విషయంలో కేసీయార్ ఎలాంటి ఛాన్స్ తీసుకోదలచుకోలేదని అర్ధమైపోతోంది. కేసీఆర్ వ్యూహం ఎలా ఉన్నా... అత్యంత కీలకమైన ఉప ఎన్నికలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ ప్రచారం చేయకపోవడం పలు విమర్శలు తావిస్తోంది. హుజురాబాద్ లో ఓడిపోతాయమని తెలుసు కాబట్టే కొడుకు కేటీఆర్ ను ప్రచారం చేయమని కేసీఆర్ చెప్పడం లేదనే టాక్ కూడా ఉంది. దుబ్బాక తరహాలోనే పార్టీ ఓటమి భారాన్ని హరీష్ రావుపై నెట్టే ప్రయత్నం జరుగుతుందనే చర్చ కూడా సాగుతోంది.  

By
en-us Political News

  
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
ఇదే వేదికపై నుంచి   544.11 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రేవంత్ రెడ్డి,  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా   ప్రారంభించారు.
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.