కేసీఆర్ శ్రీరంగం పర్యటన అందుకేనా?

Publish Date:Dec 13, 2021

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేసి నేటికి మూడేళ్లు పూర్తయ్యాయి. రాష్ట్రం ఏర్పడిన అనంతరం రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సందర్భానికి, నాలుగేళ్ళ అనతరం రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భానికి పెద్దగా తేడాలేదు. కేసీఆర్ సారధ్యంలో తెరాస తొలిసారి కంటే, రెండవసారి   మరింత ఎక్కువ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. మూడింట రెండువంతుల (18 మందిలో12) మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కారెక్కడంతో. కారు జోరుకు తిరుగన్నదేలేకుండా పోయింది. కానీ,2019 లోక్’సభ ఎన్నికలలో తెరాస కథ అడ్డం తిరిగింది. కారు సారూ పదహారు బండి బోల్తా కొట్టింది. బీజేపీ నాలుగు, కాంగ్రెస్ మూడు ఎంపీ సీట్లను గెలుచుకున్నాయి. తెరాసకు సవాలు విసిరాయి. 

ఇక అక్కడి నుంచి కథ అడ్డం తిరిగింది. ప్రతి పక్షమే ఉండకూడదు అనుకుంటే, ఒకరికి ఇద్దరు తోడయ్యారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి,కేసీఆర్ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ముఖ్యంగా హుజూరాబాద్ ఓటమి తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్, కాళ్ళ కింద భూమి కదిలి పోతున్నట్లుగా షేక్ అవుతున్నారు. ఏదో తెలియని భయం ఆయన్ని భయంకరంగా వెంటాడుతోందని ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాల సమాచారం. ఓ వంక రాజకీయంగా వరస ఓటములు వెంటాడుతున్నాయి. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఓటమి దెబ్బ నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల బయట పడేస్తే, హుజూరాబాద్ ఏ గెలుపు భర్తీ చేయలేని భారీ దెబ్బ తీసింది.మరో వంక దాచేస్తే దాగని అవినీతి కుంభకోణాలు వెలుగు  చూస్తున్నాయి.అన్ని దిక్కుల నుంచి ఉచ్చులు బిగుసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి సన్నిహితులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు అందినట్లు సమాచారం. దీంతో ముఖ్యమంత్రి మరింతగా భయపదుతున్నట్లు తెలుస్తోంది. 

ఈ నేపధ్యంలోనే, కేసీఆర్ ఆత్మ రక్షణలో పట్టారు. ఢిల్లీతో వరి పేరున కయ్యానికి కాలు దువ్విన ఆయనే సయోధ్యకు కూడా ప్రయత్నించారని అంటారు. అయినా, నాలుగు రోజులు ఢిల్లీలో ఉండి వట్టి చేతులతతో వచ్చారు. మరోవంక, కేంద్రంలో బీజేపీ వ్యతిరేక శక్తులతో చేతులు కైపి రక్షణ వలయం ఏర్పరుచుకునే ప్రయత్నం చేస్తున్నారని పార్టీ వర్గాల సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా ఈరోజు తమిళనాడులోని శ్రీరంగం వెళ్లారు. శ్రీరంగం రంగనాథస్వామికి కుటుంబ సమేతంగా పూజలు ఆచరించి, మొక్కులు తీర్చుకునిందుకే ముఖ్యమంత్రి తమిళనాడు వెళ్లి నట్లు చెపుతున్నా, ఈ పర్యటనలో స్వామి కార్యంతో పాటుగా స్వకార్యం కూడా ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. శ్రీరంగం నుంచి చెన్నైవచ్చి, రేపు (మంగళవారం) ఉదయం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ను కలిసే అవకాశముందని అంటున్నారు. 

నిజానికి ప్రస్తుత చిక్కులోంచి బయట పాడేందుకు స్టాలిన్’తో ముఖ్యమంత్రి చర్చిస్తారని అంటున్నారు. అలాగే, స్టాలిన్’తోపాటుగా తెలంగాణ  రాష్ట్ర మాజీ గవర్నర్ నరసింహన్ను కలసి వారి సహకారం తీసుకునేందుకే కేసీఆర్ తమిళనాడు టూర్ ప్లాన్ చేశారని అంటున్నారు. స్టాలిన్ ద్వారా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ సహా ఇతర పార్టీలతో చేతులు కలిపే ప్రయత్నంలో భాగంగానే ముఖ్యమంత్రి స్టాలిన్’ను కలుస్తున్నారని అంటున్నారు. అలాగే  కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయంలో కేంద్ర వైఖరి, రాజకీయ అంశాలపై స్టాలిన్తో చర్చించనున్నారని అంటున్నారు. అదే విధంగా కేంద్రంతో మంచి సంబంధాలున్న మాజీ గవర్నర్ నరసింహన్ను మర్యాద పూర్వకంగా కలిసి వారి  ఆశీస్సులు తీసుకుంటారని అంటున్నారు. అయితే కేసీఆర్ ప్రస్తుత తమిళనాడు టూర్ విషయం,ఈ టూర్ వెనకున్న అసలు కథ ఎలాఉన్నా, కేసీఆర్ సెకండ్ టర్మ్ మొదటి మూడేళ్ళు  రాష్ట్రానికే కాదు, ముఖ్యమంత్రికి, ముఖ్యమంత్రి కుటుంబానికి కాసింత కష్టంగానే సాగాయి .. మిగిలిన రెండేళ్ళు ఎలా ఉంటాయో ..ఏమో .. చెప్పడం కష్టమే. 

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.